ఇట్లు మీ ఎదవ రివ్యూ- బొమ్మరిల్లు లాంటి కాన్సెప్ట్- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఇట్లు మీ ఎదవ. త్రినాధ్ కఠారి హీరోగా చేస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాహితీ అవాంచ, హీరోయిన్‌గా చేసింది. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఇట్లు మీ ఎదవ మూవీ ప్రీమియర్స్ నిన్నే పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఇట్లు మీ ఎదవ రివ్యూలో తెలుసుకుందాం.

Nov 21, 2025, 13:01:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: ఇట్లు మీ ఎదవ

ఇట్లు మీ ఎదవ రివ్యూ- బొమ్మరిల్లు లాంటి కాన్సెప్ట్- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
ఇట్లు మీ ఎదవ రివ్యూ- బొమ్మరిల్లు లాంటి కాన్సెప్ట్- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

నటీనటులు: త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ తదితరులు

రచన, దర్శకత్వం: త్రినాధ్ కటారి

సంగీతం: ఆర్పీ పట్నాయక్

సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి

ఎడిటింగ్: ఉద్ధవ్ ఎస్‌బీ

బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్

నిర్మాత: బళ్లారి శంకర్

విడుదల తేది: 21 నవంబర్ 2025

తెలుగులో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఇట్లు మీ ఎదవ. త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వం వహించిన ఇట్లు మీ ఎదవ మూవీలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది.

థియేటర్లలో ఇవాళ (నవంబర్ 21) విడుదలైన ఇట్లు మీ ఎదవ ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే పడిపోయాయి. వెయ్యేళ్లు వర్ధిళ్లు అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఇట్లు మీ ఎదవ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఆవారాగా తిరిగే శ్రీను (త్రినాధ్ కఠారి) ఆరేళ్లుగా పీజీ చేస్తూనే ఉంటాడు. తన కాలేజీలో చేరిన మనస్విని (సాహితీ అవాంచ)ను చూసి లవ్‌లో పడతాడు. తన బిహేవియర్ మార్చుకుని మనస్విని ప్రేమ పొందుతాడు. కొడుకు మార్పు చూసిన శ్రీను తండ్రి (గోపరాజు రమణ) ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు.

అందుకు మనస్విని తండ్రి (దేవి ప్రసాద్)తో సంబంధం మాట్లాడేందుకు శ్రీను తండ్రి వెళ్తాడు. అక్కడ శ్రీను ఎదవ ప్రవర్తన తెలిసి తిరస్కరిస్తాడు మనస్విని తండ్రి. ఈ విషయం డాక్టర్ (తనికెళ్ల భరణి) దగ్గరికి వెళ్తుంది. దాంతో 30 రోజులు శ్రీనును మనస్విని తండ్రితో ఉండాలని, ఈ టైమ్‌లో శ్రీను నిజంగా ఎదవ అని తేలితే ప్రేమను వదులుకోవాలని ఛాలేంజ్ చేస్తాడు డాక్టర్.

ఆ ఛాలెంజ్‌కు అంతా ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? ప్రేమించిన అమ్మాయి తండ్రితో 30 రోజులు శ్రీను ఎలా గడిపాడు? తన ప్రేమను నిరూపించుకున్నాడా? శ్రీను ఎదవ అనే తేలిందా? మరి వీరి ప్రేమ ఏమైంది? అనేది తెలియాలంటే ఇట్లు మీ ఎదవ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇట్లు మీ ఎదవ మూవీ కథ కాస్తా బొమ్మరిల్లు సినిమాను తలపిస్తుంది. అయితే, ఇక్కడ హీరోయిన్ తండ్రితో హీరో ఉంటాడు. రెగ్యులర్ స్టోరీని కామెడీతో వడ్డించారు డైరెక్టర్ అండ్ హీరో. ఫస్టాఫ్ అంతా కాలేజ్, లవ్ సీన్స్, హీరోయిన్ హీరో లవ్ ఒప్పుకోవడంతో సాగిపోతుంది.

ఇంటర్వెల్ దగ్గర వచ్చే 30 రోజుల ఛాలెంజ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ కథ ఏంటో తెలిసినప్పటికి సన్నివేశాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అయితే ప్రేక్షకుడిలో మెదులుతాయి. దానికి తగినట్లుగానే సీన్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల అనవసరంగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ తండ్రి ట్రాక్ బాగానే మలిచారు.

ఊహించని క్లైమాక్స్

ఎమోషనల్‌గా వర్కౌట్ అయింది. ఊహించని విధంగా క్లైమాక్స్ ఉండి సర్‌ప్రైజ్ చేస్తుంది. కథకు భిన్నంగా క్లైమాక్స్ డిజైన్ చేయడం మూవీకి ప్లస్ పాయింట్‌లా, హైలెట్‌గా నిలిచింది. కామెడీ ట్రాక్ బాగుంది. హీరోగా ఎదవ పాత్రలో త్రినాధ్ మెప్పించాడు. దర్శుకుడిగా ఇంకాస్తా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది.

ఫైనల్‌గా చెప్పాలంటే

హీరోయిన్ సాహితీ అవాంచ పర్వాలేదు. మిగతా పాత్రలు తమ అనుభవంతో ఆకట్టుకన్నారు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్స్, ఎడిటింగ్ ఓకే. సంగీతం, బీజీఎమ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఎదవల కామెడీ పండించి చివరికి మెసేజ్ ఇచ్చే ఇట్లు మీ ఎదవ.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More