...
...
Next Story

స్వాసిక చూడటానికి సాఫ్ట్‌గా ఉంది కానీ.. మలయాళ హీరోయిన్‌పై హీరో నితిన్ కామెంట్స్.. అప్పట్లో 60 లక్షల ఖర్చు అంటూ!

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ తమ్ముడు. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ, సప్తమి గౌడ, లయతోపాటు మలయాళ హీరోయిన్ స్వాసిక విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్న జరిగిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్వాసిక, దిల్ రాజుపై హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 12, 2025, 11:32:35 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. కానీ, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాంటి రాబిన్ హుడ్ సినిమా తర్వాత హీరో నితిన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ తమ్ముడు. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.

నితిన్ కామెంట్స్

స్వాసిక చూడటానికి సాఫ్ట్‌గా ఉంది కానీ.. మలయాళ హీరోయిన్‌పై హీరో నితిన్ కామెంట్స్.. అప్పట్లో 60 లక్షల ఖర్చు అంటూ!
స్వాసిక చూడటానికి సాఫ్ట్‌గా ఉంది కానీ.. మలయాళ హీరోయిన్‌పై హీరో నితిన్ కామెంట్స్.. అప్పట్లో 60 లక్షల ఖర్చు అంటూ!

ఈ సినిమాలో హీరోయిన్‌గా వర్ష బొల్లమ చేయగా.. సీనియర్ హీరోయిన్ లయ, సప్తమి గౌడతోపాటు మలయాళ హీరోయిన్ స్వాసిక విజయ్ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, అల్లు శిరీష్ నిర్మించిన తమ్ముడు ట్రైలర్‌ను జూన్ 11న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్వాసిక, దిల్ రాజు, తమ్ముడు మూవీపై హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో నితిన్ మాట్లాడుతూ.. "తమ్ముడు మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ సినిమాకు లయ గారు చాలా ఇంపార్టెంట్. ఆమె చాలా బాగా పర్‌ఫార్మ్ చేశారు. అలాగే సప్తమి గౌడ ఈ చిత్రంలో కీ రోల్ చేశారు. స్వాసిక చూడటానికి సాఫ్ట్‌గా ఉంది. కానీ, ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుంది" అని అన్నాడు.

నాలుగేళ్లు కష్టపడ్డారు

"నా ఎడిటర్ ప్రవీణ్ పూడి, మా డీవోపీ గుహన్ గారు, అజనీష్ గారు సూపర్బ్‌గా ఔట్ పుట్ ఇచ్చారు. మా డైరెక్టర్ వేణు గారు నాలుగేళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. ఎక్కువగా ఫారెస్ట్‌లో షూట్ చేశాం" అని హీరో నితిన్ చెప్పుకొచ్చాడు.

ఇక మలయాళ హీరోయిన్ స్వాసిక విజయ్ మాట్లాడుతూ.. "తమ్ముడు మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నాయి. నేను కెరీర్‌ బిగినింగ్‌లో ఉన్నాను. ఇలాంటి టైమ్‌లో మంచి రోల్ దొరకడం సంతోషంగా ఉంది. అందుకు నిర్మాత దిల్ రాజు గారికి, డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి థ్యాంక్స్ చెబుతున్నా" అని అన్నారు.

"తమ్ముడు మూవీలో టాలెంటెడ్ కాస్టింగ్‌తో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. జూలై 4న తమ్ముడు మూవీని థియేటర్స్‌లో చూడండి" అని మలయాళ బ్యూటి స్వాసిక తెలిపింది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe