పవన్ కల్యాణ్‌తో ఒక్క సినిమా చేసిన వేరే వంద సినిమాలు చేసిన ఒక్కటే.. హరి హర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్స్

పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా హీరోయిన్ నిధి అగర్వాల్ చేసింది. జూలై 24న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఓ ఇంటర్వ్యూలో హరి హర వీరమల్లు, పవన్ కల్యాణ్‌తో నటించడంపై నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పింది.

Published on: Jul 18, 2025, 11:45:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సినిమా హరి హర వీరమల్లు. ఎఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ చేసింది. బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశాడు.

పవన్ కల్యాణ్‌తో ఒక్క సినిమా చేసిన వేరే వంద సినిమాలు చేసిన ఒక్కటే.. హరి హర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్స్
పవన్ కల్యాణ్‌తో ఒక్క సినిమా చేసిన వేరే వంద సినిమాలు చేసిన ఒక్కటే.. హరి హర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్స్

హరి హర వీరమల్లు థియేట్రికల్ రిలీజ్

జూలై 24న హరి హర వీరమల్లు మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు సినిమా, పవన్ కల్యాణ్, తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

-హరి హర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి.

-పవన్ కల్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు.

పవన్ కల్యాణ్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?

-పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కల్యాణ్ గారికి ఎంతో స్టార్‌డమ్ ఉంది. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే కచ్చితంగా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది.

-వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కల్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది.

ఇద్దరు దర్శకులు క్రిష్ గారు, జ్యోతి కృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది?

-క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని.. ఈ తరానికి తగ్గట్టుగా పని చేస్తారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More