గుండె నిండా గుడి గంటలు: ఇంకేమైనా దాచావా? రోహిణి పీక పట్టుకున్న ప్రభావతి- తొలిసారి పెద్ద కోడలిపై అత్త ఉగ్రరూపం!
గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి గొంతు పట్టుకుని తన ఉగ్రరూపం చూపిస్తుంది ప్రభావతి. బ్యూటి పార్లర్‌కు ఉన్న తన పేరు తీసేయడంపై ఆగ్రహంతో పెద్ద కోడలిపై విశ్వరూపం చూపిస్తుంది ప్రభావతి. ఇంకేమైనా దాచావా అని సూటిగా ప్రశ్నిస్తుంది. దాంతో రోహిణి బెదిరిపోతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పార్లర్‌ను ఫ్రాంచైజీకి ఇచ్చినట్లు, అందుకే ప్రభావతి పేరు పార్లర్‌పై నుంచి తొలగించినట్లు ఇంట్లో మనోజ్ అందరికి చెబుతాడు. దాని వల్ల చాలా లాభాలు వస్తాయని, డబ్బు సంపాదించొచ్చని అంటాడు.

చాలా లాభాలు వస్తాయి
అదంతా విన్న ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణిని నిజమా అని అడిగితే.. అవును. నేనే సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ, మనోజ్ చెప్పేశాడు. అది చాలా పెద్ద కంపెనీ. మనకు చాలా లాభాలు వస్తాయని రోహిణి అంటుంది. మీనా మాత్రం తన పూలకొట్టు పేరు ప్రభావతి తప్పా ఇంకేం పెట్టనని అంటుంది. రోహిణి ఏం చేసిన మంచికే చేస్తుంది, అన్ని లాభాలు రావడం అనేది మంచి విషయమేగా అని ప్రభావతి అంటుంది.
రోహిణిపై ప్రభావతి సీరియస్ అవుతుందని అంతా అనుకుంటే ప్రభావతి కూల్‌గా ఏం అనకపోయేసరికి అంతా షాక్ అవుతారు. అందరిముందు రోహిణిని ఏం అనకుండా సైలెంట్‌గా ఉంటుంది. రోహిణి థ్యాంక్స్ చెప్పి పైకి వెళ్లిపోతుంది. రోహిణి వెంటే ప్రభావతి వెళ్తుంది. అత్తయ్య ఏం అనకుండా ఉన్నారు అని మీనా అంటే.. ఇది తుఫాను రావడానికి మందు చల్లగా ఉన్నట్లు అని బాలు అంటాడు.
నిలదీసిన ప్రభావతి
బాలు చెప్పినట్లుగానే రోహిణిపై ప్రభావతి తెగ సీరియస్ అవుతుంది. తన పేరు ఉన్న బోర్డ్ ఎందుకు తీసినట్లు అని మళ్లీ రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. దాంతో మళ్లీ ఫ్రాంచైజీ గురించి చెబుతుంది రోహిణి. అలాగే, ఆ ఫ్రాంచైజీకి మలేషియాలో మంచి పేరు ఉందని, తన నాన్న సజెస్ట్ చేయడంతోనే ఇక్కడ తీసుకున్నట్లు , దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయని రోహిణి చెబుతుంది.
కానీ, అవేం నమ్మదు ప్రభావతి. నేనే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను అత్తయ్య అని భయపడుతూ రోహిణి అంటుంది. ఎప్పుడు అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. ఆ మాటలు కిందకి వినిపించి సత్యం, బాలు, మీనా పైకి చూస్తారు. ఈ ప్రభావతి నీ కళ్లకు వెర్రిదానిలా కనిపిస్తుందా. నీ పార్లర్‌లో జుట్టు కత్తిరించి పారేసినంత ఈజీగా నా పేరు తీసి పారేసావా. ఇప్పుడు నువ్ మలేషియా పేరు చెబితే నేను తగ్గుతానని అనుకున్నావా అని ఉగ్రరూపం చూపిస్తుంది ప్రభావతి.
రోహిణి పీక పట్టుకున్న ప్రభావతి
మీకు ఇచ్చే డబ్బులు ఇస్తూనే ఉన్నాను కదా అని రోహిణి భయంతోనే అంటుంది. ఏయ్ అంటూ రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి. ఏంటే.. ఎదురు సమాధానం చెబుతున్నావ్ అని గొంతు పట్టుకుని నలిపేస్తుంది ప్రభావతి. రోహిణి విలవిల్లాడటంతో ఛీ.. అని పక్కకు తోసేస్తుంది ప్రభావతి. ఇది కాకుండా ఇంకేమైనా దాచావా అని ప్రభావతి నిలదీస్తుంది.
దాంతో రోహిణి మరింత భయపడిపోతుంది. లేదు అన్నట్లుగా తల ఊపుతుంది రోహిణి. ఇప్పుడే చెప్పు అని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి బెదిరిపోయి అలాగే చూస్తుంటుంది. ఎప్పుడు మీనాను ఆడిపోసుకుని, రోహిణిని మెచ్చుకునే అత్త ప్రభావతి మొదటిసారి పెద్ద కోడలిపై తన విశ్వరూపం చూపిస్తుంది. అక్కడితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













