Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. 2000 శాతం లాభాలు.. ఈ ఏడాది ఇండియాలో అత్యధిక లాభాల మూవీ ఇదే.. ధురంధర్ 2 కూడా వెనక్కి..

Hanuman Ansh: హనుమాన్ అంశ్ అనే ఓ చిన్న సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2026లో ఇండియాలో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాగా నిలవడం విశేషం. ఇంతకీ ఈ సినిమా ఏంటి? దాని స్టోరీ ఏంటో చూడండి.

Published on: Aug 31, 2026, 13:40:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hanuman Ansh: స్టార్ హీరోలు లేరు, భారీ ప్రమోషన్లు అంతకంటే లేవు. కేవలం రూ.2 కోట్ల చిన్న బడ్జెట్‌తో సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చి, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల సినిమాలను దాటేసి హిస్టరీ క్రియేట్ చేస్తోంది 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) సినిమా. 2026లో ఇండియాలోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన నంబర్ వన్ మూవీగా ఈ డివైన్ డ్రామా రికార్డులకెక్కింది.

Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. 2000 శాతం లాభాలు.. ఈ ఏడాది ఇండియాలో అత్యధిక లాభాల మూవీ ఇదే.. ధురంధర్ 2 కూడా వెనక్కి..
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. 2000 శాతం లాభాలు.. ఈ ఏడాది ఇండియాలో అత్యధిక లాభాల మూవీ ఇదే.. ధురంధర్ 2 కూడా వెనక్కి..

రూ.2 కోట్ల బడ్జెట్.. 2000 శాతం లాభంతో 'ధురంధర్ 2'పై విజయం

ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ అంశ్ అనే ఈ సినిమా మొదటి వారంలో అసలు ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. తొలి వీకెండ్‌లో కేవలం రూ. 60 లక్షల షేర్ వసూలు చేయడంతో దాదాపు ఫ్లాప్ కేటగిరీలో వేసేశారు.

కానీ రెండో వారం నుంచి జనాలు ఈ సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పుకోవడంతో సీన్ రీవర్స్ అయింది. థియేటర్ల యజమానులు షోలు పెంచక తప్పలేదు. దాంతో నాలుగో వీకెండ్‌కి వచ్చేసరికి ఏకంగా రూ. 28 కోట్ల వసూళ్లతో ట్రేడ్ వర్గాలను మైండ్ బ్లాక్ చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా ఇండియాలో రూ. 42 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించింది. ఈ రన్ ఇలాగే ఉంటే త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రూ. 125 కోట్ల బడ్జెట్‌తో వచ్చి 1000 శాతం లాభాలు సాధించిన 'ధురంధర్ 2' (Dhurandhar The Revenge), రూ. 30 కోట్ల బడ్జెట్‌తో 450 శాతం ప్రాఫిట్ తెచ్చిన 'ఆవారాపన్ 2' సినిమాలను ప్రాఫిట్ పర్సంటేజ్‌లో 'హనుమాన్ అంశ్' పూర్తిగా వెనక్కి నెట్టేసింది.

నీమ్ కరోలీ బాబా జీవిత కథతో తెరకెక్కిన హనుమన్ అంశ్

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (స్వామి లక్ష్మణ్ దాస్) జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 13 ఏళ్ల వయసు నుంచి ఆయన సాధువుగా మారి, కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఎలా మారారనే కథను చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు.

డాక్టర్ నుంచి ఫిల్మ్‌మేకర్‌గా మారిన విశాల్ చతుర్వేది ఈ సినిమాకు కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. చందన్ ఆనంద్, శోభినవ్ సత్య తమ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో లక్ష్మణ్ దాస్ పాత్రకు జీవం పోశారు.

స్వయంభూ మీడియా నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాగిణి ఎస్, నమ్రత జి.ఎస్, అనుప్రియ ఎ. నాగర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎటువంటి ఆర్టిఫిషియల్ హంగులు లేకుండా, కేవలం కంటెంట్ నమ్ముకుని తీసిన ఈ డివైన్ డ్రామా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కేస్ స్టడీలా మారింది.

లాంగ్ రన్‌లో రూ. 100 కోట్ల మార్క్ లక్ష్యంగా..

2026 సంవత్సరంలో 'జన నాయగన్', 'ధురంధర్ 2', 'ఆవారాపన్ 2' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించినప్పటికీ, పెట్టిన పెట్టుబడికి 20 రెట్లకు పైగా రాబడి తెచ్చిన ఏకైక సినిమా 'హనుమాన్ అంశ' మాత్రమే.

ఫుల్ రన్ ముగిసేసరికి ఈ లాభాల శాతం 5000 వరకు వెళ్లే ఛాన్స్ ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర దేవుడి మహిమ, వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో ఈ చిన్న సినిమా మరోసారి నిరూపించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More