...
...
Next Story

హరిహర వీరమల్లు.. ప్రొడ్యూస‌ర్‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన ప‌వ‌న్‌.. క్రేజీ న్యూస్ ఇదే

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే థియేటర్లకు రావాల్సిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడింది. మరోవైపు ఈ ఫిల్మ్ కు సంబంధించి క్రేజీ న్యూస్ వస్తూనే ఉన్నాయి.

Published on: Jun 11, 2025, 10:15:01 IST
By ,
Prefer HTon Google
Advertisement

పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రొడక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయింది. షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ రిలీజ్ కు మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటికే పలు మార్లు మూవీ విడుదల వాయిదా పడింది. రీసెంట్ గా జూన్ 12న థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.

రిలీజ్ ఎప్పుడు?

హరిహరి వీరమల్లు పోస్టర్ (x/Mega Surya Production)
హరిహరి వీరమల్లు పోస్టర్ (x/Mega Surya Production)

ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే.. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడూ అని. రీసెంట్ గా జూన్ 26న ఈ మూవీ రిలీజ్ కాబోతోందని ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ ఆ పోస్టులను నమ్మొద్దని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ కు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలిసింది.

ప్రమోషన్స్ లో

హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రొడ్యూసర్ ఏఎం రత్నం బాగానే ఖర్చుపెట్టారు. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు అని ఇటీవల డైరెక్టర్ జ్యోతికృష్ణ‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ వాయిదా నేపథ్యంలో నిర్మాతపై భారం తగ్గించేలా పవన్ కల్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ రూ.11 కోట్లను చెల్లించేశారు. అంతే కాకుండా మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటానని ప్రొడ్యూసర్ కు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే బిజీ షెడ్యూల్ కారణం పవన్ మూవీ ప్రమోషన్లలో తక్కువగానే కనిపిస్తారు. కానీ ఈ సినిమా కోసం మాత్రం ప్రత్యేకంగా టైమ్ కేటాయించనున్నట్లు టాక్.

ఆ ఓటీటీ చేతిలో

హిస్టరికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన హరిహర వీరమల్లులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ ఆడిపాడింది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, వెన్నెల కిశోర్, అనసూయ తదితరులు నటించారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ‌ డైరెక్టర్లు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe