గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: మౌనికకు సంజు మంచితనం చెప్పిన సువర్ణ- పూలదండలు ఎత్తుకెళ్లిన గుణ- బాలుకు ప్రాణ భయం
గుండె నిండా గుడి గంటలు జూన్ 9 ఎపిసోడ్‌లో అందరు పూలమాలలు కడుతూ అంత్యాక్షరి ఆడుతారు. ఒక్కొక్కరు పాట పాడుతారు. అదంతా చూసి కామాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంజు మంచితనం గురించి కోడలు మౌనికకు చెబుతుంది అత్త సువర్ణ. మీనా చేసిన పూలదండలను గుణ ఎత్తుకెళ్లిపోతారు. దాంతో బాలుకు ప్రాణ భయం ఏర్పడుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వయసులో చిన్నదైన జ్ఞానంలో పెద్దది అని శ్రుతిని ప్రభావతి ముందు మెచ్చుకుంటాడు సత్యం. ఇల్లు పూలగోడలు అయిపోయింది అని ప్రభావతి తిట్టుకుంటుంది. బస్తీ వాళ్లు పూలదండలు కడుతుంటే హాల్లోనే సత్యం, ప్రభావతి, రవి, మనోజ్ నిద్రపోతారు.

రోహిణి మసాజ్
దాంతో ప్లేట్ తీసుకుని సౌండ్ చేస్తాడు బాలు. దాంతో అంతా నిద్రలేస్తారు. అందరికి కాళ్లు, చేతులు, నడుము గుంజుతున్నాయి అంటారు. రోహిణి అందరికి మసాజ్ చేస్తుందని శ్రుతి అంటుంది. నేనేమైనా మొబైల్ బ్యూటిపార్లర్ నడుపుతున్నానా అని మనోజ్‌తో గొణుగుతుంది రోహిణి.
నిద్ర రాకుండా ఉండేందుకు మనం సెలవుల్లో అంత్యాక్షరి పాడేవాళ్లం కదా అని సుమతి చెబుతుంది. అందరూ ఒక్కో పూవు పేరు వచ్చేలా పాట పాడాలి అని బాలు అంటాడు. మీనాను మొదలుపెట్టమని సుమతి చెబుతుంది. మీనా సినిమాలో ఓ పాట ఉంటుంది. పూలమీదే ఉంటుందని సత్యం చెబుతాడు. దాంతో మీనా అదే పాట పాడుతుంది.
మీనాను అందరూ మెచ్చుకుంటారు. అక్క పాడిందిగా వెంటనే బావ పాడాలి అని సుమతి అంటుంది. వీడెక్కడ పాడాలి అని ప్రభావది హేళన చేసేసరికి పూలమ్మే పిల్ల అని బాలు పాడుతాడు. సత్యంను పాట పాడమని బాలు అంటాడు. దాంతో సత్యం, ఆ తర్వాత రోహిణి పాడుతారు. అనంతరం మనోజ్ పాటడంతోపాటు ఆడుతాడు. రవి, శ్రుతి డ్యూయెట్ సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేస్తారు.
కామాక్షి కన్నీళ్లు
కామాక్షి పాడిన తర్వాత ప్రభావతి పాటకు బదులు భరతనాట్యం చేస్తుంది. కామాక్షి ఏడుస్తూ వెళ్లిపోతుంది. తన వెంటనే ప్రభావతి వెళ్లు నువ్వేందుకు పూలు కడుతున్నావ్ అని అడుగుతుంది. ఆ పూలు కడుతుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్ చాలా అదృష్టవంతురాలివి. నీ కుటుంబమంతా ఒకేచోట కూర్చుని ఆడుతుపాడుతు ఉన్నారు. నన్ను పిలిచి మంచి పనిచేశావ్ అని కామాక్షి అంటుంది.
ఇంట్లో నేను రంగా తప్పా ఎవరుండరు. ఇన్నాళ్లు మా మరిది పిల్లను మా పిల్లలు అనుకుంటూ వచ్చాం. ఎంతైన సొంత పిల్లలు సొంత పిల్లలే కదా. ఆ అదృష్టం మాకు లేదు అని కామాక్షి అంటుంది. ఆ మీనా చేసే పని ఏ ఒక్కటి నాకు నచ్చలేదు అని ప్రభావతి వెళ్లిపోతుంది. ఇంతలో బాలుకు కాల్ వస్తుంది. పూలు ఆర్డర్ ఇచ్చిన ఫ్రెండ్ అని బాలు అంటాడు.
ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికేమో అని ప్రభావతి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ప్రభావతిని కోపంగా చూస్తారు. మీ అత్తను ఎలా భరిస్తున్నావ్ మీనా అని బస్తీ ఆమె అంటుంది. ఏయ్ నా ఇంట్లో కూర్చుని, నా ఇంట్లో తిని నన్నే అంటున్నావ్ అని ప్రభావతి అంటుంది. ఆగండి ఆంటీ.. అని చెప్పిన బాలు ఫోన్ మాట్లాడుతాడు. ఐదు వందల మాలలు కరెక్ట్ టైమ్‌కు ఇస్తావ్‌గా అని అడుగుతాడు.
