ఓటీటీ వెబ్ సిరీస్ అంటే ఎంత వల్గర్ ఉందనే గురించే మాట్లాడుతున్నాం.. హీరో శివ కందుకూరి కామెంట్స్
టాలీవుడ్ హీరో, భూతద్దం భాస్కర్ నారాయణ ఫేమ్ శివ కందుకూరి ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. జూన్ 6 నుంచి దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో శివ కందుకూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తెలుగులోని ఎంతోమంది యంగ్ హీరోల్లో శివ కందుకూరి ఒకరు. చూసి చూడంగానే, మను చరిత్ర, భూతద్దం భాస్కర్ నారాయణ వంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన శివ కందుకూరి ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శివ కందుకూరి ఓటీటీ ఎంట్రీ ఇస్తూన్న తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ.

ఓటీటీ వెబ్ సిరీస్‌లో
ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌లో శివ కందుకూరితోపాటు సూర్య వశిష్ట మరో హీరోగా చేస్తున్నాడు. హీరోయిన్‌గా టాలీవుడ్ బ్యూటి రీతు వర్మ చేసింది. బి. కిశోర్ దర్శకత్వం వహించిన దేవిక అండ్ డానీ సిరీస్‌ను సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు.
దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్
జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో రీసెంట్‌గా రెండు ఎపిసోడ్స్‌ను మీడియా సమక్షంలో ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో శివ కందుకూరి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
ఎంత వల్గర్ ఉందనే
శివ కందుకూరి మాట్లాడుతూ.. "వెబ్ సిరీస్ అంటే సాధారణంగా ఎంత వల్గర్ ఉందనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ‘దేవిక అండ్ డానీ’ వంటి క్లీన్ స్క్రిప్ట్‌ను యాక్సెప్ట్ చేయటం గొప్ప విషయం. మంచి వాల్యూస్ ఉన్న స్క్రిప్ట్‌ను ఒప్పుకున్నందుకు జియో హాట్‌స్టార్ వారికి ధన్యవాదాలు" అని అన్నాడు.
సుబ్బు అనే పాత్రను
"మంచి కంటెంట్‌ను అందించటానికి వారు (జియో హాట్‌స్టార్) ముందుకొచ్చారు. మా నిర్మాత సుధాకర్ గారికి థాంక్స్. సినిమాకు ఏమాత్రం తగ్గకుండా గొప్ప టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో నేను సుబ్బు అనే పాత్రను పోషించాను" అని శివ కందుకూరి తెలిపాడు.
అమ్మాయి జీవితంలో
"దేవిక అనే అమ్మాయి జీవితంలో వచ్చే ప్రతీ పాత్ర ఎలా ట్రావెల్ చేసిందో ఇందులో మనం చూడొచ్చు. సుబ్బు అనే ఫన్నీ పాత్రను చేయటాన్ని చాలా ఎంజాయ్ చేశాను. నాపై నమ్మకంతో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన మా డైరెక్టర్ కిశోర్ గారికి థాంక్స్. మా అందరినీ ఇంత బాగా చూపించిన మా సినిమాటోగ్రాఫర్ వెంకట్ దిలీప్ గారికి థాంక్స్" అని కథానాయకుడు శివ కందుకూరి చెప్పుకొచ్చాడు.
చాలా మంచి పాత్రల్లో
"దేవిక పాత్రను రీతు వర్మ గొప్పగా చేసింది. ఆమె ఇంతకు ముందు చాలా మంచి పాత్రల్లో మనకు కనిపించింది. ఇప్పుడిది మరో మంచి పాత్ర అవుతుంది. సూర్య వశిష్ట్ చేసిన డానీ, తన పాత్రలోని వేరియేషన్స్‌ను చక్కగా చేశాడు. జూన్ 6 నుంచి దేవిక అండ్ డానీ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అందరికీ ఈ సిరీస్ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని హీరో శివ కందుకూరి తన స్పీచ్ ముగించాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



