నన్ను హీరోగా నిలబెట్టిన పిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు.. ఆయనతో 10 సినిమాలు చేశాను.. హీరో శ్రీకాంత్ కామెంట్స్
టాలీవుడ్‌లో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు శ్రీకాంత్. ఇప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు ఈ సీనియర్ హీరో. అయితే, జూన్ 1న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.
సకుటుంబసమేతంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్‌లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ డైరెక్ట్ చేశారు ఎస్వీ కృష్ణారెడ్డి. జూన్ 1న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా నిర్వహించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుక అతిథులు
ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, హీరోయిన్స్ ఆమని, ఇంద్రజ, లయ, రవళి, కమెడియన్ బ్రహ్మానందం, అలీ, నటులు శివాజీ రాజా, తనికెళ్ల భరణి, చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు. ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.
హీరోగా ఎదిగేందుకు
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "నన్ను హీరోగా నిలబెట్టిన ఫిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు.. ఒకరు ఈవీవీ సత్యనారాయణ, మరొకరు ఎస్వీ కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు చిత్రంలో అర్జునుడిగా నటించాను. అది మా కాంబినేషన్‌లో మొదటి సినిమా. ఆ తర్వాత వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం.. ఇలా పది చిత్రాలు చేశాను. నేను హీరోగా ఎదిగేందుకు ఆయన సినిమాలన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి" అని అన్నారు.
యమలీల మర్చిపోలేను
"ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చేసిన ఎన్నో చిత్రాల్లో నేను నటించాను. నా జీవితంలో యమలీల సినిమా ఎప్పటికీ మర్చిపోలేను. స్నేహానికి వీరిద్దరూ మారుపేరు. నాలాగే ఎంతోమంది నటీనటుల కెరీర్‌లను నిలబెట్టిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా" కమెడియన్, నటుడు అలీ తెలిపాడు.
తోట రాముడిగా మంచి పేరు
నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. "నా నట జీవితం యమలీలకు ముందు యమలీల తర్వాత అని చెప్పుకోవాలి. ఆ సినిమాలో తోట రాముడిగా నాకు మంచి పేరు వచ్చింది. ఎస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాల్లో నటించడం మర్చిపోలేని అనుభవం" అని వెల్లడించారు.
మా కుటుంబం గుర్తుంచుకుంటుంది
లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. "ఎస్వీ కృష్ణారెడ్డి గారు మా కుటుంబంలో పెద్ద లాంటి వారు. ఆయన నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. సినిమాలోని అన్ని పాటలు రాసే అవకాశం కూడా ఎస్వీ కృష్ణారెడ్డి కల్పించారు. మా కుటుంబం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని చెప్పుకొచ్చారు.
గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం
నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. "కుటుంబ కథా చిత్రాలను రూపొందించి ఇండస్ట్రీకి స్ఫూర్తిగా నిలిచారు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన ఒక చిన్న సినిమా తీసినా అది చాలా పెద్ద విజయాన్ని అందుకునేది. ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడుతుడటం ఎస్వీ కృష్ణారెడ్డి గారి మంచితనానికి, గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం" అని తెలిపారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



