ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 120 కోట్ల తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. 7.4 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ రూ. 120 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3 వచ్చేసింది. అది కూడా ఏకంగా ఐదు భాషల్లో హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.4 రేటింగ్ అందుకున్న నేచురల్ స్టార్ నాని హిట్ 3 ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

May 29, 2025, 14:37:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వచ్చేసింది. సాధారణంగా సూపర్ హిట్ అయిన సినిమాలు నెల దాటిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్అవుతుంటాయి. కానీ, ఈ మూవీ మాత్రం రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ నెల రోజులు కాకముందే ఓటీటీ రిలీజ్ అయిపోయింది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 120 కోట్ల తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. 7.4 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 120 కోట్ల తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. 7.4 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

పెరిగిన అంచనాలు

ఆ సినిమానే నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా హిట్ ది థర్డ్ కేస్ వచ్చింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. దాంతో సినిమా కోసం ఎంతగానే ఆడియెన్స్ ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే మే 1న థియేటర్లలో హిట్ 3 విడుదలైంది.

సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హిట్ 3 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.4 రేటింగ్ తెచ్చుకుంది. ఇక ఫ్రెష్ కంటెంట్ ఎంతో చెప్పే రొట్టెన్ టొమాటోస్ అయితే 71 శాతం తాజా కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక హిట్ 3 మూవీలోని సీన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది.

సర్వైవల్ థ్రిల్లర్‌గా

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాస్తా సెకండాఫ్‌లో సర్వైవల్ థ్రిల్లర్‌గా మారిందని హిట్ 3పై రివ్యూలు వచ్చాయి. అయితే, దానిపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. హిట్ 3లో అర్జున్ సర్కార్‌గా నాని అదరగొట్టాడని ప్రశంసలు వచ్చాయి. అర్జున్ సర్కార్ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుందన టాక్ వినిపించింది.

ఇలా ఎన్నో పాజిటివ్స్ తెచ్చుకున్న హిట్ 3 ఇవాళ (మే 29) ఓటీటీ రిలీజ్ అయింది. సుమారు 29 రోజుల్లో అంటే నెల కాకుండానే హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో హిట్ 3 ఓటీటీ రిలీజ్ అయింది.

డాల్బీ విజన్ వీడియో

దీంతోపాటు స్పెషల్ అట్రాక్షన్‌గా హిట్ 3 మూవీ 4కె డాల్బీ విజన్ వీడియో, డాల్బీ అట్మాస్ ఆడియో వెర్షన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇది ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. కాగా, హిట్ 3 మూవీలో కన్నడ బ్యూటి, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

మృదుల పాత్రలో శ్రీనిధి శెట్టి సైతం బాగా అలరించనది టాక్ వినిపించింది. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వ్యవహరించిన హిట్ ది థర్డ్ కేస్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అలాగే, హిట్ 3 చిత్రంలో సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా, రవి మరియా, రావు రమేష్, బ్రహ్మాజీ, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిట్ 3

అడివి శేష్, విశ్వక్ సేన్, తమిళ స్టార్ హీరో కార్తీ హిట్ 3 మూవీలో స్పెషల్ కెమియోలతో అలరించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హిట్ 3 నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More