పల్లీలు తినడానికా
మా ఆవిడ టీమ్‌ను పెట్టి కష్టపడుతుంది. చెప్పిన టైమ్‌లో ఇస్తాం. ముందు ఇస్తే ఎక్స్‌ట్రా ఇచ్చే డబ్బులు కూడా వద్దు అని బాలు అంటాడు. 500 మాలలు కట్టడం పూర్తి కాదు. కావాలంటే రాసిస్తాను అని ప్రభావతి అంటుంది. ఎంకరేజ్ చేయాలని కానీ, డిస్‌కరేజ్ చేయడం కరెక్ట్ కాదని శ్రుతిఅంటుంది. ఎవరు ఎంత నిరాశపరిచిన మాలలు కడతాం. ఇది నా భర్త ఇచ్చిన మాట. భర్త మాటను నిలబెట్టుకోనప్పుడు ఎందుకు పార్క్‌లో పల్లీలు తినడానికా అని మీనా పంచ్ వేస్తుంది.
మధ్యలో పార్క్, పల్లీలు అంటావేంటీ అని బస్తీ ఆమె అంటుంది. అయ్యో నీకు తెలీదా అని మనోజ్ గాడు ఆఫీస్ అని కామాక్షి చెబుతుంటుంది. ప్రభావతి, మనోజ్ అడ్డుకునేందుకు ట్రై చేస్తారు. తల్లీకొడుకులు గింజుకుంటున్నారు. వద్దులే అమ్మా అని సత్యం అంటాడు. దాంతో కామాక్షి ఫోన్ నెంబర్ ఇవ్వు కాల్ చేసి చెబుతాను అంటుంది. ఐస్‌క్రీమ్ రావడంతో తిందామని శ్రుతి అంటుంది.
దాంతో బాలు, రవి, మనోజ్ ఐస్‌క్రీం తీసుకొస్తారు. పని ఆగిపోతుందని మీనా తినని అంటుంది. బాలును వచ్చి ఐస్ క్రీం తినిపించమంటుంది కామాక్షి. దాంతో మీనాకు బాలు ఐస్‌క్రీం తినిపిస్తాడు. అది చూసి ప్రభావతి కుళ్లుకుంటుంది. మరోవైపు మౌనిక డల్‌గా ఉంటే సువర్ణ వస్తుంది. ఆయన లోపల తాగి పడుకున్నారు. వెళ్తే కోప్పడతారని ఇక్కడే ఉన్నానని మౌనిక అంటుంది.
నరకం చూల్లేను
పుట్టింటికి వెళ్లలేను, ఇక్కడే ఉండి నరకం చూడలేను అని మౌనిక అంటుంది. పుట్టుకతో ఎవరు చెడ్డవారు కాదు. వాడిని చిన్నప్పుడు అన్నింటికి నేను తీసుకెళ్లాను. తోటి స్నేహితుల్లో లేనివాడికి బట్టలు, పుస్తకాలు కొనిచ్చేవాడు అని సంజు మంచితనం గురించి చెబుతుంది తల్లి సువర్ణ. అవునా. మరి ఇలా ఎందుకు మారారు అని మౌనిక అడుగుతుంది.
కొంత వయసు తర్వాత వాడు నా చేయి దాటిపోయాడు. వాళ్ల నాన్నను చూస్తూ పెరిగాడు. అన్నింటిల్లో ఆయన్ను అనుకరించడం మొదలుపెట్టాడు. అలా ఆ దుర్మార్గాన్ని వీడు నేర్చుకున్నాడు. నా భర్త మూర్ఖత్వం వీడికి వచ్చింది. ప్రతికారం, మొండితనం అన్ని చూస్తు పెరిగాడు. అది చూసి ఆయన పొంగిపోయాడు. నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నీకో సలహా చెబుతాను అని సువర్ణ అంటుంది.
దాన్నే ఓర్పు అంటారు. సహనంతో నీ భర్తను మార్చుకునేందుకు ప్రయత్నించు. ఏదో ఒక రోజు కచ్చితంగా మారుతాడు అని సువర్ణ చెప్పి వెళ్లిపోతుంది. ఓర్పుగా ఉంటాను. కచ్చితంగా నా భర్తను మార్చుకుంటాను. కాపురాన్ని నిలబెట్టుకుంటాను అని మౌనిక అనుకుంటుంది. మరోవైపు పూలదండల వ్యాన్‌ను గుణ మనుషులు ఎత్తుకెళ్లిపోతారు. అది తెలిసి బాలు షాక్ అవుతాడు.
ప్రాణాలు పోతాయిరా
మరోవైపు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి మాలలు ఎక్కడ్రా అని ఫైర్ అవుతాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్ భయపడుతూ ఆ మాలలు తీసుకురాకపోతే మన ప్రాణాలు పోతాయి అని బాలుతో ఫోన్‌లో అంటాడు. బాలుకు ప్రాణ భయం ఏర్పడేలా ఫ్రెండ్ చెబుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



