గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యంను అడుక్కునేవాళ్లతో పోల్చిన సురేంద్ర- బాలు నిగ్రహానికి తాగుబోతు సెల్యూట్!

గుండె నిండా గుడి గంటలు జూలై 3 ఎపిసోడ్‌లో నల్లపూసల వేడుకలో శ్రుతితోపాటు రోహిణికి కూడా ఫంక్షన్ చేయడంపై సురేంద్రను మెచ్చుకుంటాడు తన ఫ్రెండ్. వాళ్లకు స్థోమత లేదని బతిమిలాడితే చేశానని, అడుక్కునేవాళ్లకు మిగిలింది ఎలా ఇస్తామో అలా అని సురేంద్ర సత్యంను అవమానిస్తాడు. తాగుబోతు ఎంత ప్రయత్నించిన బాలు తాగడు.

Jul 3, 2025, 09:11:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతికి ముందు నల్లపూసల కార్యక్రమం చేస్తారు. శ్రుతి మీద ఉన్న నగలు చూసి ప్రభావతి మురిసిపోతుంది. అందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు రవి, శ్రుతి. బాలును మందు తాగమని తాగుబోతు విసిగిస్తాడు. రోహిణిని తన తండ్రి గురించి మనోజ్ అడుగుతాడు. శ్రుతి ఒంటి మీద నగలు కంటే మీ నాన్న ఎక్కువ తెస్తాడని అమ్మ అంటుందని మనోజ్ అంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 3 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 3 ఎపిసోడ్‌

నల్లపూసల కార్యక్రమం

దాంతో రోహిణి చిరాకు పడుతూ వెళ్లిపోతుంది. ఇప్పుడు అందరం కలిసిపోయాం అని, ఒకరి ఇంటికి మరొకరం వెళ్లొచ్చు అని రవి, శ్రుతి సంతోషిస్తారు. బాలు తాగేసి గొడవ చేస్తే తప్పా మా అత్తయ్య నన్ను వదలదు. ఆ తాగుబోతోడు ఎక్కడో చూడు అని విద్యతో రోహిణి అంటుంది. తర్వాత రోహిణికి నల్లపూసలు వేస్తాడు మనోజ్. రోహిణి కోపంగా ఉంటుంది.

మంచి సెటప్ ఉంది. కారు డిక్కీలో పెట్టాను అని తాగుబోతు అంటే ఊపిరి ఆడక చచ్చిపోదు అని బాలు అంటాడు. ఆ సెటప్ కాదు. ప్లీజ్ బారు రావొచ్చుగా ప్లీజ్ అని బాలును పట్టుకెళ్తాడు తాగుబోతు. వ్యాన్‌లో ఉన్న మందు సెటప్ చూపిస్తాడు. మినీ బార్‌లా ఉందని బాలు అంటాడు. తాగుబోతు పెగ్ కలిపి ఇస్తాడు. అయిష్టాంగానే బాలు పెగ్ తీసుకుంటాడు.

తాగుబోతు పెగ్ మొత్తం కొట్టేస్తాడు. మరోవైపు రోహిణికి మీ అమ్మాతో కార్యక్రమం చేయడం గొప్ప విషయమని సురేంద్రతో ఒకతను అంటే.. వాళ్లకు అంత స్థోమత లేదని, చేతులు పట్టుకుని బతిమిలాడితే ఒప్పుకున్నా. మనం తిన్నాక మిగిలింది అడుక్కునేవాళ్లకు వేస్తాం కదా. ఇది కూడా అలాగే అనుకో అని సురేంద్ర అంటాడు. కావాలనే సత్యంను అవమానించేలా సురేంద్ర అంటాడు.

పిచ్చికొట్టుడు కొట్టాలని

ఆ మాటలు విన్న రంగా కోపంగా లేస్తే సత్యం ఆపుతాడు. బాలు గాడు విని వీడిని పిచ్చికొట్టుడు కొడితే బాగుండనిపిస్తుందని రంగా అంటాడు. ఇంతలో బాలు కనిపించకపోయేసరికి కంగారుపడతారు. బాలు కోసం మీనా వెతుకుతుంది. బాలు పెగ్ పట్టుకుని ఉంటే తాగుబోతు మాత్రం తాగుతూనే ఉంటాడు. అది విద్య చూస్తుంది. నేను స్లోగా తాగుతాను నువ్ తాగు అని బాలు అంటాడు.

హమ్మయ్య తాగుతాను అన్నాడు. నా నాలుక లబలబలాడిపోతుంది అని తాగుబోతు అంటాడు. అన్ని నగలు ఉండేసరికి చిరాకుపడుతుంది శ్రుతి. రోహిణి కంట్లో ఏదో పడినట్లుంది వదిన చూడు అని ప్రభావతికి శోభన చెబుతుంది. దాంతో రోహిణి దగ్గరికి వెళ్లి కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ కోపంగా మీ నాన్న ఏంటీ ఇంకా రాలేదని అడుగుతుంది. ఫోన్ కలవలేదని చెబుతుంది రోహిణి.

నేను నీకు ఎలా కనిపిస్తున్నా. శ్రుతి తల్లి అడిగితే ఏం చెప్పాలి. నాకు అబద్ధం చెప్పావా. మీ నాన్న మలేషియా నుంచి నగ నట్ర తెస్తాడు అని చెప్పాను. అందరు కలిసి నన్ను మోసం చేశారా. రాకపోతే రావట్లేదని చెప్పాలి. మీ నాన్న రాకపోవాలి అప్పుడు చెబుతాను అని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతిని కామాక్షి పక్కకు తీసుకెళ్తుంది. బాలు వాళ్లు బయట స్టార్ట్ చేశారు. ఏ క్షణమైన గొడవ జరగొచ్చు అని విద్య అంటుంది.

నాన్న పరువు పోకూడదు

ఒక్కటే పెగ్ పట్టుకుని బాలు ఉంటాడు. తాగుబోతు చాలా తాగుతాడు. బాలును తాగమని బతిమిలాడుతాడు. తాగుబోతు రమ్మని పిలిచినప్పుడు రాకుంటే బాగుండదు. అందుకే గ్లాస్ పట్టుకుని ఉన్నాను. నేను తాగను. ఇక్కడ గొడవ చేయని అని నా భార్యకు మాటిచ్చాను. మా నాన్న పరువు పోకూడదు. ఈరోజు కాకుంటే ఇంకోరోజైనా కూర్చుందాం అని బాలు అంటాడు.

ఆ మాటలు విని మీనా సంతోషిస్తుంది. నువ్ గ్రేట్ బాసు. భార్యకు ఇచ్చిన మాట కోసం గ్లాస్ పట్టుకుని ఉన్నావే గ్రేట్ బాసు అని బాలు నిగ్రహానికి తాగుబోతు సెల్యూట్ చేస్తాడు. బాలుకు ఇచ్చిన పెగ్ కూడా తాగుబోతే తాగుతాడు. మీనా పిలిచేసరికి బాలు వెళ్లిపోతాడు. బాలును నిలదీసిన మీనా బాలును హగ్ చేసుకుంటుంది. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని మీనా ప్రేమగా చెబుతుంది.

ఈ పూలగంప మాట నిలబెట్టుకోవాలిగా. అమ్మాయి సైడ్ వాళ్లు అని చెబితే బాగుండదని అతనితో వెళ్లాను. నీకోసం అని మీనా బుగ్గ గిల్లుతాడు బాలు. మరోవైపు ఇంటికెళ్లేలోపు బాలుతో పెద్ద గొడవ చేయించాలని రోహిణి ప్లాన్ చేస్తుంది. రోహిణి వాళ్ల నాన్న పెద్ద ఫ్రాడ్ అని సత్యంతో బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More