పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. హరిహర వీరమల్లు బిగ్ అప్‌డేట్.. ట్రైలర్ వచ్చేది ఆ రోజే
విడుదల వాయిదా పడుతూ వస్తున్న పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయల కాచేలా చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటికే హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ ను కూడా తీసుకు రాబోతున్నారు. ఫ్యాన్స్ లో హైప్ ను మరింత పెంచేందుకు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఏ రోజు అంటే?
హరిహర వీరమల్లును థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఈ జోష్ ను మరింత పెంచేలా హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. జులై 3న ఉదయం 11.10 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం
హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ తో మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘విప్లవం కోసం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. పవర్ ప్యాక్డ్, ఎక్స్ ప్లోజివ్ హరిహర వీరమల్లు ట్రైలర్ ను జులై 3న ఉదయం 11.10 గంటలకు రిలీజ్ చేస్తున్నాం’’ అని మెగా సూర్య ప్రొడక్షన్ ఎక్స్ లో పోస్టు చేసింది.
భారీ అంచనాలు
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. మేనళ్లుడు సాయి దుర్గ తేజ్ తో కలిసి 2023లో బ్రో చేశారు పవన్. ఆ తర్వాత రాజకీయాలతో బిజీగా అయిపోయారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఓ వైపు పొలిటికల్ పరంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ముందుగా సైన్ చేసిన సినిమాలు ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిచేశారు.
వాయిదా పడుతూ
హరిహర వీరమల్లు మూవీ నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఏప్రిల్ 29కి పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది మొదట మార్చి 28న, ఆ తర్వాత మే 9న, రీసెంట్ గా జూన్ 12న మూవీ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ కుదరలేదు. ఇప్పుడు జులై 24న పక్కాగా థియేటర్లకు తీసుకొస్తాం అంటున్నారు. ఇప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



