...
...
Next Story

హరి హర వీరమల్లు నిరవధిక వాయిదా.. పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్నాడా?

పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ మరోసారి నిరవధికంగా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం పవన్ అడ్వాన్స్ గా తీసుకున్న రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

Published on: Jun 4, 2025, 14:02:49 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ఏ ముహూర్తాన మొదలుపెట్టారోగానీ.. ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోవడం లేదు. జూన్ 12న వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ తన రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నాడట.

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్

హరి హర వీరమల్లు నిరవధిక వాయిదా.. పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్నాడా?
హరి హర వీరమల్లు నిరవధిక వాయిదా.. పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్నాడా?

క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. షూటింగ్ ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఫైనల్ గా జూన్ 12న వస్తోందని, జూన్ 8న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. కానీ ఇప్పుడీ రెండూ వాయిదా పడ్డాయి. మరో రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంత వరకూ అనౌన్స్ చేయలేదు.

మూవీ రిలీజ్ ఆలస్యం అవుతున్నందున నిర్మాత ఏఎం రత్నంకు భారీ నష్టాలు వస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ తీసుకున్న తన రెమ్యునరేషన్ రూ.11 కోట్లు తిరిగి ఇచ్చేయనున్నట్లు ఓ బజ్ క్రియేటైంది. నిజానికి ఈ మూవీ కోసం పవన్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగానే ఉంది. సుమారు రూ.50 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. అయితే వీఎఫ్ఎక్స్ కారణంగా మూవీ చాలా ఆలస్యం కావడంతో తాను తీసుకున్న అడ్వాన్స్ ను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నాడు.

పవన్ పెద్ద మనసు

టాలీవుడ్ లో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత పవర్ స్టార్ గా ఎదిగి తనకంటూ ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న పవన్ కల్యాణ్.. సినిమాల్లో నిర్మాత మేలు కోరే వ్యక్తిగా పేరుగాంచాడు. తన సినిమాల వల్ల నిర్మాతల నష్టపోతే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడమో లేదంటే వాళ్లకు మరో సినిమా చేయడమో అతనికి అలవాటు. గతంలో బండ్ల గణేష్ తో గబ్బర్ సింగ్ తీసింది అందుకే.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe