గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్:మనోజ్‌కు తొలిసారి రివర్స్ అయిన ప్రభావతి- న్యాయవతి అన్న బాలు- బాలు మాటలకు శ్రుతి ఫిదా

గుండె నిండా గుడి గంటలు జూలై 18 ఎపిసోడ్‌లో ఇల్లు తాకట్టు పెట్టి కెనడా వెళ్లాలని ఇంట్లోవాళ్లకు చెబుతాడు మనోజ్. కానీ, అందుకు ప్రభావతి ఒప్పుకోదు. తొలిసారి పెద్ద కొడుక్కి రివర్స్ అవుతుంది ప్రభావతి. దాంతో న్యాయవతి అంటూ బాలు మెచ్చుకుంటాడు. మరోవైపు శ్రుతిని దొంగతనం నేరం నుంచి కాపాడుతాడు బాలు.

Published on: Jul 18, 2025, 09:10:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లోవాళ్లకు కెనడా వెళ్లాలని, రూ. 14 లక్షలు కావాలని అని మనోజ్ అడుగుతాడు. అంత ఖర్చు పెట్టి వెళ్లడం ఎందుకు. ఇక్కడే ఏదైన చిన్న పని చూసుకుంటూ మెల్లిగా ఎదగొచ్చు కదా అని మీనా అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌

తాకట్టు పెట్టమని

అంటే నీలా పూలు కట్టాలా నేను. నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా నీకు. అసలు చెబితే అర్థమవుతుందా అని మీనాను అవమానిస్తాడు మనోజ్. లక్షలు మింగిన డిగ్రీరా నీది అని సెటైర్ వేస్తాడు బాలు. ఇప్పటికే నీకు చాలా చేశాను. ఇక నా వల్ల కాదు అని సత్యం అంటాడు. ఇల్లు ఉంది కదా. తాకట్టు పెట్టమని మనోజ్ అడుగుతాడు. ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు అని ప్రభావతి అంటుంది.

కెనడా జాబ్ వస్తే అంతకుముందు తీసుకుంది, ఎప్పుడు తీసుకుంది తిరిగి ఇస్తానని మనోజ్ అంటాడు. ఇంతలో వచ్చిన రోహిణి ఏమైందని అడిగితే ఇల్లు తాకట్టు గురించి చెబుతారు. తెలియనట్లు రోహిణి అనడంతో మనోజ్ కోపంగా చూస్తాడు. సంతకాలు చేస్తే చాలమ్మా అని మనోజ్ అంటే మొత్తం ఇల్లు నీకు అప్పజెప్పి మేమంతా రోడ్డున పడాలా అని ప్రభావతి మొదటిసారి పెద్ద కొడుకుకు రివర్స్ అవుతుంది.

ఇది కలా నిజమా అని షాక్ అవుతాడు బాలు. నీ భార్య కష్టపడి పనిచేస్తుంది. నువ్ కష్టపడి పని చేసుకు బతుకు అని ప్రభావతి అంటుంది. నాన్న అమ్మ న్యాయం మాట్లాడింది నాన్నా. మొదటిసారి అమ్మలా మాట్లాడింది. న్యాయవతి నాన్న అమ్మ అని బాలు అంటాడు. ఆయన నోరు తెరిచి అడుగుతున్నారని రోహిణి అంటుంది. కావాలంటే మీ నాన్నను అడుగు. జైలుకెళ్లకముందు ఇవ్వొచ్చుగా. ఈ ఇంటి మీద ఒక్క రూపాయి ఇచ్చేది లేదని ప్రభావతి కరాకండిగా చెబుతుంది.

పార్క్ ఫ్రెండ్‌తో

పబ్బీ నువ్వేనా ఇలా మాట్లాడిది అని సత్యం ఆశ్చర్యపోతే పిల్లల ముందు అలా పిలుస్తారేంటీ అని సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది ప్రభావతి. మరుసటి రోజు ఉదయం పార్క్ ఫ్రెండ్‌ను కలుస్తాడు మనోజ్. కెనడా జాబ్ గురించి చెప్పి 14 లక్షలు అడుగుతాడు మనోజ్. నిన్ను ఇంట్లోవాళ్లే నమ్మట్లేదు. నేను ఎలా నమ్మను. నేను నిన్ను ఓ స్వామిజీ దగ్గరికి తీసుకెళ్తాను. ఆయనే పరిష్కారం చెబుతాడని పార్క్ ఫ్రెండ్ మనోజ్‌ను తీసుకెళ్తాడు.

