Teja Sajja Wedding: తేజ సజ్జా పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అమ్మాయి.. డిసెంబర్‌లోనే ముహూర్తం అంటూ వార్తలు!

Teja Sajja Wedding: టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లి కోసం డిసెంబర్ నెలలో వివాహ ముహూర్తాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Published on: Oct 20, 2026, 15:20:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Teja Sajja Wedding: బాలనటుడిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై, ఇప్పుడు 'పాన్ ఇండియా' స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్న యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మరోసారి వ్యక్తిగత విషయంతో వార్తల్లో నిలిచారు. 'హనుమాన్', 'మిరాయ్' వంటి భారీ విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన ఈ యువ కథానాయకుడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆయన ఒక తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Teja Sajja Wedding: తేజ సజ్జా పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అమ్మాయి.. డిసెంబర్‌లోనే ముహూర్తం అంటూ వార్తలు!
Teja Sajja Wedding: తేజ సజ్జా పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అమ్మాయి.. డిసెంబర్‌లోనే ముహూర్తం అంటూ వార్తలు!

పెద్దలు కుదిర్చిన సంబంధం.. డిసెంబర్‌లో ముహూర్తం?

తాజాగా పలు న్యూస్ పోర్టల్స్ లో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం.. తేజ సజ్జా వివాహం పెద్దలు కుదిర్చిన పెళ్లి అని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి ఈ సంబంధాన్ని ఖరారు చేశారని తెలుస్తోంది.

ఇక పెళ్లిని ఈ ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించేందుకు ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ దీనికి సంబంధించి తేజ సజ్జా కుటుంబం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

పెళ్లికూతురు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

తేజ సజ్జాను చేసుకోబోయే అమ్మాయి సినీ రంగానికి పూర్తి దూరంగా ఉండే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. ఆమె అమెరికా (USA)లో పుట్టి పెరిగారని, ప్రస్తుతం ఇండియాలోనే స్థిరపడి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని వినికిడి.

ఏమాత్రం సినీ నేపథ్యం లేని ఈ అమ్మాయితో తేజ పెళ్లిని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించినట్లు కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై తేజ సజ్జా టీమ్ లేదా కుటుంబ సభ్యులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

పెళ్లిపై గతంలో తేజ ఏమన్నారంటే..

తేజ సజ్జా పెళ్లిపై వార్తలు ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ ఆయన పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఓ ఈవెంట్ లో తేజ స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదని, అయినా పెళ్లి కుదిరితే తానే అందరికీ చెప్పి చేసుకుంటానని, సిల్వర్ జువెలరీతో మీ ముందుకు వస్తానని చెప్పడం విశేషం. మరి ఇప్పుడు వస్తున్న ఈ పెళ్లి వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

బాక్సాఫీస్ వద్ద 'సూపర్ హీరో' హవా

కెరీర్ పరంగా తేజ సజ్జా ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న హీరోలలో ఒకరిగా నిలిచారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' (Hanu-Man) చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన.. ఇటీవల 'మిరాయ్' (Mirai) సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'చూడాలని ఉంది', 'ఇంద్ర' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన తేజ, హీరోగా మారిన తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

రాబోయే ప్రాజెక్ట్‌లు.. ఓటీటీ హల్‌చల్

కేవలం వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ తేజ సజ్జా తన జోరు చూపిస్తున్నారు:

ది ట్రైటర్స్ (The Traitors): ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ది ట్రైటర్స్' తెలుగు వెర్షన్‌కు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

జాంబీ రెడ్డి NXT LVL: ఆయనకు హీరోగా బ్రేక్ ఇచ్చిన సైన్స్ ఫిక్షన్ హిట్ మూవీ 'జాంబీ రెడ్డి'కి సీక్వెల్‌గా రాబోతున్న 'Zombie Reddy NXT LVL' చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒకవైపు వరుస పాన్ ఇండియా సినిమాలు, బిగ్ ఓటీటీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటూనే, మరోవైపు పెళ్లి వార్తలతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన తేజ సజ్జా నిజంగానే డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More