వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం ఆయనే.. డ్యాన్స్‌లో వెపన్.. హీరోయిన్ శ్రీలీల కామెంట్స్

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ జూనియర్. జూలై 13న జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Jul 14, 2025, 06:46:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డ్యాన్సింగ్ క్వీన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటిపుల్ హీరోయిన్. శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా ఈ జూనియర్.

వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం ఆయనే.. డ్యాన్స్‌లో వెపన్.. హీరోయిన్ శ్రీలీల కామెంట్స్
వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం ఆయనే.. డ్యాన్స్‌లో వెపన్.. హీరోయిన్ శ్రీలీల కామెంట్స్

వైరల్ వయ్యారి సాంగ్ వైరల్

సీనియర్ హీరోయిన్ జెనీలియా ఇందులో కీలక పాత్ర పోషించింది. జూనియర్ సినిమాకు రాధ కృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి జూనియర్ సినిమాను నిర్మించారు. అయితే, జూనియర్ మూవీ సాంగ్స్ చార్ట్‌ బస్టర్‌ హిట్ అయ్యాయి. ముఖ్యంగా వైరల్ వయ్యారి అనే పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయింది.

జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

జూనియర్ టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూనియర్ సినిమా జూలై 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్

హీరోయిన్ శ్రీలీలమాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా జర్నీ చాలా వండర్‌‌ఫుల్‌గా జరిగింది. రాధాకృష్ణ గారు చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఈ కథని చాలా అద్భుతంగా చెప్పారు. రవిచంద్రన్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్" అని చెప్పింది.

జెనీలియాతో కలిసి

"జెనీలియా గారితో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్ నిర్మాత సాయి గారు. చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. శివన్న గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది" అని శ్రీలీల తెలిపింది.

డ్యాన్స్‌లో వెపన్‌గా

"కిరీటితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. డాన్స్ పెర్ఫార్మెన్స్‌లో ఒక వెపన్‌గా అనిపించారు. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం దేవీశ్రీ ప్రసాద్ గారు. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. జూలై 18న ఈ సినిమా వస్తుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను" అని శ్రీలీల తన స్పీచ్ ముగించింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More