Gunde Ninda Gudi Gantalu Promo: ప్రభావతి కేసు వాపసు వెనుక సీక్రెట్ తెలుసుకున్న రోహిణి.. 2 లక్షలంటూ నోరు జారిన కామాక్షి

Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమోలో అత్త ప్రభావతి ఇంటికి తిరిగి రావడం, కేసు వాపసు వెనుక సీక్రెట్ ను రోహిణి తెలుసుకుంటుంది. కామాక్షిని మెల్లగా దువ్వి ఆమె తనకు కావాల్సిన నిజాన్ని రాబట్టుకున్నట్లు ప్రోమోలో చూపించారు.

Published on: Apr 4, 2026, 08:13:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమోలో ప్రభావతిని అసలు సీక్రెట్ ఏంటో రోహిణి తెలుసుకున్నట్లుగా చూపించారు. ఈ మధ్య రసవత్తరంగా సాగుతూ ప్రతి ఎపిసోడ్ ను రక్తి కట్టిస్తున్న మేకర్స్.. తర్వాతి ఎపిసోడ్ ను మరింత ఆసక్తిగా మలిచినట్లు దీనిని చూస్తే తెలుస్తోంది.

Gunde Ninda Gudi Gantalu Promo: ప్రభావతి కేసు వాపసు వెనుక సీక్రెట్ తెలుసుకున్న రోహిణి.. 2 లక్షలంటూ నోరు జారిన కామాక్షి
Gunde Ninda Gudi Gantalu Promo: ప్రభావతి కేసు వాపసు వెనుక సీక్రెట్ తెలుసుకున్న రోహిణి.. 2 లక్షలంటూ నోరు జారిన కామాక్షి

ప్రభావతి గుట్టు తెలుసుకున్న రోహిణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రాబోయే సోమవారం (ఏప్రిల్ 6) ఎపిసోడ్ లో అత్త ప్రభావతి తన కేసు వాపసు తీసుకోవడం, ఇంటికి తిరిగి రావడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో రోహిణి తెలుసుకోబోతోంది. ఆమె తిరిగి వచ్చినప్పటి నుంచీ అనుమానంగానే చూసిన రోహిణి.. ఇవే విషయాన్ని మనోజ్ తో చెబుతుంది. ఆ తర్వాత మెల్లగా కామాక్షి ఇంటికి వెళ్లి ఆమెకు సేవలు చేస్తుంది.

అసలు అత్తయ్య ఇంత త్వరగా ఇంటికి వస్తుందని అనుకోలేదు అని అంటుంది. దీంతో లాయర్ ఇచ్చిన రూ.2 లక్షల వల్ల ఆమె ఇంటికి వచ్చింది అని కామాక్షి అసలు నిజం చెప్పేస్తుంది. దీంతో రోహిణి షాక్ తిన్నట్లు ప్రోమోలో చూపించారు. కామాక్షి ఇంట్లోనే ఉన్న ఆ డబ్బును రోహిణి ఏం చేయబోతోంది? ఈ నిజాన్ని ఆమె ఇంట్లో వాళ్లకు చెబుతుందా లేదా? ప్రభావతి సీక్రెట్ సీక్రెట్ గానే ఉంటుందా లేదా అన్నది తర్వాతి ఎపిసోడ్ లో చూడొచ్చు.

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

బాలు లాయర్ మాటలకు బోల్తా పడి రూ.2 లక్షలు తీసుకున్న ప్రభావతి.. కేసు వాపసు తీసుకుంటుంది. ఆ తర్వాత సొంతింటికి తిరిగి వస్తుంది. నేరుగా వస్తే బాగుండదని మనోజ్ కు ఫోన్ చేసి బయటకు రమ్మని చెబుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరూ బతిమాలి బలవంతంగా తీసుకొచ్చినట్లు బిల్డప్ ఇస్తుంది. బాలు ఆమెను చూసి తనదైన స్టైల్లో చాలా పంచ్ లే వేస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కోడళ్లు కలిసి ప్రభావతికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు.

బాలుని చితకబాదిన ప్రభావతి

ప్రభావతి లోనికి వచ్చిన తర్వాత కూడా బాలు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. సత్యం కోసమే తాను వచ్చానని అనడంతో నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదు మరి అని సత్యం అడుగుతాడు. మీనా వాళ్ల ఫ్యామిలీ కూడా వచ్చి చేతులు జోడించి వేడుకున్నారని ప్రభావతి చెబుతుంది.

అప్పుడే సత్యం రెండో పెళ్లి ప్రస్తావన వస్తుంది. బాలు సైగ చేయడంతో సత్యం కూడా అవును రెండో పెళ్లి చేసుకుంటానని అంటాడు. బాలు రెచ్చగొట్టడంతో ప్రభావతి అతన్ని చితకబాదుతుంది. కిందేసి మరీ కొడుతుంది.

మీనా పుట్టింటి వాళ్లు రావద్దని షరతు

ఆ తర్వాత మీనాకు మరో షరతు పెడుతుంది. ఇక నుంచి మీనా పుట్టింటి వాళ్లు ఈ ఇంటికి రావద్దని, వాళ్ల వల్ల జరిగిన అవమానం చాలు అని ప్రభావతి అంటుంది. బాలు, సత్యం వారిస్తుంటే.. మీనా మాత్రం అత్తయ్య కరెక్ట్ గానే చెప్పారు.. వాళ్లు ఏరోజూ నా ఇంట్లో మంచి నీళ్లు తాగలేదు.. తినలేదు.. ప్రతిసారీ అవమానమే జరుగుతోంది. దాని కంటే వాళ్లు ఈ ఇంటికి రాకపోవడమే మంచిది అని అంటుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More