...
...
Next Story

హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మృతి.. తీర‌ని శోకంలో కుటుంబం.. ఆయ‌న ఏం చేసేవారంటే?

మాస్ మహారాజ్ గా తెలుగు ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్న హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం. అతని తండ్రి భూపతి రాజు రాజగోపాల్ కన్నుమూశారు. దీంతో రవితేజ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది.

Published on: Jul 16, 2025, 08:34:45 IST
By ,
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ మరణించారు. 90 ఏళ్ల ఆయన వయసు సంబంధిత అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. మంగళవారం (జూలై 15) రాత్రి హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో భూపతి రాజు చనిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి చనిపోవడంతో రవితేజ బాధలో మునిగిపోయారు. ఆయన కుటుంబానికి ఇది తీరని లోటు.

ఏం చేసేవారంటే?

తండ్రితో రవితేజ (x)
తండ్రితో రవితేజ (x)

మాస్ మహారాజ్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో రవితేజ. రవితేజ ఈ స్థాయికి చేరడం వెనుక తండ్రి భూపతి రాజు రాజగోపాల్ ప్రోత్సాహం ఉంది. భుజం తట్టి నడిపించిన తండ్రి ఇప్పుడు కన్నుమూయడంతో రవితేజ తీవ్రంగా బాధపడుతున్నారు. భూపతి రాజు ఒకప్పుడు ఫార్మాసిస్ట్ గా పనిచేసేవారు. వీళ్ల సొంత ఊరు ఏపీలోని జగ్గంపేట. భూపతి రాజుకు ముగ్గురు కొడుకులు. రవితేజ పెద్ద కుమారుడు. భరత్ రెండో కొడుకు. రఘు చిన్న తనయుడు. భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఇద్దరు ఒకేసారి

రవితేజ రీల్ ఫాదర్, రియల్ ఫాదర్ ఇద్దరూ రెండు రోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. రీల్ ఫాదర్ కోట శ్రీనివాస రావు జులై 13న మరణించిన సంగతి తెలిసిందే. ఇడియట్ సినిమాలో తండ్రీకొడుకులుగా కోట శ్రీనివాస రావు, రవితేజ అద్భుతంగా నటించారు. వీళ్ల మధ్య సీన్లు అదిరిపోయాయి. కోట మరణంతో షాక్ కు గురైన రవితేజ.. సోషల్ మీడియా పోస్టు ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు రియల్ ఫాదర్ భూపతి రాజు జులై 15న రాత్రి కన్నుమూశారు.

కష్టంతో ఎదిగాడు.

సినిమా హీరోగా రవితేజ తన కష్టంతో ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్నారు. 1997లో సింధూరం సినిమాలో సెకండ్ హీరోగా చేశాడు. 1999లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో నీకోసం మూవీతో హీరోగా మారాడు రవితేజ. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఇడియట్ హిట్ తో టాప్ లోకి దూసుకెళ్లాడు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks