ఇవాళ ఓటీటీలోకి వచ్చిన వణికించే హారర్ థ్రిల్లర్.. 1331 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఫోన్ తో షూటింగ్
ఇవాళ ఓటీటీలోకి ఓ వణికించే హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. వైరస్, హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ పంచుతోంది. ఈ మూవీలోని కొన్ని సీన్లు ఐ ఫోన్ లో తీయడం విశేషం.
ఓటీటీలోకి ఇవాళ ఓ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. వణికించే సీన్లతో, భయపెట్టే సన్నివేశాలతో సాగే ఈ సినిమా హారర్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్ కు ఓ మంచి ఫీస్ట్ లాంటిది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన అమెరికన్ సినిమా ‘28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్’ ఈ రోజు (సెప్టెంబర్ 20) ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హారర్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో?
బాక్సాఫీస్ ను షేక్ చేసిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ ‘28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్’ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఇది అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లాక్ బస్టర్
అమెరికన్ హారర్ థ్రిల్లర్ ‘28 ఇయర్స్ లేటర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ 20న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. 60 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా 151.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1331 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.
మూడు నెలలకు ఓటీటీలో
బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 28 ఇయర్స్ లేటర్ మూవీ మూడు నెలలకు ఓటీటీలోకి వచ్చింది. జూన్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు సెప్టెంబర్ 20న డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలోని కొన్ని సీన్లను ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోతో షూట్ చేయడం విశేషం.
హారర్ ఫ్రాంఛైజీ
హారర్ థ్రిల్లర్ 28 ఇయర్స్ లేటర్ మూవీ హారర్ ఫ్రాంఛైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఇది 28 డేస్ లేటర్ ఫిల్మ్ సిరీస్ లో ఓ పార్ట్. ఇంతకుముందు ఇందులో 2002లో 28 డేస్ లేటర్, 2007లో 28 వీక్స్ లేటర్ మూవీస్ వచ్చాయి. 2025లో 28 ఇయర్స్ లేటర్ సినిమా వచ్చింది. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
కథ ఏమిటంటే?
2002లో ఓ వైరస్ వచ్చి మనుషులంతా రాక్షసుల్లా మారిపోతారు. జనాలను చంపుతారు. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత మరోసారి ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మరి ఇప్పుడు ఆ వైరస్ ను ఎలా అడ్డుకున్నారు? రాక్షసులుగా మారిన వాళ్ల నుంచి హీరో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే కథ.
28 ఇయర్స్ లేటర్ మూవీకి డ్యానీ బోయ్ లే డైరెక్టర్. ఇందులో జోడీ కార్నర్, ఆరోన్ టేలర్, జాక్ ఓ కానెల్ తదితరులు నటించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper













