Hyd e Champions: టీజీ20 ఛాంపియన్స్ సెలబ్రేషన్స్ చూశారా? రామోజీ ఫిల్మ్ సిటీలో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్.. జోష్ లో ఆటగాళ్లు!

Hyd e Champions: రీసెంట్ గా ముగిసిన ఫస్ట్ టీజీ20 లీగ్ లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ విన్నర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన ఈ హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు తమ విజయ సంబరాలను ప్రపంచ ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరుపుకొంది. ఆ విశేషాలు ఇవే.

Published on: Jul 18, 2026, 21:47:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyd e Champions: క్రీడా రంగంలో సాధించిన చరిత్రాత్మక విజయాల సంబరాలు ఇప్పుడు కేవలం స్టేడియాలకో, డ్రెస్సింగ్ రూమ్‌లకో మాత్రమే పరిమితం కావడం లేదు. సరికొత్త క్రీడా సంస్కృతికి అద్దం పడుతూ, ప్రతిష్టాత్మకమైన తొలి టీజీ20 లీగ్ విజేతలు 'హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్' తమ టైటిల్ గెలుపు సంబరాలను ప్రపంచ ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో వైభవంగా జరుపుకొన్నారు. క్రికెట్ ఘనత, సినీ ప్రపంచం, అద్భుతమైన వినోదం ఒకే వేదికపై చేరి ఈ సంబరాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి.

టీజీ20 ఛాంపియన్స్ సెలబ్రేషన్స్ చూశారా? రామోజీ ఫిల్మ్ సిటీలో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్..ఆటగాళ్ల సంబరాలు!
టీజీ20 ఛాంపియన్స్ సెలబ్రేషన్స్ చూశారా? రామోజీ ఫిల్మ్ సిటీలో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్..ఆటగాళ్ల సంబరాలు!

ఈ ఛాంపియన్స్ కు టైటిల్

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను సరికొత్త మలుపు తిప్పుతూ ప్రారంభమైన ప్రీమియర్ టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో తొలి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ విక్టరీ సెలబ్రేషన్స్ భారతదేశంలో మారుతున్న క్రీడా వేడుకల ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. నేడు క్రీడా విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఐకానిక్ పర్యాటక ప్రాంతాలు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి.

గ్రాండ్ వెల్ కమ్

ఫిల్మ్ సిటీకి చేరుకున్న హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఆటగాళ్లకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ పద్ధతిలో గ్రాండ్ వెల్ కమ్ లభించింది. అనంతరం ఆటగాళ్లు రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణలను వీక్షించారు. ఈ వేడుకలో భాగంగా ఛాంపియన్ టీమ్ సభ్యులు అభిమానులతో ముచ్చటించారు. ఫిల్మ్ సిటీలోని ఐకానిక్ లొకేషన్ల బ్యాక్‌డ్రాప్‌లో ఛాంపియన్ ట్రోఫీతో ఫోటోలు దిగారు.

ఘన సన్మానం

అనంతరం జట్టు సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మేనేజ్‌మెంట్ ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ ఫిల్మ్ సిటీకి వచ్చిన సాధారణ సందర్శకులకు సైతం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. తమకు ఇష్టమైన ఆటగాళ్లను దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు ఛాన్స్ దొరికింది. ప్లేయర్లు కూడా ఈ సమయాన్ని బాగా ఎంజాయ్ చేశారు. బాడీ అండ్ మైండ్ రిఫ్రెష్ చేసుకున్నారు.

కుటుంబంలో ఒకరిగా

"హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టును విజయపథంలో నడిపించి, తొలి టీజీ20 టైటిల్‌ను అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. టోర్నమెంట్ అంతటా జట్టు యాజమాన్యం మాకు అందించిన అచంచలమైన మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడనై ఉంటా.

మా విజయ సంబరాలకు ఆతిథ్యం ఇచ్చి, మమ్మల్ని రామోజీ కుటుంబంలో ఒకరిగా భాగం చేసిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More