...
...
Next Story

జీ తెలుగులో మరో కొత్త సీరియల్ జయం- మారిన ఇతర సీరియల్స్ టైమింగ్స్- జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పే మోటివేషన్‌తో!

బుల్లితెర ఛానెల్ జీ తెలుగులో మరో కొత్త సీరియల్ జయం ప్రారంభం కానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే ఈ సీరియల్ జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో చెబుతుందని మేకర్స్ అంటున్నారు. ఇక జయం సీరియల్ టీవీ ప్రీమియర్‌తో ఇతర సీరియల్స్ టైమింగ్స్‌లో మార్పులు ఉండనున్నాయి.

Published on: Jul 12, 2025, 10:45:47 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్​ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్‌​తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్​ ‘జయం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్​ జయం​.

సవాళ్లను ఎదుర్కొంటూ

జీ తెలుగులో మరో కొత్త సీరియల్ జయం- మారిన ఇతర సీరియల్స్ టైమింగ్స్- జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పే మోటివేషన్‌తో!
జీ తెలుగులో మరో కొత్త సీరియల్ జయం- మారిన ఇతర సీరియల్స్ టైమింగ్స్- జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పే మోటివేషన్‌తో!

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్​ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జయం జులై 14న ప్రారంభం కానుంది. అంటే మరో రెండు రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు జీ తెలుగులో జయం సీరియల్ ప్రసారం కానుంది.

జయం సీరియల్ కథ

జయం సీరియల్ కథ విషయానికొస్తే.. మాజీ బాక్సర్​ రుద్ర ప్రతాప్​ (శ్రీరామ్​ వెంకట్​), పేదింటి అమ్మాయి గంగావతి (వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా.. పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది.

జయం సీరియల్ ట్విస్టులు

వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే అని మేకర్స్ చెబుతున్నారు.

జయం సీరియల్ ప్రెస్ మీట్

అయితే, జయం సీరియల్​ విశేషాలు పంచుకోడానికి జులై 11న హైదరాబాద్‌​లోని ప్రసాద్​ ల్యాబ్స్‌​లో ప్రెస్​ మీట్​ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో జయం సీరియల్​ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్​ వెంకట్​, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.

నటుడు శ్రీరామ్ వెంకట్ కామెంట్స్

జయం సీరియల్​ టీవీ ప్రీమియర్తో ఇతర ధారావాహికల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జులై 14 నుంచి చామంతి రాత్రి 8:30 గంటలకు, జగద్ధాత్రి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks