IIFA Awards 2026: 12 అవార్డులతో ధురంధర్ సంచలనం.. ఓటీటీలో బెస్ట్ మూవీ, బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే.. ఐఐఎఫ్ఏ అవార్డులు 2026
IIFA Awards 2026: అత్యంత ప్రతిష్టాత్మకమైన 26వ ఐఐఎఫ్‌ఏ అవార్డ్స్ 2026 (IIFA Awards 2026) విజేతల జాబితా అధికారికంగా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ ఏకంగా 12 అవార్డులు కొల్లగొట్టి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.
IIFA Awards 2026: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 26వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' (IIFA Awards 2026) విజేతల వివరాలు వచ్చేశాయి. తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఐఐఎఫ్‌ఏ నిర్వాహకులు శుక్రవారం (అక్టోబర్ 30) వివిధ కేటగిరీల విజేతల జాబితాను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డుల వేడుకలో యంగ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్' (Dhurandhar) సంచలనం సృష్టించింది.

పాపులర్ కేటగిరీలతో పాటు టెక్నికల్ విభాగాలలోనూ క్లీన్ స్వీప్ చేస్తూ ఏకంగా 12 ఐఐఎఫ్‌ఏ పురస్కారాలను 'ధురంధర్' చిత్రం సొంతం చేసుకుంది. అలాగే డిజిటల్ ఓటీటీ విభాగంలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన సిరీస్ 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' అత్యుత్తమ పురస్కారాలను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్, 'సయారా' (Saiyaara) చిత్రానికి గాను ఉత్తమ నటిగా అనీత్ పడ్డా (Aneet Padda) పురస్కారాలను అందుకున్నారు.
'ధురంధర్' జైత్రయాత్ర.. రణవీర్ సింగ్‌కు బెస్ట్ యాక్టర్
'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్' సినిమాకు ఐఐఎఫ్‌ఏ 2026లో అవార్డుల పంట పండింది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన రణవీర్ సింగ్ ‘ఉత్తమ నటుడు’గా ఎంపికయ్యారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం' పురస్కారాన్ని ఈ మూవీని నిర్మించిన జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ అందుకున్నారు.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ డైలాగులు, ఉత్తమ ఒరిజినల్ స్టోరీ కేటగిరీలలో డైరెక్టర్ ఆదిత్య ధర్ ఏకకాలంలో పురస్కారాలు అందుకోవడం విశేషం. సహాయ నటుడిగా సంజయ్ దత్, విలన్ పాత్రలో అక్షయ్ ఖన్నా విజేతలుగా నిలిచారు.
ఐఐఎఫ్‌ఏ అవార్డ్స్ 2026 పూర్తి విజేతల జాబితా
పాపులర్ కేటగిరీ (Popular Categories)
ఉత్తమ చిత్రం (Best Picture): ధురంధర్
ఉత్తమ దర్శకుడు (Best Director): ఆదిత్య ధర్ (ధురంధర్)
ఉత్తమ నటుడు (Best Actor - Male): రణబీర్ సింగ్ (ధురంధర్)
ఉత్తమ నటి (Best Actor - Female): అనీత్ పడ్డా (సయారా - Saiyaara)
ఉత్తమ సహాయ నటుడు (Best Supporting Actor - Male): సంజయ్ దత్ (ధురంధర్)
ఉత్తమ సహాయ నటి (Best Supporting Actor - Female): హుమా ఖురేషి (జాలీ ఎల్ఎల్‌బీ 3)
ఉత్తమ విలన్ (Best Negative Role): అక్షయ్ ఖన్నా (ధురంధర్)
ఉత్తమ సంగీత దర్శకుడు (Best Music Direction): శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం (Best International Film): అవతార్: ఫైర్ అండ్ యాష్ (20th సెంచరీ స్టూడియోస్)
ఉత్తమ ఒరిజినల్ కథ (Best Story Original): ఆదిత్య ధర్ (ధురంధర్)
ఉత్తమ అడాప్టెడ్ స్టోరీ (Best Story Adapted): బషారత్ పీర్, సుమిత్ రాయ్, నీరజ్ ఘైవాన్ (హోమ్‌బౌండ్)
ఉత్తమ గీత రచయిత (Best Lyrics): ఇర్షాద్ కామిల్ (సయారా)
ఉత్తమ నేపథ్య గాయకుడు (Best Male Singer): ఫహీమ్ అబ్దుల్లా (సయారా)
ఉత్తమ నేపథ్య గాయని (Best Female Singer): శ్రేయా ఘోషాల్ (సయారా)
డెబ్యూ కేటగిరీ (Debut Categories):
ఉత్తమ నూతన నటి (Best Female Debut): రాషా తడానీ (ఆజాద్ - Azaad)
ఉత్తమ నూతన నటుడు (Best Male Debut): అహాన్ పాండే (సయారా - Saiyaara)
సాంకేతిక విభాగం (Technical Categories):
ఉత్తమ ఛాయాగ్రహణం (Best Cinematography): వికాస్ నౌలఖా (ధురంధర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (Best Screenplay): ఆదిత్య ధర్ (ధురంధర్)
ఉత్తమ సంభాషణలు (Best Dialogues): ఆదిత్య ధర్ (ధురంధర్)
ఉత్తమ ఎడిటింగ్ (Best Editing): శివకుమార్ వి. పాణికర్ (ధురంధర్)
ఉత్తమ కొరియోగ్రఫీ (Best Choreography): బోస్కో లెస్లీ మార్టిస్ ('ఆవన్ జావన్' పాట - వార్ 2)
ఉత్తమ సౌండ్ డిజైన్ (Best Sound Design): బిశ్వదీప్ ఛటర్జీ (ధురంధర్)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ (Best Sound Mixing): అలోక్ దే (ఛావా - Chhaava)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (Best Background Score): ఏఆర్ రెహమాన్ (ఛావా)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (Best VFX): అసెంబ్లేజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రీడెఫైన్ (ఛావా)
డిజిటల్ ఓటీటీ విభాగం (Digital & Series Winners)
ఉత్తమ డిజిటల్ సిరీస్ (Best Series): ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్
ఉత్తమ డిజిటల్ డైరెక్టర్ (Best Series Director): ఆర్యన్ ఖాన్ (ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
ఉత్తమ డిజిటల్ సినిమా (Best Digital Film): బారాముల్లా (Baramulla)
ఉత్తమ నటుడు (డిజిటల్ ఫిల్మ్): అభిషేక్ బెనర్జీ (స్టోలెన్)
ఉత్తమ నటి (డిజిటల్ ఫిల్మ్): సాన్యా మల్హోత్రా (మిసెస్)
ఉత్తమ నటుడు (డిజిటల్ సిరీస్): జైదీప్ అహ్లావత్ (పాతాళ్ లోక్ 2)
ఉత్తమ నటి (డిజిటల్ సిరీస్): తిల్లోతమా షోమ్ (పాతాళ్ లోక్ 2)
ఉత్తమ డాక్యుసిరీస్ (Best Docuseries): ది రోషన్స్ (The Roshans - నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ రియాలిటీ షో (Best Reality Show): ది ట్రెయిటర్స్ (The Traitors - ప్రైమ్ వీడియో)
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


