మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్- బ్రహ్మదేవుడి వరం కోసం హిరణ్యకశిపుడి తపస్సుతో- గూస్‌బంప్స్ సీన్స్, అదిరిపోయిన విజువల్స్!

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో రూపొందిన మైథలాజికల్ యానిమేషన్ సినిమా మహావతరా నరసింహ ట్రైలర్ రిలీజ్ అయింది. బ్రహ్మదేవుడి వరం కోసం హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సుతో ప్రారంభమైన ఈ ట్రైలర్ అదిరిపోయే విజువల్స్‌తో అట్రాక్ట్ చేసింది.

Published on: Jul 10, 2025, 09:03:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పుడు హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నుంచి రూపొందిన లేటెస్ట్ మూవీ మహావతార్ నరసింహ.

మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్- బ్రహ్మదేవుడి వరం కోసం హిరణ్యకశిపుడి తపస్సుతో- గూస్‌బంప్స్ సీన్స్, అదిరిపోయిన విజువల్స్!
మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్- బ్రహ్మదేవుడి వరం కోసం హిరణ్యకశిపుడి తపస్సుతో- గూస్‌బంప్స్ సీన్స్, అదిరిపోయిన విజువల్స్!

ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్

ఇండియన్ మైథలాజికల్ యానిమేషన్ మూవీగా తెరకెక్కిన మహావతార్ నరసింహాను విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దారు మేకర్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ ఐదు భాషల్లో రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు అత్యద్భుతంగా ఉంది.

ఘోర తపస్సుతో ప్రారంభం

బ్రహ్మ దేవుడి వరం కోసం హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసే సీక్వెన్స్‌తో మొదలైన మహావతార్ నరసింహ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. బ్రహ్మదేవుడి వరాన్ని హిరణ్యకశిపుడు పొందడం, ప్రజలను హింసించడం, తన ఇంట్లోనే విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు జన్మించడం, తండ్రి హిరణ్యకశిపుడి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడం వంటి సీన్లతో అదిరిపోయింది.

గూస్‌బంప్స్ తెప్పించేలా

ఇక ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించింది. అలాగే, కొన్ని సీన్స్ అదిరిపోయే విజువల్స్‌తో మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉన్నాయి.

విజువల్ వండర్‌లా

ఎపిక్ విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతంతో మహావతార్ నరిసింహ ట్రైలర్ విజువల్ వండర్‌లా ఉంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగి నెక్ట్స్ లెవల్‌కి చేరుకుంది. భారతీయ చరిత్ర నుంచి ఈ ఐకానిక్ కథను ఇంత అద్భుతంగా ఇంతవరకు ఎవరు చూపించలేదని మేకర్స్ చెబుతున్నారు.

నరసింహ, వరాహుల ఇతిహాస కథ

మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత శిల్పా ధావన్ మాట్లాడుతూ.. "శ్రీ నరసింహ, శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం, ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది. నర్సింహ గర్జన వస్తోంది" అని అన్నారు.

మొట్టమొదటి యానిమేటెడ్ ట్రైలర్

దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. "మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్‌ను ఆయన కృపతో ఆవిష్కరించారు. డివైన్ జర్నీ ప్రారంభమైయింది. క్లీమ్ ప్రొడక్షన్స్ విజన్, ప్రేక్షకుల కోసం న్యూ ఏజ్ మీడియా, స్క్రీన్‌తో భారత్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే కల సజీవంగా ఉంది" అని పేర్కొన్నారు.

మహావతార్ నరసింహ రిలీజ్ డేట్

మహావతార్ నర్సింహ సినిమాకు కు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. మహావతార్ 3Dలో ఐదు భారతీయ భాషలలో 2025 జూలై 25న విడుదల కానుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More