గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకు పొలిటికల్ లీడర్ వార్నింగ్ -గుణ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ -మీనా టెన్షన్
గుండె నిండా గుడి గంటలు జూన్ 10 ఎపిసోడ్‌లో బాలు పూల దండల ట్రక్‌ను గుణ మనుషులు కొట్టేస్తారు. టైమ్‌కు తాను ఆర్డర్ ఇచ్చిన పూల మాలలు రాకపోవడంతో బాలుపై వీరబాబు ఫైర్ అవుతాడు. ఇంకో అరగంటలో మాలలు రాకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు.
పూల దండలు కట్టడానికి వచ్చిన వాళ్లతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిద్రపోతారు. మీనా మాత్రం భర్త మాట పోకూడదని రాత్రంతా మేల్కొని కష్టపడుతుంది. మీనా కోసం టీ పెట్టి తీసుకొస్తాడు బాలు. టీలో షుగర్ వేయడం మర్చిపోతాడు. బాలు తన కోసం ప్రేమగా టీ పెట్టడంతో బాగాలేదని చెప్పడం ఇష్టం లేక షుగర్ లేకపోయినా తాగేస్తుంది మీనా.

గుణ ప్లాన్...
పూల మాలల లోడ్‌తో కూడిన ట్రక్‌ను కొట్టేయాలని గుణ మనుషులు అనుకుంటారు. బాలు ఉన్నప్పుడు కొట్టేస్తే రిస్క్ అని తన మనుషులను హెచ్చరిస్తాడు గుణ. ట్రక్‌లో పూల మాలలు లోడ్ చేసి పంపిస్తారు బాలు, మీనా. ఆ ట్రక్‌ను గుణ మనుషులు ఫాలో అవుతారు. ట్రక్ డ్రైవర్‌ను బురిడీ కొట్టించి వ్యాన్ కొట్టేస్తారు గుణ మనుషులు.
బాలు టెన్షన్...
చెప్పిన టైమ్‌కు పూలమాలలు రాకపోవడంతో పొలిటికల్ లీడర్ వీరబాబు...బాలు స్నేహితుడు అశోక్‌పై నిప్పులు చెరుగుతాడు. వీరబాబు మాటలకు భయపడ్డ అశోక్ వణికిపోతాడు. బాలుకు ఫోన్ చేసి దండలు ఇంకా రాలేదని అంటాడు. డ్రైవర్‌కు ఫోన్ చేయాలని బాలు అనుకుంటాడు. కానీ డ్రైవర్ నుంచే మిస్‌డ్ కాల్స్ ఉండటంతో కంగారు పడతాడు. డ్రైవర్ ఫోన్ చేసి ట్రక్ ఎవరో ఎత్తుకుపోయారని అంటాడు. ఏం జరిగిందో బాలుకు చెబుతాడు డ్రైవర్. అతడి మాటలు విని బాలు టెన్షన్ పడతాడు. ట్రక్ వెతకడానికి బాలు, మీనా ఇద్దరు కలిసి బయలుదేరుతారు.
గుణ సంబరం...
ట్రక్‌ను కొట్టేసిన విషయం గుణకు చెబుతారు అతడి మనుషులు. తన ప్లాన్ సక్సెస్ కావడంతో గుణ సంబరపడతాడు. ఆ ట్రక్‌లోని పూల మాలలను డంపింగ్ యార్డ్‌లో పడేసి తగలపెట్టమని చెబుతాడు. ట్రక్‌ను వెతకడానికి ఆటోలో మీనా, బాలు బయలుదేరుతారు. వారిని సీక్రెట్‌గా కారులో ఫాలో అవుతాడు గుణ. బాలు, మీనా టెన్షన్‌ను కళ్లారా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడుగుణ.
నిన్ను చంపేస్తా...
టైమ్‌కు పూల మాలలు చేరకపోవడంతో బాలుపై కోపంతో వీరబాబు రగిలిపోతాడు. బాలుకు ఫోన్ చేసి ఆరగంట టైమ్ ఇస్తాడు. ఈ లోపు పూల మాలలు రాకపోతే నిన్ను, అశోక్‌ను చంపేస్తానని వార్నింగ్ ట్రక్‌ను ఎవరో ఎత్తుకుపోయారని బాలును చెప్పిన మాటలను వీరబాబు నమ్మడు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి తన పేరును చెడగొట్టడానికి బాలు అబద్దాలు ఆడుతున్నాడని అంటాడు.
కనిపిస్తే చెప్పండి...
మన కష్టం వృథా పోదని, తప్పకుండా ట్రక్ దొరుకుతుందనే నమ్మకముందని మీనా అంటుంది. మిస్సయిన ట్రక్ ఫొటోలు, బండి నెంబర్‌ను తమ డ్రైవర్స్ వాట్సప్ గ్రూప్‌లో పెడతాడు బాలు. ఈ ట్రక్‌ను ఎవరో ఎత్తుకుపోయారని, ఎక్కడైనా కనిపిస్తే తనకు వెంటనే తెలియజేయమని అంటాడు. ఆ ట్రక్‌ను ఓ ఆటో డ్రైవర్ చూస్తాడు. డంపింగ్ యార్డ్‌కు వెళ్లే రూట్‌లో ఉందని బాలుకు చెబుతాడు. రాజేష్ పాటు మరికొంత మంది ఆటో డ్రైవర్‌లు ట్రక్‌ను ఫాలో అవుతారు. గుణ మనుషులను పట్టుకుంటారు.
ట్రక్‌ను పట్టుకున్న రాజేష్...
నీతో ఎవరు ఈ పనిచేయించారో చెప్పమని గుణ మనుషులను కొడతాడు బాలు. తన మనుషులు దొరికిపోవడంతో గుణ టెన్షన్ పడతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


