గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: మీనా గిఫ్ట్‌తో బాలు ఫుల్ ఖుషి ‍- కారు ధ‌ర విని నోరెళ్ల‌బెట్టిన ప్ర‌భావ‌తి

గుండె నిండా గుడి గంట‌లు జూన్ 17 ఎపిసోడ్‌లో త‌న కొత్త‌ కారును కుటుంబ‌స‌భ్యుల‌కు చూపిస్తాడు బాలు. పూల కొట్టుపై వ‌చ్చిన లాభంతో మీనా త‌న కోసం ఈ కారు కొన్న‌ద‌ని చెబుతాడు. ఈ కారు ధ‌ర ప‌ది ల‌క్ష‌లు ఉంటుంద‌ని బాలు చెప్ప‌గానే ప్ర‌భావ‌తి షాక‌వుతుంది.

Published on: Jun 17, 2025 7:42 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలు కోసం కారు కొంటుంది మీనా. గుడిలో పూజ జ‌రిగే వ‌ర‌కు అది తానే కొనిచ్చిన విష‌యం బాలు ద‌గ్గ‌ర దాచిపెడుతుంది. కారు ఓన‌ర్‌వి నువ్వేన‌ని, నీ కోస‌మే మీనా ఈ కారు కొన్న‌ద‌ని బాలుతో పూజారి చెబుతాడు.

గుండె నిండా గుడి గంట‌లు జూన్ 17 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంట‌లు జూన్ 17 ఎపిసోడ్‌

కారు ఓన‌ర్‌గా చూసిన మిమ్మ‌ల్ని ఆటో డ్రైవ‌ర్‌గా చూడ‌లేక‌పోయాన‌ని, మీ కోస‌మే ఈ కారు కొన్నాన‌ని మీనా అంటుంది. పూల మాల‌ల ఆర్డ‌ర్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే కారు కొన్నాన‌ని చెబుతాడు. మీనా మాట‌ల‌తో బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు.

ఓన‌ర్‌గారు...

పూజ పూర్త‌యిన త‌ర్వాత బాలుకు కారు కీస్ ఇస్తుంది మీనా. కారు తీయండి ఓన‌ర్ కారు...న‌న్ను మా అత్త‌గారి ఇంటి ద‌గ్గ‌ర దించండి. బోణి డ‌బ్బులు నేను ఇస్తాన‌ని మీనా అంటుంది. కారు బాగుంద‌ని బాలు అంటాడు. బాలు మౌనంగా ఉంటాడు. ఏమైంద‌ని మీనా అంటుంది. చాలా సంతోషంగా ఉన్నాన‌ని, అందుకే మాట‌లు రావ‌డం లేద‌ని చెబుతాడు.

అంత‌కుమించి....

మిమ్మ‌ల్ని ఎవ‌రూ త‌క్కువ చేసి మాట్లాడ‌కూడ‌ద‌నే కారు కొన్నాన‌ని బాలుతో అంటుంది మీనా. మీరు సంతోషంగా ఉన్నారు అంత‌కుమించి నాకు ఏది అక్క‌ర‌లేద‌ని మీనా చెబుతాడు. నువ్వు నాకు కారు కొనిచ్చావు క‌దా...నీకు ఏదైనా ఇవ్వాల‌ని అనిపిస్తుంద‌ని బాలు అంటాడు.

ఇది ఇళ్లు కాదు రోడ్డు అని మీనా సెటైర్ వేస్తుంది.రోడ్డు ప‌క్క‌న కారు ఆపి మీనా కోసం మ‌ల్లెపూలు కొంటాడు. మీనా జ‌డ‌లో పెడ‌తాడు. ప‌ల్లెపూల మ‌ధ్య విరిసిన రోజా పువ్వులా ఉన్నావ‌ని మీనాతో అంటాడు బాలు.

బాలు, మీనా పేరు క‌లిసివ‌చ్చేలా...

