...
...
Next Story

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాని సూపర్ హిట్ వైలెంట్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?

హిట్ 3 సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ అర్ధరాత్రే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

Published on: May 28, 2025, 12:16:41 IST
By
Prefer HTon Google
Advertisement

వైలెంట్ యాక్షన్ మూవీ హిట్ 3 (హిట్: థర్డ్ కేస్) మంచి హిట్ సాధించింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ వచ్చినా రూ.100కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి సక్సెస్ సొంతం చేసుకుంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ హిట్ 3 మూవీ ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్ననమైంది.

హిట్ 3 స్ట్రీమింగ్ వివరాలు ఇవే

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాని సూపర్ హిట్ వైలెంట్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాని సూపర్ హిట్ వైలెంట్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?

హిట్ 3 సినిమా రేపు (మే 29) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రే స్ట్రీమింగ్ షురూ కానుంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్‌లో చూసేయవచ్చు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ హిట్ 3 మూవీ అందుబాటులోకి వస్తుంది.

నాలుగు వారాల్లోనే..

హిట్ 3 చిత్రం కమర్షియల్‍గా హిట్ అయినా నెట్ఫ్లిక్స్ఓటీటీలోకి నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‍కు వస్తోంది. మే 1న థియేటర్లలోకి వచ్చి ఇదే నెలలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. స్ట్రీమింగ్‍లో ఈ మూవీకి నేషనల్ వైడ్‍లో బాగా క్రేజ్ కనిపించే ఛాన్స్ ఉంది. నాని చిత్రాలకు ఓటీటీలో మంచి వ్యూస్ దక్కుతుంటాయి. హిట్ 3 కూడా అది రిపీట్ చేసే అవకాశాలు ఎక్కువే.

కిల్లర్స్ గ్రూప్ పనిపట్టేందుకు..

హిట్ 3 మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఓ కిల్లర్స్ గ్రూప్‍ను పోలీస్ ఆఫీసర్ కనిపెట్టి మట్టుబెట్టడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. వైలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టారు. యాక్షన్‍తో మెప్పించారు. ఈ చిత్రంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు.

హిట్ 3 వసూళ్లు

హిట్ 3 మూవీలో నాని, శ్రీనిధితో పాటు కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్, సముద్రఖని, ప్రతీక్ బబ్బర్, రావు రమేశ్, ఆదిల్ పాలా కీరోల్స్ చేశారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. సాజు జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీని రేపటి నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe