Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతీకి మీనా మాస్ వార్నింగ్.. రవి, శృతికి పర్ఫెక్ట్ పార్థు పరీక్ష.. మందేసిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial September 30th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 30 ఎపిసోడ్ లో చింతామణికి మీనా మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఆర్డర్ కూడా మళ్లీ మీనాకే వస్తుంది. అటు అన్నదమ్ములతో కలిసి బాలు మందేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన చేతికి డబ్బు అందగానే చింతామణికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది మీనా. మరోవైపు రవి, శృతికి రెస్టారెంట్ లో పర్ఫెక్ట్ పార్థు పరీక్ష ఎదురవుతుంది. ఇటు చింతామణి ఆర్డర్ చెక్ బౌన్స్ అయి చేజారుతుంది.

చింతామణికి షాక్.. ఫోన్ చేసిన మీనా వార్నింగ్
ఇంటికి రాగానే మీనా మనుషులు డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి చింతామణి షాక్ తింటుంది. పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి తన గదిలో చూస్తే డబ్బు కనిపించదు. వాళ్లు కచ్చితంగా మీనా మనుషులే అని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే మీనా నుంచి ఆమెకు ఫోన్ వస్తుంది. నువ్వు దొంగతనం చేసిన డబ్బును మా ఆయన మళ్లీ తీసుకొచ్చాడు.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని మీనా అంటుంది.
నా ఇంట్లో దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చింతామణి అంటుంది. చేసుకో.. ఏమని చెబుతావ్.. ఆ 5 లక్షలు ఎలా వచ్చాయని అడిగితే ఏం చెబుతావ్.. నీ పాత వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి.. ఆ డబ్బు ఎలా దొంగిలించావో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం అని మీనా అంటుంది. చింతీకి తనదైన స్టైల్లో శృతి కూడా వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఆమె నోట మాట రాదు.
చింతామణి ఆర్డర్ గోవిందా.. చెక్కు బౌన్స్
మీనా అన్ని మాటలన్నా కూడా ఆర్డర్ తనదేలే అన్న సంతోషం చింతామణిలో ఉంటుంది. వెంటనే మేనేజర్ కు ఫోన్ చేస్తుంది. ఆర్డర్ తనదే కదా అని అడుగుతుంది. ఏం ఆర్డర్.. ఎక్కడి ఆర్డర్.. మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది.. అందులో ఐదు లక్షల కంటే ఒక్క రూపాయి తక్కువుంది అని మేనేజర్ చెప్పడంతో షాక్ తింటుంది.
ఆ ఆర్డర్ మళ్లీ మీనాకే ఇద్దామనుకుంటున్నామనడంతో చింతామణికి మరింత మండుతుంది. అకౌంట్లో ఐదు లక్షలు లేకపోవడమేంటని ఆలోచిస్తున్న చింతామణికి అసిస్టెంట్ షాకిస్తాడు. నువ్వు జీతం ఇవ్వడం లేదని, నీ అకౌంట్లో నుంచి తానే డబ్బు తీసుకున్నట్లు చెబుతాడు. దీంతో చింతామణి లబోదిబోమంటుంది.
ప్రభావతికి సత్యం వార్నింగ్
ఇటు డబ్బు తిరిగి రావడంతో ఇంట్లో అందరూ సంతోషిస్తుంటే.. ప్రభావతి మాత్రం ముఖం అదోలా పెడుతుంది. దీంతో సత్యం ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటికైనా ఆ చింతామణిలాంటి వాళ్లను దూరంగా పెట్టు.. మీనాపై కోపంతో నిన్ను దువ్వుతోంది.. అలాంటి వాళ్లను దగ్గరకు తీసుకుంటే నువ్వు రోహిణిని ఇంట్లో నుంచి తరిమేసినట్లు నేను నిన్ను తరిమేస్తాను అని సత్యం గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇటు కష్టాన్ని నమ్ముకున్న మీనాకు ఎప్పుడూ మంచే జరుగుతుందని ఆశీర్వదిస్తాడు.
మీనా చేతికే మళ్లీ ఆర్డర్.. బాలుకి ముద్దు
అప్పుడే మీనాకు మేనేజర్ ఫోన్ చేస్తాడు. అది చూసి ఆశ్చర్యపోతూనే మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆ చింతామణి ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది.. అందుకే మిగిలిన వాళ్లకు ఫోన్ చేసి చెబుతున్నాను.. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్లకు నీ డిజైన్లు బాగా నచ్చాయి.. మరి ఇప్పుడు డిపాజిట్ కట్టగలవా.. కడితే నీకే ఆర్డర్ వస్తుందని అందరూ అనుకుంటున్నాను అని చెబుతాడు.