త‌న స్నేహితుల‌కు కారు చూపించ‌డానికి వ‌స్తాడు బాలు. మీనా కారు కొన‌డం గురించి నీ కంటే మాకే ముందు తెలుసు అని అంద‌రూ అంటారు. మీనా కారు కొనిచ్చింది కాబ‌ట్టి అందుకు గుర్తుగా మీనా పేరులోని మొద‌టి అక్ష‌రం ఎమ్‌ను కారుపై స్టిక్క‌రింగ్ వేయ‌మ‌ని అంటాడు బాలు. ఇద్ద‌రు పేరు క‌లిసి వ‌చ్చేలా బీఎమ్ అని వేయ‌మ‌ని రాజేష్ స‌ల‌హా ఇస్తాడు. అత‌డి ఐడియా బాగుంద‌ని బాలు అంటాడు.

ప్ర‌భావ‌తికి రోహిణి గిఫ్ట్‌...

ఆక‌లిగా ఉందంటూ మనోజ్ ఇంట్లో కేక‌లు వేస్తాడు. సంపాదించాల్సిన వ‌య‌సులో పెళ్లాం డ‌బ్బుల‌పై ఆధార‌ప‌డుతూ తిని కూర్చుంటున్నావంటూ మ‌నోజ్‌కు క్లాస్ ఇస్తాడు స‌త్యం. తనపై ఫైర్ అయిన ప్రభావతి మంచి చేసుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది రోహిణి.

మలేషియా నుంచి మా మావయ్య, అత్తయ్య మీ కోసం చీర పంపించారని ప్ర‌భావ‌తి ఇస్తుంది . రోహిణి మాటలతో ప్రభావతి సంబరపడుతుంది. రోహిణి తెచ్చిన చీర క‌ట్టుకొని మురిసిపోతుంది ప్ర‌భావ‌తి. చీర బాగుంద‌ని స‌త్యం మెచ్చుకుంటాడు. రోహిణిపై ప్రేమ‌ను కురిపిస్తుంది. ఏంటి మొహం వాడిపోయింది జ్యూస్ ఇస్తాన‌ని అంటుంది.

కారు ధ‌ర ప‌దిల‌క్ష‌లు...

అప్పుడే మీనా, బాలు లోప‌లికి ఎంట్రీ ఇస్తారు. అంద‌రిని బ‌య‌ట‌కు ర‌మ్మ‌ని పిలుస్తారు. త‌న కొత్త కారును కుటుంబ‌స‌భ్యుల‌కు చూపిస్తాడు బాలు. బాలు కారు కొన్నాడంటే ప్ర‌భావ‌తి న‌మ్మ‌దు.

మ‌ళ్లీ అద్దెకు తెచ్చావా అని బాలును అడుగుతుంది ప్ర‌భావ‌తి. మీనా కారు కొనిచ్చింద‌ని అస‌లు నిజం బ‌య‌ట‌పెడ‌తాడు బాలు. ఈ కారు ఖ‌రీదు ప‌ది ల‌క్ష‌లు ఉంటుంద‌ని బాలు అంటాడు. అత‌డి మాట‌ల‌తో ప్రభావతి షాక్‌తో నోరెళ్ల‌బెడుతుంది. మూడున్న‌ర ల‌క్ష‌ల‌కు మించి ఉండ‌ద‌ని మ‌నోజ్ అంటాడు.

శృతి ప్ర‌శంస‌లు...

పూల కొట్టు వ‌ల్ల వ‌చ్చిన లాభంతో మీనా కారు కొన్న‌ద‌ని చెబుతాడు. నువ్వు చాలా గ్రేట్ అని మీనాను పొగుడుతుంది శృతి. త‌న‌కు తెలియ‌కుండా మీనా కారు ఎలా కొన్న‌ది చెబుతాడు బాలు.

కారు నా కోసం కొన్న విష‌యం తెలియ‌క గుడికి ర‌మ్మ‌ని అంటే మీనాపై విసుక్కున్నాన‌ని, గుడికి వెళ్లిన త‌ర్వాత మీనా నా కోసం కారు కొన్న‌ద‌ని తెలిసిన త‌ర్వాత చాలా సంతోషం వేసింద‌ని బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు. నీ భ‌ర్త గౌర‌వాన్ని నిల‌బెట్టావు, వాడికో ఆధారాన్ని చూపించామ‌ని మీనాను మెచ్చుకుంటాడు స‌త్యం. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.