గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రవి కోసం ప్రభావతి నిరాహార దీక్ష.. తల్లికి బాలు సర్‌ప్రైజ్.. రవి పంపిన బిర్యానీ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే మంగళవారం (జులై 15) ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. రవి కోసం ప్రభావతి పస్తులు.. అది చూడలేక బాలు ఇచ్చే సర్‌ప్రైజ్.. ఎపిసోడ్ చివర్లో రోహిణి తండ్రి ట్విస్ట్ ఆసక్తి రేపాయి.

Published on: Jul 15, 2025, 08:29:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు జులై 15 ఎపిసోడ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఈ 767వ ఎపిసోడ్ లో రవి కోసం ప్రభావతి నిరాహార దీక్ష, ఆమెను చూసి అందరూ పస్తులు ఉండటం, అటు శృతికి రవి బిర్యానీ పట్టుకెళ్లడం, ఇటు తల్లి కోసం బాలు ఇచ్చే సర్‌ప్రైజ్ లతో ఎపిసోడ్ సరదాగా సాగిపోతుంది. ఇక రోహిణి తండ్రి అదృశ్యం గురించి కొత్త డ్రామా మొదలవుతుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రవి కోసం ప్రభావతి నిరాహార దీక్ష.. తల్లికి బాలు సర్‌ప్రైజ్.. రవి పంపిన బిర్యానీ
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రవి కోసం ప్రభావతి నిరాహార దీక్ష.. తల్లికి బాలు సర్‌ప్రైజ్.. రవి పంపిన బిర్యానీ

సత్యం ఆగ్రహం.. మనోజ్‌పై ప్రశ్నల వర్షం

ఎపిసోడ్ మనోజ్.. రోహిణితో కలిసి హాలులోకి వచ్చే సన్నివేశంతో ఆరంభమవుతుంది. మనోజ్ కిందికి వస్తూ.. “మీనా ఇంకా వంట చేయలేదా?” అని రోహిణిని అడుగుతాడు. “నాన్నా, బాగా ఆకలేస్తోంది” అని సోఫాలో కూర్చున్న సత్యంతో మనోజ్ అంటాడు. సత్యం ఆగ్రహంగా.. “ఎప్పుడూ తిండి గురించే ఆలోచిస్తావా? ఈ వయసులో జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటావా?” అని నిలదీస్తాడు.

మనోజ్ స్పందిస్తూ.. “కెనడాలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా, నాన్నా!” అని సమాధానమిస్తాడు. బాలు కూడా వచ్చి, “14 లక్షలు కట్టి బాస్‌కు జీతం ఇచ్చే జాబ్ చేయాలనుకుంటున్నావా? ఇప్పటికే లక్షలు మింగేసి మమ్మల్ని రోడ్డున పడేశావు” అని కౌంటర్ ఇస్తాడు. “నీ మలేషియా మామయ్య డబ్బు ఇస్తాడని ఊహించుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు” అని హెచ్చరిస్తాడు. కనీసం పార్క్ లో పల్లీలైనా అమ్ముకొని బతకరా అంటూ ఆటపట్టిస్తాడు. కానీ మనోజ్ మాత్రం ఇవేమీ పెద్దగా పట్టించుకోడు.

ప్రభావతి నిరాహార దీక్ష.. రవి కోసం ఆవేదన

మీనా టిఫిన్ సిద్ధం చేసి అందరినీ పిలుస్తుంది. బాలు, మనోజ్, రోహిణి, సత్యం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు. బాలు సందేహంగా.. “అమ్మ ఎక్కడ, మీనా?” అని అడుగుతాడు. “గదిలోనే ఉంది, టిఫిన్‌కు రమ్మని చెప్పినా ఏమీ చెప్పకుండా తలుపు మూసేసింది” అని మీనా చెబుతుంది.

అంతలో ప్రభావతి కోపంగా వచ్చి.. “నా కొడుకు రవిని, కోడలు శృతిని ఇంటి నుంచి గెంటేసి, మీరు ప్రశాంతంగా కడుపు నిండా తింటారా?” అని మండిపడుతుంది. బాలు, మనోజ్, “అమ్మా, నువ్వూ తిను!” అని బతిమిలాడతారు. కానీ ప్రభావతి మాత్రం “రవి ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను నీళ్లు కూడా తాగను” అని నిరాహార దీక్ష ప్రకటిస్తుంది.

