గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పర్మనెంట్‌గా అత్తింట్లో రవి- ప్రభావతికి అత్తల శ్రుతి- బాలు వల్ల మీనాకు వాంతులు

గుండె నిండా గుడి గంటలు జూలై 11 ఎపిసోడ్‌లో రోహిణి ప్రెగ్నెంట్ కాలేదని నిరాశపడిన ప్రభావతిని ఆటపట్టిస్తాడు బాలు. మీనాకు వాంతులు అయ్యేలా చేసి తల్లి కాబోతుందని అంటాడు. రవిగాడు పర్మనెంట్‌గా అత్తింట్లో ఇల్లరికపు అల్లుడిగానే ఉంటాడని ప్రభావతికి కామాక్షి చెబుతుంది. దాంతో శ్రుతికి కాల్ చేస్తుంది.

Published on: Jul 11, 2025, 08:53:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రెగ్నెన్సీ కాదని రోహిణి చెప్పడంతో ప్రభావతి చాలా నిరాశపడుతుంది. ఇలా చేశావేంటమ్మా అని ప్రభావతిఅంటుంది. అందుకే కీడెంచి మేలెంచమ్మన్నారు అని సత్యం అంటాడు. ఇంతలో బాలు, మీనా వంటింట్లోకి వెళ్తారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 11 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 11 ఎపిసోడ్‌

వికారంగా ఉందని మీనా

నీళ్లలో పసుపు, ఆవాలు మరికొన్ని వేసి కలిపి ఏం అడగకుండా మీనాను తాగమంటాడు బాలు. దాంతో మీనా తాగుతుంది. ఎలా ఉందని బాలు అడిగితే వికారంగా ఉందని, తల తిరుగుతుందని, వాంతి వచ్చేలా ఉందని పరుగెత్తుతుంది మీనా. అవన్నీ గట్టిగా అందరూ వినేలా చెబుతాడు బాలు. ఇక్కడ ఆగింది అక్కడ మొదలైందని కామాక్షి అంటుంది.

అమ్మోయి నా పెళ్లాం తల్లి కాబోతుంది. నాన్న నానమ్మకు ఫోన్ చేసి నా బిడ్డకే ఆస్తి రాయమని చెప్పు. నాకే ముందు బిడ్డ పుట్టబోతుంది అని హడావిడి చేస్తాడు బాలు. నువ్వొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అని ప్రభావతిని కామాక్షి అంటుంది. ఏరా నిజమా అని సత్యం అడిగితే నాకు కవల పిల్లలు అయ్యేలా ఉన్నారని బాలు అంటాడు. ఇంతలో వచ్చి మీనా వచ్చి అదేం లేదని, కాషాయం తాగించి అత్తయ్యను ఏడిపించాలని చెబుతున్నారని అంటుంది.

కామాక్షిని పైకి తీసుకెళ్తుంది ప్రభావతి. ఏంటి వదినా పెద్ద కోడలికి మనవడు వస్తాడు. అత్త ఆస్తిని తీసుకోవచ్చని, నువ్వు మనోజ్ గాడు ఏం పని లేకుండా ఉందామని తెగ ఆశపడినట్లున్నావ్. కానీ, నిరాశపడినట్లున్నావ్ అని చాలా సెటైరికల్‌గా అంటూనే ఉంటుంది కామాక్షి. ఎక్కడ మీనాకు కడుపు ముందు వస్తుందో, అత్తయ్య ఆస్తి తన్నుకుపోతుందేమో అని ప్రభావతి అంటుంది.

ఒకేలా చూడాలి

కొడుకులిద్దరిని ఒకేలా చూడాలని, బాలు గాడే కాస్తా కూడబెడతాడు అని కామాక్షి అంటే రోహిణికి లేదా శ్రుతికి అయినా ముందు బిడ్డ పుట్టాలి అని ప్రభావతి అంటుంది. ఇంకెక్కడ శ్రుతి. మీ వియ్యంకులు శ్రుతిని అటు నుంచి అటే ఇంటికి తీసుకెళ్లిపోయింది రవిగాడిని అక్కడికి రప్పించుకుంది ఇల్లరికం అల్లుడిగా చేసుకోడానికి. ఇక రవిగాడు అక్కడే సెటిల్ అయిపోతాడు అని చెప్పిన కామాక్షి వెళ్లిపోతుంది.

