T20 Raha Kapoor: భారత్ ఘన విజయం- స్టేడియంలో యానిమల్ హీరో కూతురు రాహా కపూర్ సందడి- ముచ్చటగా రియాక్షన్స్- వీడియో వైరల్

Raha Kapoor Reacts To India Vs England T20 Semi Final: ఇంగ్లాండ్‌పై ఘనవిజయంతో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఉత్కంఠభరిత సెమీఫైనల్ మ్యాచ్‌లో రణ్‌బీర్, అలియా కూతురు రాహా కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమ్ ఇండియా గెలిచిన తర్వాత రాహా కపూర్ రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Mar 6, 2026, 11:31:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముంబైలోని వాంఖడే స్టేడియం మరో చారిత్రక విజయానికి వేదికైంది. హోరాహోరీగా సాగిన టీ 20 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

భారత్ ఘన విజయం- స్టేడియంలో యానిమల్ హీరో కూతురు రాహా కపూర్ సందడి- ముచ్చటగా రియాక్షన్స్- వీడియో వైరల్
భారత్ ఘన విజయం- స్టేడియంలో యానిమల్ హీరో కూతురు రాహా కపూర్ సందడి- ముచ్చటగా రియాక్షన్స్- వీడియో వైరల్

రాహా కపూర్ సందడి

ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సెమీ ఫైనల్స్ జరిగిన మైదానంలో ఆటగాళ్ల మెరుపుల కంటే గ్యాలరీలో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ దంపతుల కూతురు రాహా కపూర్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రాహా క్లాప్స్.. అలియా నవ్వులు!

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రణ్‌బీర్ కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కానీ, కెమెరా కళ్లన్నీ బుజ్జి రాహాపైనే ఉన్నాయి. తన తండ్రి రణ్‌బీర్ ఒడిలో కూర్చుని రాహా కపూర్ ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొట్టింది.

చిట్టి చేతులతో క్లాప్స్

స్టేడియంలో అందరూ రిథమిక్‌గా చప్పట్లు కొడుతుంటే, వారిని అనుకరిస్తూ రాహా కూడా తన చిట్టి చేతులతో క్లాప్స్ కొట్టడం చూసి అలియా భట్ మురిసిపోయింది. కూతురి ముద్దు ముద్దు చేష్టలను చూస్తూ అలియా నవ్వుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సెమీ ఫైనల్స్‌లో టీమిండియా గెలిచిన తర్వాత రాహా కపూర్ సందడి వైరల్‌గా మారింది.

ముచ్చటగా ఉంది

"రాహాను చూస్తుంటే ముచ్చటగా ఉంది. భర్త, బిడ్డతో కలిసి స్టేడియంలో మ్యాచ్ చూడటం ప్రతి క్రికెట్ ప్రేమికుడి కల" అని ఒక అభిమాని కామెంట్ చేయగా, "క్యూటెస్ట్ మున్చ్‌కిన్" అంటూ నెటిజన్లు రాహాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నా కూతురే నా ఇన్‌స్పిరేషన్: అలియా

ఇటీవలే లండన్‌లో జరిగిన బాఫ్టా (BAFTA) అవార్డుల వేడుకలో పాల్గొన్న అలియా భట్ తన కూతురు రాహా గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "ప్రస్తుతం నా జీవితంలో నిజమైన మ్యాజిక్, నా ఇన్‌స్పిరేషన్ నా కూతురే. ఆమెకు ఇప్పుడు మూడేళ్లు. అప్పుడప్పుడు నా పాటలకే ఆమె డ్యాన్స్ చేస్తుంటే చూడటం నాకు లభిస్తున్న అతిపెద్ద బహుమతి. అదే అసలైన జీవితం అనిపిస్తుంది" అని అలియా భట్ పేర్కొన్నారు.

వరుస సినిమాలతో బిజీ..

వృత్తి పరంగా చూస్తే, అలియా భట్ చివరిగా 2024లో 'జిగ్రా' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) లో అలియా భట్ నటిస్తున్నారు.

భర్తతో కలిసి

ఇందులో బాబీ డియోల్, శర్వరీ వాఘ్ కూడా నటిస్తున్నారు. అలాగే, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తన భర్త రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి 'లవ్ అండ్ వార్' చిత్రంలోనూ అలియా భట్ నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More