దీంతో మీనా తాను వెంటనే డబ్బు కట్టేస్తానని చెబుతుంది. ఆర్డర్ తిరిగి మీనాకే రావడంతో ఇంట్లో అందరూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతారు. చూశావా మా నాన్న ఆశీర్వదించగానే ఎలా ఆర్డర్ వచ్చేసిందో అని బాలు అంటాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఏదైనా స్వీటు చేస్తానని మీనా అంటుంది. స్వీటు వద్దు కానీ.. ఏదైనా ఇవ్వు అంటే మీనా వెంటనే ముద్దిచ్చి వెళ్లిపోతుంది.
సుమతి దగ్గరికి మీనా, అరుణ్
ఆ తర్వాత మీనా ఎంతో ఆనందంగా సుమతి దగ్గరికి వెళ్తుంది. చాలా సంతోషంగా ఉంది అని చెల్లితో అంటుంది. నువ్వు రావడం చూసినప్పుడే అది అర్థమైంది.. ఇంతకీ ఏం జరిగింది అని అడిగితే.. పోయిన డబ్బు తిరిగి వచ్చింది.. ఆ చింతామణి దారిలోనే వెళ్లి మీ బావ ఆ డబ్బు తిరిగి తీసుకొచ్చారు.. అంతేకాదు ఆర్డర్ కూడా మళ్లీ నా దగ్గరికి వచ్చింది.. వెంటనే డిపాజిట్ చేయమన్నారు అని చెబుతుంది. దీంతో సుమతి కూడా సంతోషిస్తుంది. ఆ తర్వాత మీనా వెళ్లిపోతుంది.
ఆ వెంటనే అరుణ్ కూడా సుమతి దగ్గరికి వస్తాడు. తాను ఫోన్ చేసినప్పుడు డల్లుగా మాట్లాడావ్.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావేంటి.. నేను తిరిగి వచ్చినందుకా అని అడుగుతాడు. రెండు కారణాలు ఉన్నాయంటూ డబ్బు తిరిగి వచ్చిన విషయం చెబుతుంది. తన అక్క, బావ చేసిన సాహసం గురించి చెప్పడంతో వాళ్లు గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పడమే తప్ప ఎప్పుడు పరిచయం చేస్తావని అడుగుతాడు. టైమ్ వచ్చినప్పుడు చేస్తానని సుమతి అంటుంది. బయటకు వెళ్దామని అరుణ్ అడిగితే.. ఇప్పుడు తాను చాలా బిజీగా ఉన్నానని, తర్వాత వెళ్దామని చెప్పి అతన్ని పంపించేస్తుంది.
రవి, శృతి రెస్టారెంట్ కు మీనా.. స్వీటు పట్టుకెళ్లి..
మరోవైపు రెస్టారెంట్ లో నీతూ హడావిడి చేస్తుంటుంది. పర్ఫెక్ట్ పార్థు అనే వ్యక్తి వస్తున్నాడని, అతనికి నచ్చేలా ఏదైనా డిష్ చేస్తే మన రెస్టారెంట్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుందని, ఎవరైనా విదేశాల నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు మన రెస్టారెంట్ కే వస్తారని అంటుంది. అతడు ఇప్పుడు వస్తున్నాడని, వెంటనే ఏదైనా మంచి డిష్ రెడీ చేయండి అని రవి, శృతిలకు చెప్పి తాను అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోతుంది.
అప్పుడే మీనా రెస్టారెంట్ కు వస్తుంది. తనకు సాయం చేసినందుకు తాను చేసిన స్వీటు ఇచ్చి వెళ్దామని వచ్చినట్లు చెబుతుంది. వాళ్లు హడావిడిగా ఉండటంతో ఏం జరిగిందని అడిగితే.. ఓ వ్యక్తి వస్తున్నాడని, అతని కోసమే ఇదంతా అని చెబుతారు. ఆ తర్వాత పర్ఫెక్ట్ పార్థు వస్తాడు. రెస్టారెంట్ లో అతనికి మర్యాదలు చేస్తారు.
మందేసిన అన్నదమ్ములు
మరోవైపు ఇంటిపైనే బాలు, మనోజ్, రవి మందేస్తారు. ఈ సందర్భంగా రోహిణి టాపిక్ వస్తుంది. ఆమె ఒక్క తప్పు చేసినందుకు ఇంతలా శిక్షించడం సరి కాదని, అమ్మతో మాట్లాడాలని రవి అంటాడు. మరోవైపు కిచెన్ లో రోహిణి కూడా తన బాధను మీనా, శృతిలతో చెప్పుకుంటుంది. మళ్లీ ఎలా ప్రభావతికి దగ్గర కావాలో ఐడియా చెప్పమంటే శృతి చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


