...
...
Next Story

అదిరిపోయిన హరి హర వీరమల్లు ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ కల్యాణ్ డైలాగ్‌లు, యాక్షన్ సీన్స్

పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇవాళ విడుదలైన హరి హర వీరమల్లు ట్రైలర్‌లో వీర యోధుడిగా పవన్ కల్యాణ్ కనిపించాడు. సుమారు మూడు నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్, చేసిన యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

Published on: Jul 3, 2025, 12:29:06 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ ప్రెస్టిజీయెస్ చిత్రం హరి హర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

ఇద్దరు డైరెక్టర్స్

అదిరిపోయిన హరి హర వీరమల్లు ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ కల్యాణ్ డైలాగ్‌లు, యాక్షన్ సీన్స్
అదిరిపోయిన హరి హర వీరమల్లు ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ కల్యాణ్ డైలాగ్‌లు, యాక్షన్ సీన్స్

హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్‌గా పవన్ కల్యాణ్ సరసన జోడీ కట్టింది.

హరి హర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్

తాజాగా మేకర్స్ చెప్పినట్లుగా ఇవాళ (జూలై 3) హరి హర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ అయింది. రెండు నిమిషాల 56 సెకన్లపాటు ఉన్న హరి హర వీరమల్లు ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. ప్రారంభం నుంచి చివరి వరకు మంచి హై ఇచ్చేలా ఈ ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.

పవన్ కల్యాణ్ డైలాగ్స్

ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ కనిపించిన తీరు హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్, చేసిన యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అందులోనూ పవన్ కల్యాణ్ వైపుకు వరుసగా బళ్లాలు వస్తుంటే పవర్ స్టార్ తిప్పికొట్టిన ఎపిసోడ్ సూపర్బ్‌గా ఉంది.

బీజీఎమ్ ఎలా ఉందంటే

హరి హర వీరమల్లు ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పవన్ కల్యాణ్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌కు మరింత ఇంపాక్ట్ ఇచ్చేలా బీజీఎమ్ ఉంది. మధ్యలో కాస్తా కామెడీ, రొమాంటిక్ ట్రాక్ చూపించారు. విజువల్స్ చాలా రిచ్‌గా బాగున్నాయి. అలాగే, బాబీ డియోల్ విలనిజం కూడా ఆకట్టుకునేలా ఉంది.

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్

కాగా హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్‌తోపాటు బాలీవుడ్ బ్యూటీస్ నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కూడా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే, సునీల్, సత్యరాజ్, జిషు షేన్‌గుప్తా, దలిప్ తాహిల్, అనసూయ భరద్వాజ్ సైతం ఇతర కీలక పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe