మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒక రోజు ముందుగానే..

తెలుగు డైరెక్టర్ తీసిన హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా.. అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే రానుండటం విశేషం. మరి ఈ మూవీ ఎక్కడ చూడాలంటే..?

Published on: Jun 04, 2025 8:22 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన తొలి హిందీ మూవీ జాట్ (Jaat). ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు సక్సెస్ సాధించింది. ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒక రోజు ముందుగానే..
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒక రోజు ముందుగానే..

జాట్ ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగులో డాన్ శీను, బలుపు, క్రాక్, వీర సింహారెడ్డిలాంటి సినిమాలను తీసిన గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతోంది. గురువారం (జూన్ 5) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని నెట్ఫ్లిక్స్ బుధవారం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

నిజానికి శుక్రవారం (జూన్ 6) నుంచి వస్తుందని భావించినా.. ఒక రోజు ముందే స్ట్రీమింగ్ కాబోతోంది. “జాట్ సెట్ గో. మాస్ యాక్షన్, డ్రామా, రెండున్న కిలోల చేయి తీసుకొని జాట్ వస్తున్నాడు. జూన్ 5న హిందీ, తెలుగులో నెట్‌ఫ్లిక్స్ లో జాట్ చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.

జాట్ మూవీ గురించి..

జాట్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.120 కోట్లు వసూలు చేసింది.పేరుకే జాట్ బాలీవుడ్ సినిమా.. కానీ దీని కోసం పని చేసిన టెక్నిషియన్స్ లో ఎక్కువ శాతం తెలుగు వాళ్లే. గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టగా.. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. శ్రీనివాస్ గవిరెడ్డి, కుందన్ పాండేతో కలిసి గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే బాధ్యతలూ చూసుకున్నాడు.

సౌరభ్ గుప్తాతో కలిసి సాయి మాధవ్ బుర్రా డైైలాగ్స్ రాశాడు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి మూవీ నిర్మించాయి. నవీన్ నూలి ఎడిటర్. జాట్ మూవీలో మాస్ ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. హీరోగా సన్నీ డియోల్ అదరగొట్టాడు. విలన్ గా రణదీప్ హుడా కూడా సత్తాచాటాడు. రెజీనా కసాండ్రా, సయామి ఖేర్, వినీత్ కుమార్ తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఆరో బాలీవుడ్ సినిమాగా జాట్ కొనసాగుతోంది.

News/Entertainment/మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒక రోజు ముందుగానే..
News/Entertainment/మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒక రోజు ముందుగానే..