గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఒక్కరోజు బిచ్చగాడిగా మనోజ్- 14 లక్షలకు స్వామిజీ పరిహారం- ఇంట్లో నిలబెట్టిన బాలు

గుండె నిండా గుడి గంటలు జూలై 21 ఎపిసోడ్‌లో బాలు మాటలకు శ్రుతి ఆలోచిస్తుంది. స్వామిజీని కలిసిన మనోజ్‌కు పరిహారం చెబుతాడు. ఒక్కరోజంతా బిచ్చగాడిలా అడుక్కుతినాలని స్వామిజీ చెబితే ఇదే 14 లక్షలకు దారి అని పార్క్ ఫ్రెండ్ అంటాడు. గుడి మెట్లపై అడుక్కుంటున్న మనోజ్‌ను చూసిన మీనా బాలుకు చెబుతుంది.

Jul 21, 2025, 08:47:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఫంక్షన్‌లో సురేంద్ర చేసిందంతా శ్రుతికి చెబుతాడు బాలు. కానీ, ఇందులో రవి తప్పు ఏం లేదుగా. నా మీద మనసులో కోపం పెట్టుకో కానీ వాడి మీద ఎందుకు అని రవి పరిస్థితి చెబుతాడు బాలు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 21 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 21 ఎపిసోడ్‌

అమ్మ నాన్న సరిగా తినడంలేదు

మీనా చూడు ఎన్ని కష్టాలు వచ్చిన వదిలి వెళ్లిపోయిందా. పూలు అమ్ముకుని బతకొచ్చుగా ఎందుకు వెళ్లలేదు. నేను నా జీవితంలో ఇంత కుదురుగా మాట్లాడింది ఇప్పుడే. మా అన్నదమ్ములను ఏడిపిస్తాను. కానీ, వాళ్లు ఏడిస్తే చూడలేను. నీ గురించి, రవి గురించి ఆలోచించి మా అమ్మ నాన్న సరిగా తినడం లేదు. అది కూడా ఆలోచించు అని ఎమోషనల్‌గా అల్లాడించేస్తాడు బాలు.

మరోవైపు స్వామిజీని కలుస్తాడు మనోజ్. మీరు ఏదోటి చేసి ఇతనికి జాబ్ వచ్చేల చేయమని మనోజ్ పార్క్ ఫ్రెండ్ చెబుతాడు. కానీ, దానికి ముందు నేను కొన్ని ప్రశ్నలు అడగాలని మనోజ్ అడుగుతాడు. మీ క్వాలిఫికేషన్ ఏంటీ, మీరు ఎంతమంది సమస్యలు తీర్చారు. వాటికి రుజువులు ఉన్నాయా. ఎన్నేళ్లుగా ఈ ఫీల్డ్‌లో ఉన్నారు అని మనోజ్ అడుగుతాడు.

స్వామిజీని ఇంటర్వ్యూ చేస్తున్నావా ఏంటీ. ఇతనికి కంగారు ఎక్కువ అని పార్క్ ఫ్రెండ్ అంటే.. ఇతనికి కష్టానికి కారణం ఇతని నోరే. ఎక్కడ నోరు మూసుకుని ఉండాలో తెలుసుకోవాలి. తర్వాత మనోజ్ గురించి మొత్తం చెబుతాడు స్వామిజీ. ఇప్పుడేం చేయాలి అని మనోజ్ అడిగితే.. చేతిలో నిమ్మకాయ పెట్టి వెళ్లి అడుక్కుతిను అని స్వామిజీ అంటాడు.

ఒక్కరోజంతా అడుక్కోవాలి

దాంతో మనోజ్ నోరెళ్లబెడతాడు. నేను చెప్పిన గుడికి వెళ్లి ఒకరోజంతా అడుక్కోవాలి. ఆ డబ్బును అదే హుండీలో వేయాలి. ఖాలీ కడుపుతో అడుక్కుతినడమే నీ సమస్యకు పరిష్కారం. అలా చేస్తేనే నువ్ అందరిని అడిగే స్థాయి నుంచి అందరూ నిన్ను అడిగే స్థాయికి వెళ్తావ్ అని స్వామిజీ సలహా ఇస్తాడు. దాంతో మనోజ్‌ను పార్క్ ఫ్రెండ్ గుడికి తీసుకెళ్తాడు.

