YS Jagan in Chennai : వైఎస్ జగన్ తో స్టార్ హీరోలు సూర్య, కార్తీ - వీడియో వైరల్

మాజీ సీఎం వైఎస్ జగన్ ను తమిళ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలు కలిశారు. జగన్ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ వేడుకలో కలిసిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published on: Feb 8, 2026, 13:36:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చెన్నైలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఇందులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

హీరో సూర్యతో వైెఎస్ జగన్
హీరో సూర్యతో వైెఎస్ జగన్

వైఎస్ జగన్‌తో సూర్య, కార్తీ…

ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య, కార్తీలు కూడా వచ్చారు. వివాహ మండపంలో వైఎస్ జగన్ ముందు వరుసలో కూర్చున్నారు. హీరో సూర్య, కార్తీలను చూసిన జగన్…. వారిద్దరిని పలకరించి ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. కాసేపుతో వారితో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జగన్, సూర్య, కార్తీ ముగ్గురు కలిసి మాట్లాడిన వీడియోని వైసీపీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ రాస్తూ… పోస్టులు చేస్తున్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ ను కూడా వైఎస్ జగన్ కలిశారు. కొద్దిసేపు ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More