గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు సోఫా తిరిగి ఇవ్వడంపై సత్యం ఇంట్లో గొడవ జరుగుతుంటుంది. ఇదంతా చూస్తుంటే ఇద్దరికిద్దరు కావాలనే చేస్తున్నట్లుంది అని ప్రభావతి అంటుంది. నీ బాధేంటీ లక్షన్నర సోఫా సెట్ పోయిందనా. ఆ మాత్రం కొనలేమా అని బాలు అంటే.. నీ భార్య పూలమ్మి కొంటుందా అని ప్రభావతి అంటుంది.
పూలమ్మే కారు కొనిపెట్టింది

పూలమ్మే కారు కొనిపెట్టింది అని బాలు అంటాడు. ప్రతిదానికి సమాధానం చెబుతావ్. అందరిని అదరగొడతావ్ అని రవి అంటాడు. రౌడీ కదా అలాగే చేస్తాడు. ఇంకోసారి ఇంట్లో పెత్తనం చేస్తే ఊరుకోను అని మనోజ్ అంటాడు. ఏం చేస్తావురా అని మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు. రవి అంటే రవి కాలర్ కూడా పట్టుకుంటాడు బాలు. మీనా, ప్రభావతి అంతా ఆపాలని చూస్తారు. కానీ, బాలు ఆగడు.
ఆపండి అని సత్యం అరుస్తాడు. ఇక్కడ నేను లేననుకున్నారా. ఇప్పుడు జరిగింది మార్చగలరా అని సత్యం అంటాడు. అలా అని వీడు ఏం చేసిన ఊరుకోవాలా. శ్రుతి వాళ్ల అమ్మకు లక్షన్నర రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బు అంతకుముందే డీలర్‌కు కట్టాను అని మనోజ్ అంటాడు. మరి డబ్బు ఎలా కట్టారు అని ప్రభావతి అడిగితే.. రోహిణి పుస్తెల తాడు అమ్మి తెచ్చి కట్టింది అని మనోజ్ చెబుతాడు.
దాంతో అంతా షాక్ అవుతారు. అంటే, పసుపు తాడు కట్టుకున్నావా అని ప్రభావతి అంటే.. రోహిణి చూపిస్తుంది. ఇంకేం చేయమంటారు. పరువు కాపాడుకునేందుకు చేయాల్సి వచ్చిందని రోహిణి అంటుంది. నా ఇంటి కోడలికి పసుపు తాడు కట్టించే కర్మ పట్టించాడు అని ప్రభావతి తిడుతుంది. ఇద్దరి వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. తల్లి, తండ్రి అని లేకుండా సొంత నిర్ణయం తీసుకుంటున్నారు అని ప్రభావతి అంటుంది.
ఓర్వలేకపోతున్నారు
నా కర్మ ఇంతే అత్తయ్య. మేము ఇంట్లో ఉండటం వీళ్లకు ఇష్టం లేదు. షాప్ పెట్టుకుని ఎదుగుదామంటే ఓర్వలేకపోతున్నారు అని రోహిణి అంటుంది. ఇవే సన్నాయి నొక్కులు నొక్కడం అంటే. పాటే చెత్తగా ఉంది. వాడు బాగు పడాలనే షాప్‌కు తక్కువకు ఇప్పించింది. వాడు బాగుపడాలనే మీనా కోరుకుంది. మాకు అంత చెండాలమైన బుద్ధులు లేవు. ఆవిడకు రెండు రోజులు ఆగి కూడా డబ్బు ఇవ్వొచ్చు అని బాలు అంటాడు.
{{/usCountry}}నా కర్మ ఇంతే అత్తయ్య. మేము ఇంట్లో ఉండటం వీళ్లకు ఇష్టం లేదు. షాప్ పెట్టుకుని ఎదుగుదామంటే ఓర్వలేకపోతున్నారు అని రోహిణి అంటుంది. ఇవే సన్నాయి నొక్కులు నొక్కడం అంటే. పాటే చెత్తగా ఉంది. వాడు బాగు పడాలనే షాప్‌కు తక్కువకు ఇప్పించింది. వాడు బాగుపడాలనే మీనా కోరుకుంది. మాకు అంత చెండాలమైన బుద్ధులు లేవు. ఆవిడకు రెండు రోజులు ఆగి కూడా డబ్బు ఇవ్వొచ్చు అని బాలు అంటాడు.
{{/usCountry}}ఆపు. నువ్వు చేసింది తప్పే. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. ఉమ్మడి కుటుంబంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్పే. నాకు ముందు చెప్పి ఉండొచ్చు కదా. నీ వల్ల ఇంటి కోడలు పసుపు తాడు కట్టుకునే పరిస్థితి వచ్చింది. సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేయండి అని బాలునే నిందించి సత్యం వెళ్లిపోతాడు. బాలు చేసిన గొడవ గురించి శ్రుతి మేడపైనా బాధపడుతుంది.
రవి వచ్చి అడిగితే.. అలాంటి మూర్ఖుడికి నీలాంటి తమ్ముడు ఎలా పుట్టాడు. మీనా వల్ల బాలును పట్టించుకోవట్లేదు అని శ్రుతి అంటుంది. బాలు తప్పు చేశాడు అని రవి అంటే.. శ్రుతి ఆశ్చర్యపోతుంది. నేను ఫీల్ అవుతున్నా అని అంటున్నావా అని శ్రుతి అంటుంది. లేదు. నిజంగానే బాలు తప్పు చేశాడు. నేను తప్పు చేస్తే తప్పు అంటాను అది ఎవరైనా సరే. మీ అమ్మ కూడా అలా పంపించడం కరెక్ట్ కాదు. నాన్న లేదా అమ్మకైన చెప్పి ఉండాల్సింది. అందుకే సోఫా రిటర్న్ వెళ్లిపోయింది అని రవి అంటాడు.
