తెలుగు డైరెక్టర్ తీసిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. 120 కోట్ల కలెక్షన్లు..ఓటీటీలోకి ఎప్పుడంటే?
తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ జాట్ ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఎక్కువ మంది తెలుగు టెక్నీషియన్స్ పని చేసిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఎప్పుడు వస్తుందో చూసేయండి.
డాన్ శీను, బలుపు, క్రాక్, వీర సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో తీసిన ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ను అలరించేందుకు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. ఆ మూవీనే.. ‘జాట్’. సన్నీ డియోల్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుంది.

ఎప్పుడంటే?
తెలుగు డైరెక్టర్గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘జాట్’. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజైన ఈ మూవీ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించింది. కలెక్షన్ల మోత మోగించింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ జూన్ 6న ఓటీటీలోకి రాబోతుంది.
ఆ ఓటీటీలోనే
జాట్ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఈ మూవీ జూన్ 6న డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడైతే ఈ మూవీ హిందీలోనే అందుబాటులోకి రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో కచ్చితంగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసే అవకాశముంది.
అంతా తెలుగువాళ్లే
పేరుకే జాట్ బాలీవుడ్ సినిమా.. కానీ దీని కోసం పని చేసిన టెక్నిషియన్స్ లో ఎక్కువ శాతం తెలుగు వాళ్లే. గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టగా.. ఎస్ఎస్ తమన్మ్యూజిక్ అందించారు. శ్రీవినాస్ గవిరెడ్డి, కుందన్ పాండేతో కలిసి గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే బాధ్యతలూ చూసుకున్నారు. సౌరభ్ గుప్తాతో కలిసి సాయి మాధవ్ బుర్రా డైైలాగ్స్ రాశారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి మూవీ నిర్మించాయి. నవీన్ నూలి ఎడిటర్.
మాస్ ఎలివేషన్లు
జాట్ మూవీలో మాస్ ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. హీరోగా సన్నీ డియోల్ అదరగొట్టారు. విలన్ గా రణదీప్ హుడా కూడా సత్తాచాటారు. రెజీనా కసాండ్రా, సయామి ఖేర్, వినీత్ కుమార్ తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోనే సాగుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఆరో బాలీవుడ్ సినిమాగా జాట్ కొనసాగుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