ఇదే నీ వర్కింగ్ ప్లేస్. ఇక్కడే బికారీగా మారాలి. వన్ డే బెగ్గర్ లైఫ్. ఒక్కరోజు గట్టిగా అడుక్కుంటే 14 లక్షలకు దారి దొరుకుతుంది. దీన్ని పరిహారంలా చూడు బ్రో అని పార్క్ ఫ్రెండ్ అంటాడు. ఇది పరిహారంలా కాదు నేను చేసిన తప్పులకు శిక్షలా ఉందని మనోజ్ అంటాడు. తర్వాత మనోజ్‌కు ముష్టివాడి బట్టలు ఇచ్చి వేసుకురమ్మంటాడు పార్క్ ఫ్రెండ్. మనోజ్ వేసుకుని వస్తాడు.

అచ్చం బిచ్చగాడిలా ఉన్నావ్ అని మనోజ్‌కు మసి పూస్తాడు పార్క్ ఫ్రెండ్. మరోవైపు గుడికి వెళ్లి అడుక్కు తిందామంటే బెగ్గర్ యూనియన్‌లో నాలుగు లక్షలు కట్టి చేరాలి అని బిచ్చగాళ్లు చెబుతారు. దాంతో అవే ఉంటే ఎందుకు అడుక్కుంటాను. ఇవాళ ఒక్కరోజే అడుక్కోవడం అని మనోజ్ అంటాడు. సరే అని వాళ్లు అడుక్కోనిస్తారు. వాళ్లే మనోజ్‌కు ఎలా అడుక్కోవాలో చెబుతారు.

మనోజ్‌ను చూసిన మీనా

పార్క్ ఫ్రెండ్ మనోజ్‌కు కాల్ చేసి సాయంత్రం వరకు ఏం తినొద్దని చెబుతాడు. ఇంతలో గుడికి మీనా వస్తుంది. మీనాను చూసి మనోజ్ షాక్ అవుతాడు. అందరికి బిచ్చం వేసిన మీనా మనోజ్‌ను చూస్తుంది. ఈ కళ్లజోడు ఎక్కడో చూసినట్లు ఉందే అని మీనా మనోజ్‌ను తలెత్తమంటుంది. మనోజ్ చూపించడు. కండువా తీసి మనోజ్‌ను చూసి మీనా షాక్ అవుతుంది.

ఏమైంది మీకు. ఎంత ఉద్యోగం దొరక్కపోతే ఇలా చేస్తారా. అత్తయ్యకు తెలిస్తే గుండెపోటు వస్తుంది. లేవండి అని మీనా అంటుంది. ఎవరు తల్లి మీరు అని మనోజ్ అంటే.. లక్షలు మింగినోడా, పార్క్‌లో పల్లీలు తినేటోడా అని బాలులా తిట్టేసరికి మనోజ్ కోప్పడతాడు. మీరే కదా లేవండి అని మీనా అంటే మనోజ్ లేవడు. దాంతో బాలుకు ఆ విషయం చెబుతుంది మీనా.

మీ అన్న తలదించుకునే పని చేస్తున్నాడు. ముష్టెత్తుకుంటున్నాడు. బొచ్చె పట్టుకుని అడుక్కుంటున్నాడని మీనా చెబుతుంది. దాంతో బాలు వస్తా అంటాడు. మీనా చూసింది ఏమవుతుందో అని మనోజ్ భయపడతాడు. ఇంతలో బాలు వచ్చి అరేయ్ నువ్వు అడుక్కోవడం ఏంట్రా అని మనోజ్‌ను ఇంటికి తీసుకెళ్తాడు.

ఇంట్లో నిలబెట్టిన బాలు

ఇంటికి అడుక్కుతినేవాన్ని తీసుకొచ్చినందుకు ప్రభావతి తిడుతుంది. దాంతో మనోజ్ మొహం చూపించేసరికి ఇంట్లో అంతా షాక్ అవుతారు. మీరు డబ్బులు ఇవ్వట్లేదు కదా అందుకే అని మనోజ్ అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More