మరోవైపు శ్రుతికి ప్రభావతి కాల్ చేస్తుంది. ఇంటికి రమ్మని ప్రభావతి చెబుతుంది. బాలు ఉన్న ఇంటికి రానని, ఇప్పుడు మనింట్లో మావయ్య ఉన్నారు. ఆయన మీద నేను చేయి చేసుకుంటే ఎలా ఉంటుంది. మా డాడీని కొట్టిన వ్యక్తి ఉన్న ఇంట్లోకి ఎలా వస్తాను అని శ్రుతి అంటుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. కామాక్షి వచ్చి శ్రుతి వస్తానందా అని అడుగుతుంది.

లేదు. నేను ఓ మెట్టు దిగే మాట్లాడా. నాకే అత్తలా శ్రుతి మాట్లాడుతుందని, రవిగాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదని ప్రభావతి అంటుంది. అత్తింట్లో రెండు రోజులు ఉండేసరికి లిఫ్ట్ చేయట్లేదా. అప్పుడే మారిపోయాడా. శ్రుతితో ప్రేమగా మాట్లాడి రవిని తీసుకొచ్చుకో లేకుంటే దూరమైపోతాడు. ఇప్పుడు రెండు రోజులే తర్వాత శాశ్వతం అవుతుంది. బాలు గాడితో అన్నయ్య వెళ్లిపోయేలా ఉన్నారన్నావ్. అందరితో కలుపుగోలుగా ఉండు. లేకుంటే నీకే కష్టం అని కామాక్షి చెప్పి వెళ్లిపోతుంది.

రవికి పార్సల్

మరోవైపు నువ్ ఇలాగే ఉండు. వాళ్లు ఎంత నచ్చజెప్పిన వెళ్లకు అని శ్రుతికి చెబుతారు తల్లిదండ్రులు. అది నేను చూసుకుంటానులే అని శ్రుతి వెళ్లిపోతుంది. మనం వద్దన్న పనే తను చేస్తుంది. ఈ విషయం ఎక్కువగా మాట్లాడకు అని శోభనతో సురేంద్ర అంటాడు. మరోవైపు రోహిణికి జీలకర్ర వేసి వేడి చేసిన నీళ్లు ఇచ్చిన మీనా ప్రెగ్నెన్సీ గురించి బాధపడుతున్నావా అంటుంది.

నిజం చెప్పాలంటే నువ్వే ఫీలవ్వాలి. నాకంటే ముందు పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ కానందుకు అని రోహిణి వెళ్లిపోతుంది. మరోవైపు మీ నాన్న విషయంలో ఏదో ఒకరోజు మా అమ్మ భద్రకాళి అవుతుందని రోహిణితో మనోజ్ అంటాడు. ఇంతలో రవి పేరు మీద పార్సల్ వచ్చిందని కొరియర్ అతను అంటాడు. రవిని పిలవమని సత్యం అంటే వాడు ఇంకా రాలేదని బాలు చెబుతాడు.

పై నుంచి కిందకు వచ్చిన రవి గురించి తపిస్తుంది ప్రభావతి. వాడి పేరు విన్నా. వచ్చాడా అని ప్రభావతి అంటుంది. పార్సల్ గురించి తెలిసి ఇక వాడు రాడేమో అని బెంగపెట్టుకొంటుంది ప్రభావతి. వీడెళ్లి ఆయనకు సారీ చెబితే వస్తారేమో అని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్‌పై సీరియస్ అవుతాడు బాలు. దాంతో ప్రభావతి బాలును కోప్పడుతుంది.

పుట్టిల్లు ఉందా

ఎంతసేపు నేను కొట్టిందే అంటున్నారు కానీ ఈ ఇంటి కోడలి మీద వేసిన నింద కనిపించట్లేదా అని బాలు అంటాడు. ఇల్లును ముక్కలు చేస్తున్నావ్ అని ప్రభావతి అంటుంది. అలా గుంపులుగా విడగొట్టేది నువ్వు. మనుషుల మనుసులు విరగొట్టేది నువ్వు అని బాలు అంటాడు. ఏమంటున్నాడో చూశారా అని ప్రభావతి అంటే.. నిజాలేగా అంటున్నాడు అని సత్యం అంటాడు.

తర్వాత రోహిణిని తన తండ్రి గురించి అడుగుతుంది ప్రభావతి. అసలు నీకు పుట్టిల్లు ఉందా. మీ నాన్న ఇంటికి రావాలి. లేకుంటే నీ స్థానమేంటో చూపిస్తా. నీ బతుకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More