Illu Illalu Pillalu April 2 Episode: బయటపడ్డ శ్రీవల్లి బండారం- భార్యను గెంటేసిన చందు- అమూల్య చెప్పిన నిజంతో సీన్ రివర్స్
Illu Illalu Pillalu April 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 2 ఎపిసోడ్ లో ప్రేమను ఇరికించాలని శ్రీవల్లి చూస్తుంది. కానీ అమూల్య వచ్చింది అన్నింటికీ కారణం శ్రీవల్లి అని చెప్తుంది. చందు కోపంతో ఊగిపోతాడు. వల్లిని పుట్టింటి దగ్గర వదిలేసి వస్తాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్ని గొడవలకు, బాధలకు కారణం ఎవరో వల్లి అక్కకు తెలుసు అని చందుకు నర్మద చెప్తుంది. దీంతో శ్రీవల్లిని చందు నిలదీస్తాడు. మరి వల్లి ఏం చెప్పింది? ఇంకా ఎవరిని ఇరికించింది? అనేది ఈ రోజు, ఏప్రిల్ 2న ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ లో ఏం జరిగిందన్నది ఇక్కడ చూద్దాం.

ఇడ్లీ సాంగ్
తన బిడ్డకు ఏమైపోతుందోనని భాగ్యం కంగారు పడుతుంది. కానీ సందె పొద్దులకాడా అంటూ సాంగ్ పాడుకుంటూ ఇడ్లీ బాబాయ్ ఫుల్ హుషారుతో భార్య దగ్గరకు వస్తాడు. ఆవిడ గారండీ మనం అమ్మడు ఇంటికి రాములోరి కల్యాణానికి వెళ్తున్నామా లేదా? అని ఇడ్లీ అడుగుతాడు. అక్కడికి వెళ్తే మన పెళ్లి అవుతుందని భాగ్యం అంటే, మళ్లీ పెళ్లి ఆ ఊహా ఎంత బాగుందోనని ఇడ్లీ తేలిపోతాడు.
వల్లీ ఆనందం
అప్పుడే భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. సూపర్ సక్సెస్. ప్రేమ ఫోన్లో ఉన్న నా మాటల రికార్డింగ్ ను ఫుల్ గా డిలీట్ చేసేశానని వల్లి సంతోషంగా చెప్తుంది. శభాష్ అమ్మడు, ఈ భాగ్యం కూతురివి అనిపించావని భాగ్యం జబ్బలు చరుచుకుంటుంది. ఇక ప్రేమ, నర్మదకు ఈఎంఐ పద్ధతిలో రక్త కన్నీరు చూపిద్దామని భాగ్యం చెప్తుంది. ఇక వాళ్లకు సినిమా చూపిద్దామని వల్లి తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
చందు సీరియస్
ఫోన్ కట్ చేసిన వల్లి వెనకాలే ఉన్న చందును చూసి షాక్ అవుతుంది. వల్లిని చందు పక్కకు లాక్కెల్తాడు. నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాచావా? విష్వక్ ను ప్రేమించమని అమూల్యకు చెప్పింది ఎవరు? మా నాన్న హాస్పిటల్ పాలు కావడానికి కారణం ఎవరు? వీటన్నింటికి కారణం ఎవరో నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పు ఎవరా వ్యక్తి? అని చందు కోపంగా అడుగుతాడు.
ప్రేమను ఇరికించాలని
చెప్పు చెప్పు అని చందు సీరియస్ అవుతాడు. సెప్తాను బావ అని విష్వక్ ను ప్రేమించమని అమూల్యకు చెప్పింది ప్రేమ అని వల్లి అబద్దం చెప్తుంది. ప్రేమను ఇరికిస్తుంది. ఈ మాటలు విన్న నర్మద, ప్రేమ, అమూల్య షాక్ అవుతారు. వాళ్ల పుట్టింటి గురించి ఆలోచించి విష్వక్ ను ప్రేమించమని అమూల్యకు ప్రేమ చెప్పింది. ఒట్టు బావ, దేవుడి తోడు. అన్నింటికీ ప్రేమనే కారణమని వల్లి చెప్తుంది.
అమూల్య చెప్పిన నిజం
అప్పుడే అమూల్య కోపంతో ఊగిపోతూ వస్తుంది. వదిన నువ్వు మనిషివేనా? నీ కాపురం గురించి ఆలోచించి ఎవరికీ చెప్పొద్దని అనుకున్నా. కానీ నువ్వు చేసిన తప్పును ప్రేమ వదిన మీదకు తోసేస్తావా? అని అమూల్య అంటుంది. విష్వక్ ను ప్రేమించమని నాకు చెప్పింది వల్లి వదిననే. నన్ను ఫోర్స్ చేసిందని అమూల్య నిజం చెప్పడంతో చందు కోపంతో ఊగిపోతాడు. మీ భార్య గురించి మీకు తెలియాలనే ఇలా చేశామని చందుతో నర్మద అంటుంది.
రాములోరి కల్యాణం
మరోవైపు రాములోరి కల్యాణానికి ఇంకా ఏర్పాట్లు కాలేదా అని వేదవతిపై రామరాజు కోప్పడతాడు. మీ మగాళ్లు ఒక్క పని కూడా చేయరు కానీ కేకలు వేస్తారని బుజ్జమ్మ అంటుంది. అప్పుడే పంతులు వస్తాడు. వెనకాలే వేదవతి అమ్మ, పెద్దమ్మ కూడా వస్తారు.
వల్లి లగేజీ
మరోవైపు వల్లి బట్టలను బ్యాగ్ లో సర్దుతాడు. వల్లి ఏడుస్తూ నర్మద, ప్రేమ మీద లేనిపోని మాటలు చెప్తుంది. వాళ్లు కుట్ర చేశారని అంటుంది. నాకు ఏ పాపం తెలీదు. నన్ను ఇంట్లో నుంచి పంపించేయకు బా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని వల్లి ఏడుస్తుంది. నోర్మూసుకుని మీ ఇంటికి వెళ్లు, లేకపోతే నీ బండారం బయటపెడతానని వల్లి చేతికి చందు బ్యాగ్ ఇస్తాడు. నీ గురించి తెలిస్తే నాన్న తట్టుకోలేడు, అందుకే పంపించేస్తున్నానని చందు ఫైర్ అవుతాడు.
ఇంటి దగ్గర వదిలేసి
మరోవైపు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ రెడీ అవుతారు. భాగ్యంపై ఫీలింగ్స్ కురిపిస్తాడు ఇడ్లీ. వల్లిని పుట్టింట దగ్గర దించేస్తాడు చందు. నేను మోసం చేయొచ్చు కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇది మొదటి తప్పు కింద క్షమించు బావ. ఇంకెప్పుడు ఇలా చేయనని వల్లి అంటుంది. కానీ చందు మాత్రం ఒప్పుకోడు.
ఈ జన్మలో నీ ముఖం చూపించకు అని చందు వెళ్లిపోతాడు. వల్లి ఏడుస్తూ రావడంతో భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కంగారు పడతారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


