Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు చందు నిశ్చితార్థం..హ్యాపీ ఎంగేజ్మెంట్ రా పెద్దోడా అంటూ నడిపోడి విషెస్..వైరల్
Illu Illalu Pillalu chandu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇంటి పెద్ద కొడుకు చందు పాత్ర పోషిస్తున్న ప్రశాంత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా అతని ఎంగేజ్మెంట్ జరిగింది. సీరియల్ లో సాగర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న రఫీక్ ఈ ఎంగేజ్మెంట్ కు అటెండ్ అయ్యాడు. అతను షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
Illu Illalu Pillalu chandu: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రముఖ తెలుగు సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) ఫేమ్ ప్రశాంత్ కడియం (Prashanth Kadiyam) ఓ ఇంటి వాడు కానున్నాడు. అతని ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ సీరియల్ లో 'చందు' (పెద్దోడు) పాత్రలో నటిస్తూ తనదైన అభినయంతో ఆడియన్స్ మనసు గెలుచుకున్న ప్రశాంత్, త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

నెట్టింట పిక్స్ వైరల్
ఈ సంతోషకరమైన క్షణాల్లో సీరియల్‌లో ప్రశాంత్‌కు సోదరుడిగా నటించే సహ నటుడు రఫీక్ (Rafiq) ప్రత్యక్షంగా హాజరై సందడి చేశాడు. వేడుక అనంతరం ప్రశాంత్, ఆయన కాబోయే భార్యతో దిగిన ఫోటోలను రఫీక్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి.
హ్యాపీ ఎంగేజ్మెంట్ రా పెద్దోడా
కాబోయే దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ రఫీక్ ప్రత్యేకంగా ఫొటోలు షేర్ చేశాడు. "ఎంతో ప్రేమతో ప్రారంభమైన ఒక అందమైన ప్రేమకథ ఇది. మీ ఇద్దరి ఉమ్మడి జీవితం ఎల్లప్పుడూ అంతే అందంగా కొనసాగాలని ఆశిస్తున్నాను. అత్యంత అందమైన జంటకు జీవితాంతం నిండైన ప్రేమ, నవ్వులు, సంతోషాలు దక్కాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఎంగేజ్మెంట్ రా పెద్దోడా" అని రఫీక్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
ప్రేమతో కూడిన అనుబంధం
'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ద్వారా ప్రతి ఇంట్లో ఒకడిగా మారిపోయిన ప్రశాంత్ కడియం, తన సహజ నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా కుటుంబ బంధాలు, ఆప్యాయతల నేపథ్యంలో సాగే ఈ సీరియల్‌లో ఆయన పోషిస్తున్న చందు పాత్రకు విశేషమైన ఆదరణ లభించింది. సీరియల్‌లో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా పండించిన ప్రశాంత్, రఫీక్ ఆఫ్-స్క్రీన్ కూడా మంచి స్నేహితులుగా మారారు.
రఫీక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నిశ్చితార్థ ఫోటోలు చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రశాంత్, ఆయన కాబోయే సగభాగం ఎంతో ముచ్చటగా కనిపించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
"పెద్దోడా" అంటూ రఫీక్ చేసిన పోస్ట్ చూసి, "రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ మీ బాండింగ్ చాలా బాగుంది" అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్లతో పాటు 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ టీమ్, పలువురు బుల్లితెర నటీనటులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెల్పుతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


