రూ.5723 కోట్లు.. ఈ ఏడాది రిలీజైన సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు ఇవి.. రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం
ఇండియన్ బాక్సాఫీస్ ఈ ఏడాది తొలి భాగంలో బ్లాక్‌బస్టర్ అయింది. తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.5723 కోట్లు వసూలు చేయడం విశేషం. అత్యధిక వసూళ్ల సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం రెండో స్థానంలో ఉంది. మరి మిగిలిన మూవీస్ ఏంటి? ఆ రిపోర్టు ఎలా ఉందో చూడండి.
ఈ ఏడాది ఇండియాలో రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. జనవరి నుంచి జూన్ నెల ముగిసే సమయానికి మొత్తంగా దేశంలో అన్ని సినిమాలు కలిపి వసూలు చేసిన మొత్తం రూ.5723 కోట్లు అని ఆర్మాక్స్ రిపోర్టు వెల్లడించింది. వీటిలో ఇండియాలో అత్యధిక గ్రాస్ వసూళ్ల సినిమాల్లో తొలి స్థానంలో హిందీ మూవీ ఛావా ఉండగా.. రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.

కళకళలాడిన బాక్సాఫీస్
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ అయింది. తొలి ఆరు నెలల్లో రిలీజైన అన్ని భాషల సినిమాలు కలిపి ఏకంగా రూ.5723 కోట్లు రాబట్టాయి. గతేడాది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువని ఆర్మాక్స్ రిపోర్టు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.5032 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక గత ఐదేళ్లలో 2022లో అత్యధిక వసూళ్లు రాగా.. దానికి కేవలం రూ.15 కోట్ల దూరంలో నిలిచిపోయింది.
ఈ ఏడాది రూ.693 కోట్లతో ఛావా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక మొత్తంగా 17 సినిమాలు రూ.100 కోట్ల మార్క్ దాటాయి. ఇండియా డొమెస్టిక్ బాక్సాఫీస్ వద్ద ఒకే ఒక్క సినిమా మాత్రమే రూ.250 కోట్ల మార్క్ అందుకున్నట్లు ఈ రిపోర్టు తెలిపింది.
తెలుగు సినిమా సత్తా
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. డొమెస్టిక్ గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే.. మొత్తం వసూళ్లలో 19 శాతం మన తెలుగు మూవీసే సాధించాయి. 39 శాతంతో హిందీ సినిమా తొలి స్థానంలో నిలిచింది. ఇక తమిళ సినిమాలు 17 శాతం, మలయాళం, హాలీవుడ్ చెరో 10 శాతం, మిగిలినవి 5 శాతం వసూళ్లు సాధించినట్లు ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ తెలిపింది.
ఇక గ్రాస్ డొమెస్టిక్ వసూళ్లలో రూ.693 కోట్లతో ఛావా తొలి స్థానంలో నిలవగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.222 కోట్లతో రెండో స్థానం సాధించడం విశేషం. ఆ తర్వాత వరుసగా సితారే జమీన్ పర్, హౌజ్‌ఫుల్ 5, రైడ్ 2 ఉన్నాయి. ఇక టాప్ 10లో గేమ్ ఛేంజర్ కూడా రూ.153 కోట్లతో నిలిచింది.
ఫిబ్రవరిలో అత్యధికం
ఇక నెలవారీగా చూసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ఆ నెలలో వచ్చిన సినిమాలు రూ.1264 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వసూళ్లు సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాతి నెల అంటే మార్చిలో మాత్రం కేవలం రూ.580 కోట్లు మాత్రమే వచ్చాయి. జనవరిలో రూ.1020 కోట్లు, ఏప్రిల్లో రూ.813 కోట్లు, మేలో రూ.1126 కోట్లు, జూన్ లో రూ.920 కోట్లు వసూలు చేశాయి. మొత్తంగా 2025లో తొలి భాగంలో అన్ని భాషల సినిమాలు కలిపి రూ.5723 కోట్లు రాబట్టడం విశేషం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



