Gunde Ninda Gudi Gantalu Today Episode: కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్.. ప్రభావతి ఆశలు గల్లంతు.. మళ్లీ విలన్‌గా మారిన బాలు

Gunde Ninda Gudi Gantalu Serial August 22nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 22 ఎపిసోడ్ లో రోహిణి ఆడిన నాటకం తెలిసి మనోజ్ కళ్లు తిరిగి పడిపోతాడు. తల్లి ప్రభావతికి నిజం చెప్పలేక సతమతమవుతాడు.

Published on: Aug 22, 2026, 07:14:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ షాపుకి వెళ్లేందుకు రోహిణి ఆడిన మరో నాటకం కూడా బయటపడిపోతుంది. ఈసారి కూడా ఆమె జీవితానికి బాలునే విలన్ గా మారతాడు. మనోజ్ లక్షలు తీసుకొస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రభావతికి మళ్లీ నిరాశే ఎదురవుతుంది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్.. ప్రభావతి ఆశలు గల్లంతు.. మళ్లీ విలన్‌గా మారిన బాలు
Gunde Ninda Gudi Gantalu Today Episode: కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్.. ప్రభావతి ఆశలు గల్లంతు.. మళ్లీ విలన్‌గా మారిన బాలు

రోహిణి వెళ్లడానికి ప్రభావతి గ్రీన్ సిగ్నల్

పెద్ద ఆర్డర్ వచ్చిందని, రోహిణి షాపుకి వస్తేనే ఆ ఆర్డర్ పూర్తవుతుందని ఆమెను మనోజ్ తీసుకెళ్లే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 22) ఎపిసోడ్ మొదలవుతుంది. అత్తయ్య వెళ్లమంటేనే వెళ్తాను అని రోహిణి అంటుంది. అది చూసి ఈ నాటకం చూసి తట్టుకోలేకపోతున్నానని బాలు అంటాడు. రవి, శృతి కూడా అదే అంటారు.

చివరికి రోహిణిని నువ్వు తీసుకెళ్లు అని మనోజ్ కు ప్రభావతి చెప్పి పంపిస్తుంది. వాళ్లు వెళ్లిన తర్వాత బాలుకి డౌట్ వస్తుంది. నా ఫ్రెండ్ ను పరిచయం చేస్తానని మీనాతో చెప్పి ఆమెను తీసుకెళ్తాడు.

బాలుని కలిసిన ఫ్రాడ్ ఫ్రెండ్ రాజు.. రోహిణి గుట్టు రట్టు

బాలు, మీనా అతని ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంతలో ఖరీదైన కారులో అతడు వస్తాడు. అతన్ని చూడగానే ఫ్రాడ్ రాజిగా అని బాలు అంటాడు. అది విని మీనా షాక్ తింటుంది. మీనాను రాజుకు పరిచయం చేస్తాడు బాలు. ఈ మధ్యే పెద్ద జైలు నుంచి వచ్చానని అతడు చెప్పడంతో మీనా ఆశ్చర్యపోతుంది. ఏదో ఉద్యోగం కావాలన్నావ్.. ఇలా ఖరీదైన కారులో వచ్చావేంట్రా అని అడిగితే.. ఇది మరో నాటకం.. నాకంటే పెద్ద లేడీ ఖిలాడీ చెబితే ఈ పని చేస్తున్నానని రాజు చెబుతాడు.

అసలు ఏం చేయబోతున్నావ్ అని అడిగితే.. ఆ మాయ లేడీ తనకు రూ.5 వేలు ఇస్తానని చెప్పిందని, ఓ ఫర్నీచర్ షాపులో నకిలీ ఆర్డర్ ఒకటి ఇవ్వమన్నదని అంటాడు. ఇంతకీ ఆ షాపేంటి అని బాలు అడిగితే.. ప్రభావతి ఫర్నీచర్ అని చెబుతాడు. అది విని బాలు, మీనా షాక్ తింటారు. అంటే రోహిణి మరో నాటకమాడుతోందని వాళ్లకు అర్థమవుతుంది. ఆ తర్వాత రాజు వెళ్లిపోతాడు.

షాపులో అడుగుపెట్టిన రోహిణి.. మనోజ్‌ను బుట్టలో పడేసి..

ఇటు ఎలాగాలో తన పంతం నెగ్గించుకొని మళ్లీ షాపులో అడుగు పెడుతుంది రోహిణి. ఆమెను చూడగానే అక్కడి సేల్స్ పర్సన్ వచ్చి ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు మేడమ్.. అసలు మనోజ్ సార్ ఏ పనీ చేయడం లేదు.. ఏది అడిగినా తర్వాత చూద్దాంలే అంటున్నాడని ఫిర్యాదు చేస్తుంది. మీరు ఉన్నప్పుడే బిజినెస్ బాగా నడిచేదని అంటుంది. మనోజ్ ఆమెను తిట్టి పంపిస్తాడు.

ఆ తర్వాత మనోజ్ ను మెల్లగా బుట్టలో పడేయడం మొదలు పెడుతుంది రోహిణి. నీకోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను.. ఎగ్జిక్యూటివ్ వచ్చాడా అని అడుగుతుంది. వచ్చాడు.. పాలసీ డాక్యమెంట్ కూడా ఇచ్చాడని మనోజ్ అంటాడు. మరి నువ్వెందుకు తీసుకోలేదని అడిగితే నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా.. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని సెంటిమెంట్ డైలాగ్ కొడుతుంది. ఆ తర్వాత స్వామీజీ ఇచ్చి విభూతిని మనోజ్ ఆమెకు ఇస్తాడు. ఇది ఎవరు ఇచ్చారని రోహిణి తెలియనట్లు అడుగుతుంది.

