గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతికి నిజం చెప్పిన మీనా- రవికి శోభ ప్లాన్ చెప్పిన బాలు-జైలుకెళ్లిన రోహిణి తండ్రి

గుండె నిండా గుడి గంటలు జూలై 14 ఎపిసోడ్‌లో డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి శ్రుతికి మీనా ఫంక్షన్‌లో జరిగిందంతా చెబుతుంది. దాంతో శ్రుతి తన తల్లిదండ్రులు ఇదంతా దాచిపెట్టారని అనుకుంటుంది. మరోవైపు రవిని కలిసిన బాలు సురేంద్ర, శోభల ప్లాన్ గురించి వివరిస్తాడు. రోహిణి తండ్రి జైలుకు వెళ్లినట్లు తెలుస్తుంది.

Published on: Jul 14, 2025, 08:43:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అందరి మనసులు విరగొట్టేది నువ్వు అని ప్రభావతిని బాలు అంటే.. నిజాలేగా మాట్లాడుతున్నాడు అని సత్యం సపోర్ట్ చేస్తాడు. ఇల్లు ఇలా వెలవెలబోడానికి కారణం నువ్వే అంటున్నాడు. దీనంతటికి కారణం నీ మనసాక్షిని అడుగు అని సత్యం అనడంతో అంతా వెళ్లిపోతారు. అందరు నన్నే అంటున్నారు అని ప్రభావతి అంటే.. లేదు అందరిని నువ్వే అంటావ్ అని సత్యం వెళ్లిపోతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 14 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 14 ఎపిసోడ్‌

సురేంద్రతో గొడవ గురించి

మరోవైపు అంతా రవి గురించి ఆలోచిస్తున్నారు అని బాలు, మీనా ఆలోచిస్తారు. సురేంద్రతో గొడవ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ల ఇంటికి సురేంద్రకు రెండు తగిలించి వారిద్దరిని ఇంటికి తీసుకొస్తాను అని బాలు అంటాడు. ప్రతిదానికి కొట్టడమే పరిష్కారం కాదు. నచ్చజెప్పి తీసుకురావాలని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రుతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్తుంది.

ఇంకా వర్క్ చేయడం ఎందుకు. ఇంట్లోనే ఉండమని తల్లి శోభన అంటుంది. పెళ్లయ్యాక ఎందుకు అని శోభన అంటే.. నాన్న, రవి మానేశారా. నా విషయాల్లో జోక్యం చేసుకోకండి అని శ్రుతి వెళ్లిపోతుంది. డబ్బింగ్‌లో లైఫ్‌లో మీ ఇంటికి రాను నీతో కాపురం చేయను అనే డైలాగ్ వస్తే శ్రుతి ఆగిపోతుంది. దాంతో డిస్టర్బ్ అవుతుంది. ఇంతలో మీనా వస్తుంది.

చూసి శ్రుతి వెళ్లిపోతుంటే మీనా ఏడవటం కనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని శ్రుతి అడిగితే.. నా వల్ల మీరు దూరమున్నారుగా అని మీనా అంటుంది. నీ వల్ల కాదు మీ ఆయన వల్ల అని శ్రుతి అంటుంది. మీ నాన్నను కొట్టిందే చూశావు, దానికంటే ముందు జరిగింది నీకు తెలియదు అని సురేంద్ర చేసిన అవమానం గురించి పూస గుచ్చినట్లు చెపుతుంది మీనా.

చేయిచేసుకోవడం తప్పే

దాంతో డాడ్ నిన్ను అపార్థం చేసుకోవడం తప్పే అని శ్రుతి అంటుంది. కానీ, చేయిచేసుకోవడం, అవమానించడం బాలుది తప్పని శ్రుతి అంటుంది. మధ్యలో మీ ఆయన, అత్తవారిల్లు ఏం చేసింది. మీరెందుకు రాలేదు అని మీనా అంటుంది. మీ ఆయన ఉన్న ఇంటికి రాను అని శ్రుతి అంటుంది.

ఫంక్షన్‌లో ఏ గొడవ జరగకుండా మౌనవ్రతం పాటించారు. ఓ మూలన కూర్చొన్నారు. ఎవరు వచ్చి మాట్లాడిన మాట్లాడలేదు. నన్ను దొంగ అన్నాకే మాట్లాడారు. ఇలాంటి బతుకు బతికే కన్న అడుక్కుతినొచ్చుగా అని అన్నాక ఆవేశం పట్టలేక కొట్టారు అని మీనా చెబుతుంది. తర్వాత రవితో గొడవ అయిందని వెళ్లిపోయాడని శ్రుతి చెబుతుంది. ఎవరో తొందరపడ్డారో అని రవిని దూరం పెడతావా అని మీనా చెబుతుంది.

కావాలంటే మీ నాన్నకు నేను క్షమాపణలు చెబుతాను అని మీనా అంటే ఎవరో చేసినదానికి నువ్వెందుకు చెప్పడం అని శ్రుతి అంటుంది. రవిని తీసుకుని ఇంటికిరా అని మీనా వెళ్లిపోతుంది. మరోవైపు రెస్టారెంట్‌కు బాలు వెళ్లి రవిని కలుస్తాడు. నువ్వు సిగ్గులేకుండా ఆ సురేంద్ర గాడి ఇంట్లో ఇల్లరికం ఉంటావా అని బాలు అంటే రవి ఫ్రెండ్ వచ్చి లేదు, మురికి రూమ్‌లో ఉంటున్నాడు అని చెబుతాడు.

సురేంద్ర ప్లాన్ గురించి

సురేంద్ర గాడికి నీతో పెళ్లి ఇష్టం లేదు. అందుకే గొడవ చేసి కూతురుని, నిన్ను రప్పించుకున్నాడని సురేంద్ర, శోభ ప్లాన్ చెబుతాడు బాలు. నువ్ రారా, అమ్మ, నాన్న బెంగ పెట్టుకుందిరా.. రారా అని బాలు అంటాడు. వదినాల శ్రుతి కాదు. నేను ఒక్కడిని రాను. ఇద్దరం కలిసి వస్తాం. కానీ, నువ్వున్న ఇంటికి శ్రుతి రాదు అని రవి వెళ్లిపోతాడు. డబ్బింగ్ పూర్తి చేసిన శ్రుతి మీనా చెప్పింది గుర్తు చేసుకుంటుంది.

రవి రెస్టారెంట్‌కే కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. రవి ఫ్రెండ్ రవికి శ్రుతి ఫుడ్ ఆర్డర్ గురించి చెబుతాడు. వీడు వాడికి చెబుతాడా లేదా అని శ్రుతి ఆలోచిస్తుంది. మరోవైపు సత్యం ఇంటికి మలేషియా మావయ్య మటన్ కొట్టు మాణిక్యం వస్తాడు. రోహిణి వాళ్ల నాన్నను మలేషియా పోలీసులు జైలులో వేశారని, ఆయన్ను మోసం చేసినట్లు ఇరికించారని చెబుతాడు.

రోహిణి కంగారు

దాంతో నాన్న అని ఏడుస్తుంది రోహిణి. రోహిణి, నువ్ వెళ్లి ఆస్తులు విడిపించమని మనోజ్‌కు ప్రభావతి చెబుతుంది. దాంతో రోహిణి కంగారుపడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More