...
...
Next Story

గుప్పెడంత మనసు సీరియల్ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూత.. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు!

గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లం గోపాలరావు కన్నుమూశారు. దీంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ (జూన్ 13) సాయంత్రం మహా ప్రస్థానంలో అల్లం గోపాలరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

Published on: Jun 14, 2025, 12:25:50 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో స్మాల్ స్క్రీన్‌కు చెందిన నటుడు మరణించడం ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ సినీ, టీవీ నటులు అల్లం గోపాలరావు ఇవాళ (జూన్ 13) కన్నుమూశారు.

విషాద ఛాయలు

గుప్పెడంత మనసు సీరియల్ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూత.. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు!
గుప్పెడంత మనసు సీరియల్ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూత.. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు!

బుల్లితెరపై మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అల్లం గోపాలరావు అనారోగ్యం కారణంగా ఇవాళ శనివారం ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో మృతి చెందారు. దీంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపాలరావు మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

అల్లం గోపాలరావు కుటుంబం

ఆయన నివాసంలో ఉన్న అల్లం గోపాలరావు భౌతిక కాయాన్ని సందర్శించి ప్రముఖులు హాజరవుతూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గొప్పదనం గురించి చెబుతున్నారు. ఇదిలా ఉంటే, 75 సంవత్సరాలు ఉన్న అల్లం గోపాలరావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు.

అల్లం గోపాలరావు అంత్యక్రియలు

అల్లం గోపాలరావు పెద్దబ్బాయి అనిల్ పలు సీరియల్స్తోపాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక నటుడు అల్లం గోపాలరావు అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం మహా ప్రస్థానంలో జరగనున్నాయి. సాయంత్రం నాలుగు గంటలు అంత్యక్రియలు చేయనున్నారు.

గుప్పెడంత మనసు సీరియల్‌లో

అల్లం గోపాలరావు మృతిపట్ల ఆయన కుటుంబానికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ మేనెజ్‌మెంట్ కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. కాగా, అల్లం గోపాలరావు తెలుగు టీవీ సీరియల్స్‌తో చాలా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్‌లోని టాప్ సీరియల్ గుప్పెడంత మనసులో కీలక పాత్ర పోషించారు అల్లం గోపాలరావు.

మంత్రి పాత్రలో

అలాగే, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్‌లో కూడా అల్లం గోపాలరావు నటించారు. బ్రహ్మముడిలో జడ్జ్‌గా కెమియో రోల్ చేశారు గోపాలరావు. అనామిక-కల్యాణ్ విడాకుల కేసుకు సంబంధించిన ఎపిసోడ్‌లో న్యాయమూర్తిగా అలరించారు అల్లం గోపాలరావు. సుమారు రెండు మూడు ఎపిసోడ్స్‌లో తన నటనతో బ్రహ్మముడిలో అల్లం నారాయణ ఆకట్టుకున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe