నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్.. మూడు సొసైటీల మధ్య క్లాష్ ఉంటుంది.. హీరో నాగార్జున కామెంట్స్
నాగార్జున డిఫరెంట్ రూల్‌లో కనిపించనున్న సినిమా కుబేర. డైరెకట్ర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాలో నాగార్జునతోపాటు ధనుష్, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ (జూన్ 20) థియేటర్లలో కుబేర రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విశేషాలను హీరో నాగార్జున పంచుకున్నారు.
సరికొత్త పాత్రలో హీరో నాగార్జున అలరించడానికి సిద్ధంగా ఉన్న సినిమా కుబేర. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీలో నాగార్జునతోపాటు తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు.

పాన్ ఇండియాగా కుబేర రిలీజ్
ఇవాళ (జూన్ 20) థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో కుబేర సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నాగార్జున ఇంట్రెస్టింగ్ సినీ విశేషాలను పంచుకున్నారు.
కుబేర లాంటి మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం?
-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు (ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణగారు, శోభన్ బాబు గారు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు.
-శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ మూవీ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్‌గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.
కుబేరలో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటి ?
-కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాల్లో మంచోళ్లు ఉన్నారు. చెడ్డోళ్లు ఉన్నారు. అల్ట్రా రిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి.
-శేఖర్ కమ్ముల నా క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పర్ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి. ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు.
శేఖర్ గారు మీ ఇమేజ్‌కి తగ్గట్టు స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేశారా ?
-లేదండి. ఆయన (శేఖర్ కమ్ముల) ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



