హరి హర వీరమల్లు రన్‌టైమ్ చాలా ఎక్కువే.. ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఇవే.. పవన్ కెరీర్లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్

పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు భారీ రన్ టైమ్ తో వస్తోంది. అంతేకాదు ఈ మూవీ సెన్సార్, ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి కూడా మేకర్స్ వెల్లడించారు. సెన్సార్ బోర్డు సభ్యులను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకున్నట్లు చెప్పారు.

Published on: Jul 14, 2025, 16:14:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హరి హర వీరమల్లు.. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సినిమా. రెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన మూవీ రిలీజ్ కానుండటంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్ టైమ్ ఏకంగా 2 గంటల 42 నిమిషాలు అని మేకర్స్ రివీల్ చేశారు. ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి.

హరి హర వీరమల్లు రన్‌టైమ్ చాలా ఎక్కువే.. ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఇవే.. పవన్ కెరీర్లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్
హరి హర వీరమల్లు రన్‌టైమ్ చాలా ఎక్కువే.. ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఇవే.. పవన్ కెరీర్లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్

హరి హర వీరమల్లు రన్ టైమ్

హరి హర వీరమల్లుమూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో వస్తున్న ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 2 గంటల 42 నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.

చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ కనువిందు చేయనున్నాడు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి వంటి వాళ్లు నటించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు.

హరి హర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్

హరి హర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ జులై 20న వైజాగ్ లో జరగనుంది. దీనికోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు ఈ ఈవెంట్ కు తరలి రానున్నారు. తిరుపతి, విజయవాడలలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు మొదట వార్తలు వచ్చినా.. తర్వాత విశాఖపట్నానికి మార్చారు.

రెండేళ్ల తర్వాత పవన్ మూవీ వస్తుండటం, అందులోనూ ఇప్పుడు అతడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండటంతో ఈ హరి హర వీరమల్లు మూవీ చాలా ప్రత్యేకంగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్

హరి హర వీరమల్లు మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.150 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. దీంతో మూవీ హిట్ గా నిలవాలంటే అదే స్థాయిలో వసూళ్లు కూడా చేయాల్సి ఉంది. పవన్ చరిష్మాతో భారీ ఓపెనింగ్స్ ఖాయం.

అయితే తొలి షో నుంచే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ మార్క్ ను అందుకుంటుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అటు 'హరి హర వీరమల్లు' మూవీకి ఇప్పటికే సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More