నేను మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను.. బొమ్మరిల్లులోని తండ్రికొడుకుల ఎమోషన్ చూస్తారు.. హీరో సిద్ధార్థ్ కామెంట్స్

బొమ్మరిల్లు సినిమాతో హీరోగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ కెరీర్‌లో 40వ సినిమాగా వస్తున్న 3 బీహెచ్‌కే ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jun 28, 2025, 10:57:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరో సిద్ధార్థ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ఉంది. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, ఓయ్ తదితర సినిమాలతో ఎంతో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ తన కెరీర్‌లో 40వ సినిమాగా త్రీ బీహెచ్‌కే మూవీ తెరకెక్కింది.

నేను మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను.. బొమ్మరిల్లులోని తండ్రికొడుకుల ఎమోషన్ చూస్తారు.. హీరో సిద్ధార్థ్ కామెంట్స్
నేను మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను.. బొమ్మరిల్లులోని తండ్రికొడుకుల ఎమోషన్ చూస్తారు.. హీరో సిద్ధార్థ్ కామెంట్స్

3 బీహెచ్‌కే ట్రైలర్ రిలీజ్

3 బీహెచ్‌కే సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు. తన సొంతిల్లు కోసం ఎదురుచూడటంపై సిద్ధార్థ్ మాట్లాడాడు.

రియల్ లైఫ్ నుంచి

హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 3 బీహెచ్‌కే మూవీ ఫ్యామిలీని మీకు పరిచయం చేయాలి. అరుణ్ విశ్వా ఎగ్జైటింగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చిన కథ. ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే మా నాన్నని గట్టిగా హగ్ చేసుకోవాలని అనిపించింది" అని అన్నాడు.

బొమ్మరిల్లులో చూశారు

"తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్‌ని బొమ్మరిల్లు సినిమాలో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్లీ తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్, ఎమోషన్‌ను 3 బీహెచ్‌కే సినిమాలో చూస్తారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎలాంటి అనుభూతి కలిగిందో మీకు కూడా ఆ అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను" అని సిద్ధార్థ్ తెలిపాడు.

హగ్ చేసుకోడానికి పక్కనే

"మీ ఫ్యామిలీని తీసుకుని థియేటర్స్‌కి వెళ్లండి. వాళ్లని హగ్ చేసుకోవడానికి మీ పక్కనే ఉంటారు. శ్రీ గణేష్ ఎక్స్‌ట్రార్డినరీ రైటర్, డైరెక్టర్. తను ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. సొంత ఇల్లు అందరి కల. నేను కూడా చిన్నప్పుడు మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను. మనందరం అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాము"అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.

మెయిన్ క్యారెక్టర్ ఇల్లు

"ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇల్లు. అందులో మెయిన్ క్యారెక్టర్స్ శరత్ కుమార్ గారు, దేవయాని గారు. వాళ్లు ఈ సినిమాలో నటించడం మర్చిపోలేని అదృష్టం. ఇది నా 40వ సినిమా. అలాంటి సినిమాలో ఇంత మంచి యాక్టర్స్ ఉండటం నా అదృష్టం" అని హీరో సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More