Gunde Ninda Gudi Gantalu: 80's రెట్రో లుక్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా.. మీకు నచ్చారా?

Gunde Ninda Gudi Gantalu Balu Meena Retro Look: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫేవరెట్ జోడీ బాలు, మీనా ఇప్పుడున్న ట్రెండ్ కు తగినట్లుగా మారిపోయారు. తాజాగా చాట్‌జీపీటీ 80ల నాటి లుక్ ఫొటోలకు ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా. ఆ లుక్ లోకి ఈ జోడీ కూడా మారిపోవడం విశేషం.

Published on: Sep 10, 2026, 17:10:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Balu Meena 80's Look: స్టార్ మా ప్రైమ్ టైమ్ బ్యాండ్‌ను షేక్ చేస్తున్న పాపులర్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు' బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజూ సరికొత్త ట్విస్టులు, ఎమోషనల్ డ్రామాతో సాగే ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రలైన బాలు, మీనా జోడీకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ క్రేజీ కపుల్ 80ల నాటి క్లాసిక్ రెట్రో అవతారంలో మెరిసి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

Gunde Ninda Gudi Gantalu: 80's రెట్రో లుక్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా.. మీకు నచ్చారా?
Gunde Ninda Gudi Gantalu: 80's రెట్రో లుక్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా.. మీకు నచ్చారా?

మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రత్యేక ఫొటోలో బాలు, మీనా డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించారు. 80ల కాలం నాటి వింటేజ్ ఫ్యాషన్, హెయిర్ స్టైల్, క్లాసిక్ అవుట్‌ఫిట్స్‌లో వీరిద్దరి లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

80ల నాటి క్లాసిక్ వైబ్స్.. బాలు, మీనా మేక్‌ఓవర్

ప్రస్తుతం చాట్‌జీపీటీ 80's లుక్ ప్రాంప్ట్ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ తమను తాము 1980లలోకి తీసుకెళ్లి తాము ఎలా ఉంటామో చూసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు స్టార్ మా ఛానెల్ కూడా తమ సూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు నుంచి బాలు, మీనా జోడీకి ఈ స్పెషల్ రెట్రో లుక్ సెట్ చేసి తమ ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

‘మన బాలు, మీనాల 80ల నాటి లుక్ మీకు నచ్చిందా.. గుండె నిండా గుడి గంటలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు’ అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ 80ల నాటి లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. బెల్ బాటమ్ ప్యాంట్స్, రెడ్ షర్ట్, దానిపై డెనిమ్ జాకెట్, రెట్రో హెయిర్‌స్టైల్‌తో బాలు మాస్ అండ్ క్లాసిక్ కాంబినేషన్‌లా కనిపిస్తుంటే, మీనా తన సహజసిద్ధమైన రెడ్ పోల్కా డాట్స్ ఉన్న చీర కట్టులో, పాతకాలపు హెయిర్ డూతో పర్‌ఫెక్ట్ 80స్ హీరోయిన్‌ను తలపిస్తోంది.

టీఆర్‌పీ చార్ట్స్‌లో టాప్ గేర్.. రికార్డు రేటింగ్స్

రాత్రి 9 గంటల స్లాట్‌లో ప్రసారమయ్యే 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ వరుసగా బెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌ సాధిస్తూ దూసుకుపోతోంది. ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద కొడుకును మాత్రమే ఇష్టపడే తల్లి, ఇంటిని మోసం చేసే పెద్ద కోడలు, వాళ్ల మధ్య వచ్చే గొడవలు, పంతాలు, పట్టింపుల చుట్టూ సాగే సీరియల్ ఇది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బాలు, మీనా పాత్రలు తెలుగు ఇళ్లలోకి బాగా చేరాయి. ఈ హిట్ పెయిర్ సీరియల్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More