అత్తగారి పరువు
అది అందరిముందు ఎందుకు చెప్పలేదు అని శ్రుతి అంటుంది. మా అత్తగారి పరువు అందరి ముందు తీయలేను కదా. నువ్వు అవమానంగా ఫీల్ అయ్యేలా చేయలేను అని రవి అంటాడు. దాంతో శ్రుతి ప్రేమగా చూస్తుంది. నువ్వు పూర్తిగా హస్బండ్ మెటీరియల్ అయిపోయావ్ అని శ్రుతి అంటే.. కొత్తగా మాట్లాడుతున్నావేంటీ. నా మీద కోపం లేదా అని రవి అంటాడు.
లేదు. భర్త నుంచి భార్య సపోర్ట్ కోరుకుంటుంది. నువ్వు వేరే అని శ్రుతి అంటుంది. నువ్వు కూడా వేరే. న్యాయం ఎటు ఉంటే అటుంటావ్. మీ నాన్న విషయంలో త్వరగా అర్థం చేసుకుని ఇంటికి వచ్చావ్ అని రవి అంటే ఐ లవ్యూ చెప్పి రవిని హగ్ చేసుకుంటుంది. మరోవైపు రవి, శ్రుతిని ఇంటికి తీసుకెళ్లడానికే ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారని, ఫంక్షన్‌లో అది కుదరక దీన్ని ఇలా వాడుకున్నారని, ఇక రోహిణి ఇదే సాకుగా తాళి తాకట్టు పెట్టిందని బాలుతో మీనా చెబుతుంది.
మీ మీద కోపం, తన మీద జాలి వస్తుందని రోహిణి కావాలనే చేసిందని మీనా చెబుతుంది. నువ్వేంటీ మీనా అన్ని ఇంత బాగా అర్థం చేసుకుని చెబుతున్నావ్ అని బాలు అంటాడు. తప్పు ఎత్తి చూపడం కాదు వాళ్ల గుణాలు చెబుతున్నాను అని మీనా అంటుంది. ఇంత తెలిసి నువ్వు కూడా నన్ను అంటావేంటీ అని బాలు అంటాడు. ఆవిడ ఎందుకు పంపించిందో తెలిసి మావయ్య గారే పంపించేవారు. మీరే అనవసరంగా తొందరపడ్డారు అని మీనా అంటుంది.
శ్రీ కృష్ణుడిలా మీనా
మరోవైపు సత్యంతో ఇదే విషయంపై రాద్దాంతం చేస్తుంది ప్రభావతి. మీనాను అంటుంది. కొసరేసినట్లు అన్నింటికి మీనాను ఎందుకు అంటావ్ అని సత్యం అంటాడు. యుద్ధం చేసేది అర్జునుడే. కానీ, వెనుకనుండి చేయించేది శ్రీ కృష్ణుడు అని మీనాను పోలుస్తుంది ప్రభావతి. మనం రోహిణికి తాళి బొట్టు కొనిద్దామని ప్రభావతి అంటుంది. అది భర్త బాధ్యత, బాలు గాడు కొనిచ్చినట్లే మనోజ్ గాడు కూడా కష్టపడి భార్యకు కొనివ్వాలి అని సత్యం అంటాడు.
రోహిణి పార్లర్‌కు వెళ్తుంటే ప్రభావతి ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. మీ నాన్న చూస్తే ఏమనుకుంటారు. డబ్బు ఎంత కట్టావో చెప్పు కామాక్షి దగ్గర చిట్టీ వేశాను దాంతో విడిపిస్తాను అని ప్రభావతి అంటుంది. లేదులే అత్తయ్య నేనే విడిపించుకుంటాను అని రోహిణి అంటుంది. పెద్దింట్లో పెరిగోనళ్లకే ఇలాంటి పెద్ద గుణం ఉంటుంది. మీనా పూలమ్మీ డబ్బులు ఇంటికి జారవేస్తుంది. బాలు గాడు ఇలా చేశాడు అని ప్రభావతి అంటుంది.
ఆ మాటలు విన్న శ్రుతి ప్రభావతిపై కోప్పడుతుంది. బాలు చేసిన దానికి మీనాను ఎందుకు అంటున్నారు. ఏం రోహిణి మా మమ్మీ డబ్బు కట్టమని గొడవ చేసిందా. తాళి తాకట్టు పెట్టమని చెప్పిందా అని శ్రుతి అడిగితే లేదని రోహిణి అంటుంది. మరి మీనా ఏం చేసిందని అంటున్నారు అని శ్రుతి అంటే.. అదే చెప్పి చేయిస్తుంది. నీకు తెలియదు అని ప్రభావతి అంటుంది.
పసుపు తాడుతో తిరగడం
మీకు తెలుసా. దగ్గరుండి విన్నట్లే అంటున్నారు అని అత్తను దులిపేస్తుంది శ్రుతి. కోడలు పసుపు తాడుతో తిరగడం బాగుండదుగా అని ప్రభావతి అంటే.. ఎవరికి మీకా, రోహిణికా, మాకా. ఫంక్షన్ కాకముందే రోహిణి పసుపుతాడుతోనే కదా ఉంది. అంతెందుకు రోహిణి ఒక్కతే పసుపు తాడుతో ఉంటుందా అని అత్తను నిలదీస్తుంది శ్రుతి.
మీనా నీరసంగా ఉందని మనోజ్ గదిలో పడుకుంటుంది. అది చూసిన మనోజ్ తల్లికి చెబుతాడు. దాంతో మీనాను గదిలోనుంచి ఈడ్చుకుని వస్తుంది. అది చూసిన బాలు సత్యంకు చెబుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.