మరోవైపు ప్యాసెంజర్స్ ఇద్దరు కంగారుపడుతుంటే బాలు ఏమైందని అడుగుతాడు. పర్స్ ఓ ప్లేసులో పోయింది. వెళ్లకుంటే ఎవరైనా తీస్తారేమో అని అమ్మాయి చెబుతుంది. కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదని బాలు అంటాడు. కట్ చేస్తే అడ్రస్‌కు వెళ్తారు. కానీ, బాలుకు డబ్బు ఇవ్వకుండా వెళ్లకపోయేసరికి బాలు అక్కడే ఉంటాడు. శ్రుతి ఉన్న డబ్బింగ్ రూమ్‌లోకి వెళ్లి చూస్తారు.

శ్రుతి మీద డౌట్ పడతారు. నువ్వే పర్స్ తీశావని శ్రుతిని అంటారు. శ్రుతి బ్యాగ్ లాక్కుంటారు. ఆ గొడవ బాలుకు వినిపించి డబ్బుడమ్మా అనుకుంటూ వెళ్తాడు. దొంగతనం గురించి చెబుతారు. ఆవిడ అలాంటిది కాదు. మీరెంత పోగోట్టుకున్నారో అంతకు రెండింతలు విసిరిపారేయగలరు అని బాలు అంటాడు. తర్వాత శ్రుతి బ్యాగ్ తీసి చూపిస్తుంది.

శ్రుతిపై దొంగతనం

ఇంకెవరికో ఇచ్చి పంపించి ఉంటావని అమ్మాయి అంటుంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి అని శ్రుతిచేయి అతను పట్టుకుంటే శ్రుతి లాగి పెట్టి కొడుతుంది. అమ్మాయిని కూడా కొడుతుంది. అతన్ని బాలు ఆపి నేను కొడితే ఇంకోలా ఉంటుందని పర్స్ పెట్టిన చోటు చూపించమని అడుగుతాడు. శ్రుతి కంటే ముందు ఎవరొచ్చారని అడిగితే టీ కొట్టు వాడు అని చెబుతాడు.

దాంతో టీ కొట్టు వాడి దగ్గరికి వెళ్లి అడిగితే చెప్పడు. కానీ, బాలు పర్స్ తీసుకొస్తాడు. టీ కొట్టువాడికి బుద్ధి చెప్పిన బాలు ఆ ఇద్దరితో శ్రుతికి సారీ చెప్పిస్తాడు. బాలు వెళ్లిపోతుంటే శ్రుతి వచ్చి థ్యాంక్స్ చెబుతుంది. నువ్ మా ఇంటి ఆడపిల్లవి. నీకు అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్లే. వాడిని నేను కొట్టేవాడినే కానీ అప్పుడు కూడా నీకు నేను రౌడీలా కనిపించేవాడిని అని బాలు అంటాడు.

వాళ్లు దొంగ అంటే ఎందుకు కొట్టావ్ అని బాలు అడిగితే కోపం రాదా అని శ్రుతి అంటుంది. మరి నువ్ చేసిన పనే నేను మీ నాన్నపై చేస్తే ఎందుకు తప్పు బట్టావ్. నువ్ తీయలేదు, మీనా తీయలేదు. నువ్ వాళ్ల మీద తిరగబడ్డావ్. కానీ, మీనా మీ నాన్నమీద తిరగబడలేదు. మీ నాన్నకు చాలా సేపు సర్దిచెప్పాలని చూశాను. కావాలనే గొడవ పెద్ది చేశాడు. మిమ్మల్ని పుట్టింట్లో ఉంచాలని చూశాడు అని బాలు అంటాడు.

జైలుకు వెళ్లొచ్చినవాడు అన్నాడు

నన్ను జైలుకు వెళ్లొచ్చినవాడు అన్నాడు. అందుకే టీ కొట్టువాడిని జైలుకు వెళ్లకుండా ఆపాను. లేకుంటే వాడిని అలాగే పిలుస్తారు అని బాలు అంటాడు. దాంతో బాలు మాటలకు ఫిదా అవుతుంది శ్రుతి.

నువ్ నాలానే అనిపిస్తుంది నాకు. కానీ, నేను ఆవేశపడటానికి ముందు చాలా ఆలోచిస్తాను. జరిగిన గొడవ పక్కన పెడితే ఇందులో రవి తప్పేముంది. వాడిని ఎందుకు దూరం పెట్టావ్ అని బాలు అడుగుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More