కుటుంబమంతా పస్తులు

ప్రభావతి నిరాహార దీక్షతో కుటుంబం ఆందోళనకు గురవుతుంది. సత్యం, మనోజ్, రోహిణి, మీనా ఆమెను ఒప్పించేందుకు చాలా సేపు ప్రయత్నిస్తారు. కానీ ప్రభావతి, “నా కొడుకు రవి వచ్చే వరకు నేను తినను” అని పట్టుబడుతుంది.

సత్యం కూడా “నువ్వు తినకపోతే నేనూ తినను” అని ప్రభావతితో అంటాడు. దీంతో రోహిణి, మనోజ్ కూడా తినడానికి నిరాకరిస్తారు. అటు మీనా.. బాలును, “అత్తయ్యను తినిపించేలా ఏదైనా ప్లాన్ చెయ్యి” అని చెబుతుంది. కుటుంబం మొత్తం పస్తులతో ఆపసోపాలు పడుతుంది.

శృతికి రవి బిర్యానీ

అటు శృతి డబ్బింగ్ స్టూడియోకి వెళ్తాడు రవి. ఫుడ్ ఆర్డర్ ఇచ్చావు కదా.. అందుకే తీసుకొచ్చాను శృతితో రవి అంటాడు. మీ హోటల్లో ఆర్డర్ పెడితే నువ్వే తీసుకొస్తావని తెలిసే చేశానని శృతి అంటుంది. ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారు.

ఈ సందర్భంగానే డబ్బింగ్ తర్వాత ఇంటికెళ్దామని శృతితో రవి అంటాడు. బాలు వచ్చాడని, మన కోసం అతడు ఒక అడుగు దిగి వచ్చాడు కదా అని రవి చెబుతాడు. మీనా వదిన కూడా వచ్చిందని శృతి కూడా చెబుతుంది.

బాలు సర్‌ప్రైజ్.. రవి పంపిన బిర్యానీ

బాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు బయటకు వెళ్లి బిర్యానీ తెస్తాడు. “అందరం కలిసి బిర్యానీ తిందాం” అని పిలుస్తాడు. మనోజ్ ఆకలితో అలమటిస్తూ.. “బిర్యానీ చూస్తే ఆకలి రెట్టింపవుతోంది” అని అంటాడు. కానీ ప్రభావతి మళ్లీ తినడానికి నిరాకరిస్తుంది. “ఈ బిర్యానీ నేను కొనలేదు, రవి పంపాడు. అతను రెస్టారెంట్‌లో నువ్వు తినడం లేదని బాధపడి, ఇంట్లో అందరికీ బిర్యానీ స్వయంగా వండి పంపాడు” అని చెబుతాడు.

దీంతో ప్రభావతి.. “అంత ప్రేమ ఉంటే రవి స్వయంగా రావచ్చు కదా?” అని అడుగుతుంది. సత్యం జోక్యం చేసుకొని.. “వాడు వచ్చే సమయంలో వస్తాడు, ఇప్పుడు తిందాం” అని ఒప్పిస్తాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో అందరూ తినడానికి సిద్ధమవుతారు. దీంతో ప్రభావతి స్పందిస్తూ.. తన కొడుకు పంపిన బిర్యానీ తాను తినకుండా మీరంతా ఎలా తింటారంటూ రుసరుసలాడుతూ వచ్చి తినడానికి కూర్చొంటుంది.

రోహిత్ తండ్రి అదృశ్యం.. మరో డ్రామా

బిర్యానీ తింటూ ఉండగా, ప్రభావతి మళ్లీ రోహిణి తండ్రి అదృశ్యం గురించి అడుగుతుంది. “రోహిణి, నీ నాన్న ఇంకా ఎక్కిన ఫ్లైట్ ఆకాశంలోనే తిరుగుతోందా?” అని సెటైర్ వేస్తుంది. రోహిణి మౌనంగా ఉండి, ఎలాంటి సమాధానం ఇవ్వదు. ఇంతలో బాలు కలగజేసుకోవడంతో ఆమె ఆ టాపిక్ అక్కడితో వదిలేస్తుంది.

అయితే అందరూ తినడం పూర్తయిన తర్వాత రోహిణి గదికి వెళ్లి బిర్యానీ అరిగిందా అని అడుతుంది. మీ నాన్న ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలోనే గద్దలా తిరుగుతోందా అని ప్రభావతి నిలదీస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే రేపటి ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి తండ్రిని మలేషియాలో అరెస్ట్ చేశారన్న కొత్త డ్రామా మొదలైనట్లు చూపించి ఆసక్తి రేపారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More