ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. తమిళంలో డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మాతగా నిర్మించిన గరుడన్ సినిమాకు తెలుగులో రీమేక్‌గా భైరవం తెరకెక్కింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముగ్గురు హీరోలతో చేయడంపై నారా రోహిత్ కామెంట్స్ చేశాడు.

Published on: May 29, 2025, 10:53:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళంలో వెట్రిమారన్‌కు డైరెక్టర్‌గా ఎంతో పేరు ఉంది. అలాంటి వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించి సాలిడ్ హిట్ అందుకున్న సినిమా గరుడన్. ఈ మూవీని తెలుగులో రీమేక్‌గా తెరకెక్కించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు.

ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్
ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్

మే 30న థియేటర్లలో

అదితి శంకర్ హీరోయిన్‌గా నటించిన భైరవం సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు. పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పించిన భైరవం మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వెట్రిమారన్, నిర్మాత రాధామోహన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నారా రోహిత్ ఇతర సినీ విశేషాలను పంచుకున్నాడు.

జయసుధ గారి క్యారెక్టర్ గురించి?

-ఇందులో జయసుధ గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. జయసుధ గారు లెజెండరీ. సార్ వచ్చారు తర్వాత వారితో వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది ?

-నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

-ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకి మేజర్ హైలైట్. చాలా రోజుల తర్వాత ఇంత హెవీ యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ముగ్గురు కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్‌కి చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది .

తెలుగు కోసం ఎలాంటి మార్పులు చేశారు?

-స్టోరీ లైన్ అదే ఉంటుంది. అయితే తెలుగులోకి వచ్చేసరికి ప్రతి సీన్‌ని రీరైట్ చేసాం. మన నేటివిటీకి తగ్గట్టు సినిమా ఉంటుంది. సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒరిజినల్ కంటే మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.

హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?‌

-ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఉండదు. ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ గారి కథ. ప్రతి పాత్రకి కథలో చాలా కీలక పాత్ర ఉంటుంది.

నిర్మాత రాధా మోహన్ గారి గురించి?

-రాధా మోహన్ గారి లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమా తీశారు. ఆయనకి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ రావాలని భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More