రాజీవ్ గాంధీ హత్యపై ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయిన ట్రైలర్.. హంతకులను ఎలా పట్టుకున్నారంటే?
ఓటీటీలోకి మరో అదిరిపోయే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో హంతకులను ఎలా పట్టుకున్నారో కళ్లకు కట్టినట్లుగా చూపించబోతోంది ఈ సిరీస్. సోనీ లివ్ ఓటీటీ ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య గురించి తెలుసు కదా. సుమారు 35 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో దర్యాప్తు సాగిన తీరు, 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారన్న దానిపై ది హంట్ పేరుతో వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్ ను బుధవారం (జూన్ 18) మేకర్స్ రిలీజ్ చేశారు.

ది హంట్ ఓటీటీ రిలీజ్ డేట్
దేశాన్ని షాక్‌కు గురి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తుపై ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ (The Hunt: The Rajeev Gandhi Assassination Case) పేరుతో వెబ్ సిరీస్ వస్తోంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో ఈ సిరీస్ జులై 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని బుధవారం (జూన్ 18) ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.
“దేశాన్ని కంపింపజేసిన హత్య. ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేసిన హంతకుల వేట. ది హంట్ : ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ జులై 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్రైలర్ రిలీజ్ చేసింది.
ది హంట్ ట్రైలర్ ఎలా ఉందంటే?
ది హంట్ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ ట్రైలర్ మొదట్లోనే శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఇండియన్ హైకమిషన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు. రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా అంటూ ఆ వ్యక్తి అడుగుతారు. ఆ తర్వాత మానవబాంబు సిద్ధమవుతుండటం చూపిస్తారు. ఆ వెంటనే మాజీ ప్రధాని రాజీవ్ హత్యకు గురైనట్లు చెప్పే వార్తను చూడొచ్చు. ఈ హత్య కేసును అత్యంత తీవ్రంగా పరిగణించే ప్రభుత్వం వెంటనే దర్యాప్తుకు ఆదేశిస్తుంది.
ఇది ఎల్టీటీఈ పనా లేక స్వదేశంలోనే ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అన్న చర్చ జరుగుతుంది. సీఆర్పీఎఫ్ ఐజీపీ కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను ఏర్పాటు చేస్తారు. మొదట శ్రీలంకన్ తమిళులతో దర్యాప్తు మొదలుపెడతారు. కేవలం 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారన్నది ఈ ది హంట్ వెబ్ సిరీస్ లో దర్శకుడు నగేష్ కుకునూర్ చూపించబోతున్నాడు.
హైదరాబాద్ కు చెందిన నగేష్ కుకునూర్ ఎప్పుడో 1998లో హైదరాబాద్ బ్లూస్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మధ్యే సిటీ ఆఫ్ డ్రీమ్స్, మోడర్న్ లవ్ హైదరాబాద్ పేరుతో రెండు వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు తీరుపై సిరీస్ రూపొందించాడు. మరి ఈ కొత్త సిరీస్ ఎలా ఉండనుందో జులై 4న తెలుస్తుంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