నువ్వు నాకోసం యాగం చేయించావట కదా.. ఆ విభూతి స్వామీజీ ఇచ్చి వెళ్లాడు అని మనోజ్ అంటాడు. నేను చెప్పొద్దని అన్నాను.. అయినా ఒకరి కోసం మనం చేసిన మంచిని చెప్పొద్దని రోహిణి భారీ డైలాగులు కొట్టడంతో మనోజ్ కరిగిపోతాడు. తన కోసం ఎంతో చేస్తోందని, ఈమెనా నేను అనుమానించింది అని మనసులో అనుకుంటాడు.

మనోజ్ షాపుకి బాలు ఫ్రాడ్ ఫ్రెండ్

ఇంతలో మనోజ్ షాపుకి మళ్లీ బాలు ఫ్రాడ్ ఫ్రెండ్ రాజు వస్తాడు. ఈసారి అతడు మరింత ఎక్కువ బిల్డప్ ఇస్తాడు. మీ రెండు ఫామ్ హౌస్ లు అమ్మేశారా అని రోహిణి అడిగితే.. లేదు ఫ్రీగా ఇచ్చేశానని అంటాడు. రోహిణి చెప్పడం వల్లే తాను ఇక్కడ భారీ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానంటాడు.

అగ్రిమెంట్ రెడీ చేయించావా అని మనోజ్ ను అడిగితే.. చేయించానంటూ దానిని చేతిలో పెడతాడు మనోజ్. అక్షరం ముక్క చదవడం రాని రాజు.. అందులో ఏ, బీ, సీ అంటూ ఏదో చదువుకుంటాడు. రూ.5 లక్షల అడ్వాన్స్ చెక్కు తెచ్చారా అని మనోజ్ అంటే.. 5 కాదు 10 లక్షలు తెచ్చానంటూ నకిలీ చెక్కు అతనికి ఇవ్వబోతాడు.

చెక్కు చించేసిన బాలు

ఇంతలో అక్కడికి వచ్చిన బాలు ఆ చెక్కు తీసుకుంటాడు. దీంతో మనోజ్ అతనిపై మండిపడతాడు. ఎన్ని లక్షల చెక్కు రా ఇది అని తన ఫ్రెండ్ ను అడుగుతాడు. రూ.10 లక్షలు.. నీ జీవితంలో ఎప్పుడైనా చూశావా అని మనోజ్ ఎగతాళి చేస్తాడు. చూసే లోపు నువ్వే మింగేశావు కదా అని అంటాటు బాలు.

రాజు నాటకాన్ని మనోజ్ ముందు బాలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ మనోజ్ నమ్మడు. అయితే పోలీసులు, మీడియా వాళ్లకు ఫోన్ చేయండి.. ఎలాగూ రోహిణి మేకప్ తో రెడీ అయి వచ్చింది.. మీ ఫ్రాడ్ ఫ్రెండ్ సూటుబూటుతో ఉన్నాడు.. వాళ్లే బయటపెడతారు అని మీనా అంటుంది. దీంతో రోహిణి భయపడుతుంది.

అతడు పెద్ద బిజినెస్ మ్యాన్ అని, పెద్ద బిజినెస్ పెట్టబోతున్నాడని మనోజ్ అంటాడు. అవునా అంటూ అగ్రిమెంట్ చదవమని రాజుకి ఇస్తాడు బాలు. అతడు చదవలేకపోతాడు. బాలు చెక్కు చించి గాల్లోకి విసురుతాడు.

రోహిణి నాటకం బయటపెట్టిన బాలు, మీనా

అది చూసి మనోజ్ షాకవుతాడు. అసలు ఎందుకొచ్చారు.. చెక్కు ఎందుకు చించేశావని బాలుని నిలదీస్తాడు. నీ భార్య నిన్ను మరోసారి మోసం చేయకుండా అడ్డుకునేందుకే వచ్చానని బాలు చెబుతాడు. వీడో ఫ్రాడు.. ఆ చెక్కు కూడా నకిలీదే అని బాలు అంటాడు. నువ్వు మోసం చేయడానికి వచ్చింది నా అన్ననేరా.. ఇదంతా చేయించింది ఎవరో చెప్పు అని రాజుని బెదిరిస్తాడు బాలు.

దీంతో రాజు అసలు నిజం చెప్పేస్తాడు. రోహిణి వైపు చూపిస్తూ ఆమెనే ఈ పని చేయించింది.. ఈ నకిలీ చెక్కు కూడా ఆమెనే ఇచ్చింది అని చెప్పడంతో మనోజ్ కళ్లు తిరిగి పడిపోతాడు. అతని ముఖానికి నీళ్లు కొట్టి లేపుతాడు బాలు. ఇప్పటికైనా అర్థమైందా నీ భార్య ఎలాంటిదో అని చెప్పడంతో ఆమెను చీదరించుకుంటాడు మనోజ్.

తల్లికి నిజం చెప్పలేక..

ఇటు ఇంట్లో బాలు, మీనా అసలు నిజం చెప్పకుండా దాస్తారు. ఇంతలో మనోజ్, రోహిణి షాపు నుంచి తిరిగి రావడంతో ప్రభావతి ఆశగా వాళ్ల దగ్గరికి వెళ్తుంది. ఏదీ పది లక్షల చెక్కు తెచ్చావా అని మనోజ్ ను అడుగుతుంది. కానీ డీల్ కాలేదని మనోజ్ అంటాడు. వాడు దాస్తున్నాడు అని బాలు అనడంతో ఏంటి చెక్కు దాస్తున్నాడా అని ప్రభావతి అడుగుతుంది. కాదు నిజం అని బాలు అనడంతో ఇక నన్ను మరోసారి ఇంటి నుంచి పంపించేయడం ఖాయం అని రోహిణి మనసులో అనుకుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More