ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ మరో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 30న భైరవం రిలీజ్ కానున్న సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్‌తో మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ మరో ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు.

బిగ్గెస్ట్ రిలీజ్‌కి
భైరవం సినిమా మే 30న ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అలాగే, పూరీ జగన్నాథ్‌తో మూవీపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.
దాదాపు నాలుగు ఏళ్ల గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్‌లో ఎలాంటి కథల మీద వర్క్ చేశారు?
-హైందవ స్క్రిప్ట్ ఓకే చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. అది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. హైందవ, టైసన్ నాయుడు తర్వాత ఇంకేది చేయకూడదు అనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా భైరవం, కిస్కిందపురి వచ్చాయి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా నన్ను చాలా ఎగ్జైట్ చేశాయి. కిష్కిందపురి చాలా కొత్త జోనర్ సినిమా. ఆడియన్స్‌కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన జానర్ ఏంటి?
-ప్రతి సినిమాని కూడా ఎంజాయ్ చేస్తూనే చేస్తాను. ప్రతి సినిమాకి నా అటాచ్‌మెంట్ ఒకేలానే ఉంటుంది.
భైరవం టైటిల్ గురించి?
-ఈ సినిమాలో హీరో కొలిచేది కాలభైరవుడ్ని. కథలో నుంచే ఆ టైటిల్ వచ్చింది. ఈ సినిమా కోసం మ్యాసీవ్ టెంపుల్ సెట్ వేసాం. అది చాలా రియల్‌గా వచ్చింది. హ్యాట్సాఫ్ టు ఆర్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు.
నిర్మాత రాధా మోహన్ గారి గురించి?
-నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. నన్ను ఫస్ట్ నమ్మిన వ్యక్తి. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు చేయాలనుకున్నాను. కానీ, కుదరలేదు. ఈ సినిమాతో అన్ని సెట్ అయ్యాయి. చాలా పాషన్‌తో సినిమా నిర్మించే ప్రొడ్యూసర్.
పూరి జగన్నాథ్ గారితో మీరు సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ?
-ఒకటి రెండుసార్లు పూరి జగన్నాథ్ గారు, నేను కలిసాము. కచ్చితంగా ప్లాన్ చేస్తాము. డిఫరెంట్ సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. అందుకే భైరవం, టైసన్ నాయుడు, హైందవం కిష్కిందపురి.. దేనికి అవే ప్రత్యేకమైనటువంటి సినిమాలు. ఈ నాలుగు కూడా ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



