హరి హర వీరమల్లును బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ మూవీతో పోల్చిన ప్రొడ్యూసర్.. పవన్ అలాగే ఉంటాడంటూ..

పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మరో రెండు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ మూవీ సిరీస్ తో దీనిని పోల్చడం విశేషం.

Published on: Jul 8, 2025, 21:11:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హరి హర వీరమల్లు.. ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మొత్తానికి ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్ల జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హరి హర వీరమల్లును బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ మూవీతో పోల్చిన ప్రొడ్యూసర్.. పవన్ అలాగే ఉంటాడంటూ..
హరి హర వీరమల్లును బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ మూవీతో పోల్చిన ప్రొడ్యూసర్.. పవన్ అలాగే ఉంటాడంటూ..

ఇది ఇండియానా జోన్స్‌లా అనిపిస్తుంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాను ప్రొడ్యూసర్ ఏఎం రత్నం.. ప్రముఖ హాలీవుడ్ మూవీ సిరీస్ ఇండియానా జోన్స్ తో పోల్చడం విశేషం. ఈ మధ్య ఓ ఈవెంట్లో అతడు ఈ మూవీ గురించి మాట్లాడాడు.

“పవన్ గారికి సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ ట్రైలర్ చూస్తే తనకు మెకన్నాస్ గోల్డ్ గుర్తుకు వచ్చిందని అన్నారు. అయితే సెకండాఫ్ వరకూ చూసుకుంటే మాత్రం ప్రేక్షకులకు ఈ సినిమా ఇండియానా జోన్స్ ను గుర్తుకు తెస్తుంది. ఆ హాలీవుడ్ క్లాసిక్ లాగే ఈ సినిమాలో హీరో మిస్టరీ, యాక్షన్ తో కూడిని థ్రిల్లింగ్ జర్నీకి వెళ్తాడు” అని ఏఎం రత్నం అన్నాడు.

హరి హర వీరమల్లు మూవీ గురించి..

ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న హరి హర వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. కొన్నాళ్లుగా గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా.. ఈమధ్యే ట్రైలర్ తో అభిమానులకు మరింత విందు చేశారు. ధర్మం కోసం పోరాడే యోధుడిగా ఇందులో పవన్ కల్యాణ్ కనిపించబోతున్నాడు. ట్రైలర్లో అతడు చాలా పవర్‌ఫుల్ లుక్, డైలాగులతో అదరగొట్టాడు.

సినిమా ఎంత గొప్పగా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొదట క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. కీరవాణి మ్యూజిక్ అందించాడు. రెండేళ్లుగా పవన్ మూవీ కోసం చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ జులై 24న ఓ పండగ రోజు కాబోతోంది. మరి ఈ మూవీ వాళ్ల అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More